Coordinates: Coordinates: Unknown argument format

ముధోల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ముధోల్
—  శాసనసభ నియోజకవర్గం  —
ముధోల్ is located in తెలంగాణ
ముధోల్
ముధోల్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిర్మల్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు రామారావు పటేల్

నిర్మల్ జిల్లాలోని 3 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో ముధోల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 జి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జి.గడ్డన్న ఇండిపెండెంట్
1967 జి.గడ్డన్న ఇండిపెండెంట్ జి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ
ఏకగ్రీవఎన్నిక
1978 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ కదం భీమారావు జనతా పార్టీ
1983 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ ఏ.హన్మంతరావు తెలుగుదేశం పార్టీ
1985 ఏ.హన్మంతరావు తెలుగుదేశం పార్టీ జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ
1989 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ విఠల్ తెలుగుదేశం పార్టీ
1994 భోస్లే నారాయణరావు పాటిల్ తెలుగుదేశం పార్టీ జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ
1999 జి.గడ్డన్న కాంగ్రెస్ పార్టీ భోస్లే నారాయణరావు పాటిల్ తెలుగుదేశం పార్టీ
2004 భోస్లే నారాయణరావు పాటిల్ తెలంగాణ రాష్ట్ర సమితి జగదీష్ మశెట్టివార్ భారతీయ జనతా పార్టీ
2009 సముద్రాల వేణుగోపాలాచారి తెలుగుదేశం పార్టీ గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పడకంటి రమాదేవి బీజేపీ
2018 గడ్డిగారి విఠల్ రెడ్డి టీఆర్ఎస్ పడకంటి రమాదేవి బీజేపీ
2023[2] పవార్ రామారావు పటేల్ బీజేపీ గడ్డిగారి విఠల్ రెడ్డి బీఆర్ఎస్

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ముధోల్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థి నారాయణరావు సమీప భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి జగదీష్ పై 41562 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నారాయణరావు 78175 ఓట్లు పొందగా, జగదీష్‌కు 36613 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 నారాయణరావు తెలంగాణ రాష్ట్ర సమితి 78175
2 జగదీష్ మాశెట్టివర్ భారతీయ జనతా పార్టీ 36613
3 నారాయణరెడ్డి ఇండిపెండెంట్ 5240
4 వడ్ల నాగభూషణ్ బి.ఎస్.పి 3519
5 చింట్ల భోజన్న ఇండిపెండెంట్ 2483
6 గంగామణి ఇండిపెండెంట్ 1542
7 సాగర్ ఆగ్రె ఇండిపెండెంట్ 1219

2023 ఎన్నికలు

[మార్చు]

2023 లో నిర్మల్ జిల్లా ముధోల్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి [3].ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ 23,419 ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి పై విజయం సాధించారు. ముధోల్ నియోజకవర్గంలో మొత్తం 19 రౌండ్లో వారీగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్ కు 96,799 ఓట్లు 48.59% , భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గడ్డం విఠల్ రెడ్డి కి 73,380 ఓట్లు 36.72%, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భోస్లే నారాయణరావు పటేల్ కు 15,394 ఓట్లు 7.71% ,నోటాకు 1.906 ఓట్లు 0.94% వచ్చాయి.భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రామారావు పటేల్ 23,419 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు.ముధోల్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు[4].

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 పవార్ రామారావు పటేల్ భారతీయ జనతా పార్టీ 96,799
2 తెలంగాణ రాష్ట్ర సమితి గడ్డి వారి విఠల్ రెడ్డి 73,380
3 భోంస్లే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ 15,394
4 మన్మోహన్ జాదవ్ బి.ఎస్.పి ఇండిపెండెంట్
5 వినోద్ కుమార్ శారదరావు ఇండిపెండెంట్ 3,292
6 నోటా నోటా 1906
7 సంజుహెమ్లే ఇండిపెండెంట్ 1.442

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (28 October 2023). "గడ్డెన్న.. ఇక్కడ పెద్దన్న". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. "https://telugu.samayam.com/elections/telangana-assembly-elections/mudhole-constituency-10". Samayam Telugu. Retrieved 2024-06-11. {{cite web}}: External link in |title= (help)
  4. "Mudhole Constituency Election Results 2023: Mudhole Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-11.

వెలుపలి లంకెలు

[మార్చు]