అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)

వికీపీడియా నుండి

అంగలూరు కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలములోని ఒక గ్రామము. హేతువాద రచయిత, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ గ్రామమునకు చెందిన వాడే. ఒక కథనము ప్రకారము ఈ ఊరు 12వ శతాబ్దము నుండి ఉన్నది. పూర్వము ఇక్కడ సైన్యము కొరకు అంగళ్లు ఉండటము వలన అంగళ్లూరు అని పేరు వచ్చినది. ఆంగళ్లూరు కాలక్రమేణా అంగలూరు అయినది. ఈ చిన్న గ్రామము అనేకమంది స్వాతంత్ర్యసమరయోధులను అందించినది.

గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే రహదారిలో గుడివాడనుండి 5 కి.మీ. దూరంలో ఈ వూరుంది. బస్సు సౌకర్యం ఉంది. ఆటోల, మోటారు సైకిళ్ళు ఇతర ముఖ్య ప్రయాణ సాధనాళు.

విషయ సూచిక

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

వ్యవసాయంపై ఆధారపడిన ఈ వూరిలో ప్రధానమైన పంట వరి. ముఖ్యమైన నీటివనరు కృష్ణాకాలువలు.

[మార్చు] సౌకర్యాలు

అంగలూరులో బాలికల హైస్కూలు చాలా కాలంనుండి (బ్రిటిష్‌వారి కాలం నుండి) ఉంది. బాలికలకు హైస్కూలు ఉండడం అప్పట్లో చాలా అరుదు. బహుశా కృష్ణా జిల్లాలో అప్పటికి ఇదొక్కటే ఈ విధమైన పాఠశాల కావచ్చును.

[మార్చు] ఇతరాలు

దుగ్గిరాల, త్రిపురనేని అనే ఇంటి పేరులు గల కుటుంబాలు ఈ వూళ్ళో చాలా కాలంగా ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నారు.

[మార్చు] తాజుద్దీన్ బాబా ,జ్ఞాన శాయి మందిరం

మత సామరస్యం వెల్లి విరుస్తూ తాజుద్దీన్ బాబా ,జ్ఞాన శాయి మందిరం ఒకే ప్రాంగణం లో అరుదైన ఆద్యాత్మిక కేంద్రం ఉంది.

[మార్చు] బయటి లింకులు


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె