అంగచూషణ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసంలో విషయం అన్ని వయసుల వారికి చదవదగ్గది కాదు. జాగురూకతతో ఉండగలరు. 18 ఏళ్ళలోపు వ్యక్తులు, ఈ పుట నుండి నిష్క్రమించడం మంచిది. |
ముఖరతి అంగచూషణ అనేది రతిలో భాగం. సంభోగానికి ముందు ఒకరినొకరు ఉత్తేజ పరిచే ప్రక్రియ. ఇందులో స్త్రీ, పురుషుడి జననాంగాన్ని, పురుషుడు, స్త్రీ జననాంగాన్ని నోటితో ప్రేరేపించడం జరుగుతుంది. స్తీ, ద్వారా జరుపబడే అంగచూషణని ఫెలేషియో అని, పురుషుడు జరిపే అంగచూషణని కన్నిలింగస్అని అంటారు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని ప్రేరేపించడాన్ని ముఖరతిగా పేర్కొనరు. ఇది రతి ప్రక్రియకు ముందు సహాయకారిగా ఉపయోగిస్తారు. సాధారణమైన రతి భంగిమలు దీనికి సరిపోతాయి. చాలా దేశాల సంస్కృతులలో ముఖరతిని నిషేధించాయి. స్వలింగ సంపర్కులు, కూడా అంగ చూషణకు పాల్పడటం పరిపాటి.
- గర్భం: స్త్రీలు జరిపే ఫెలేషియో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడం జరుగదు. వీర్యం జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు.
- సుఖ వ్యాధులు: అయితే ఒకరి ఉండి మరొకరికి కొన్ని సుఖ వ్యాధులు, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ వ్యాపిస్తాయి. నోటిలో ఏవైనా పుండ్లు లేదా గాయాలు ఉంటే వీటి వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన జననేంద్రియాల పరిశుభ్రత చాలా అవసరం.
పురుషుడి పైకెక్కి, తన యోని ని, అతని నోటికి అందించి సుఖపడుతున్న వనిత. చిత్రం గీసిన వారు Francesco Hayez
.
కామసూత్రలో పేర్కొనబడ్డ అంగ చూషణ విపరీత భంగిమ.
అంగ చూషణ చిత్రం గీసిన వారు Édouard-Henri Avril.