అంజన

వికీపీడియా నుండి

అంజన వానరుడైన కుంజరుడి కూతురు, కేసరి భార్య. ఈమెకు వాయుదేవుడి కారణంగా హనుమంతుడు జన్మించెను.

[మార్చు] సంభందిత పురాణ కధలు

విచిత్ర రామాయణం లో అంజన పుట్టుక గురించి ఓ వింత కథ ఉంది: అంజన అహల్య, గౌతమ ముని కుమార్తె. ఒకనాడు గౌతముడు లేని సమయంలో సూర్యుడు అహల్య వద్దకు వచ్చాడట. ఆ తేజానికి అంజన కళ్ళు చూపుని కోల్పోయాయి. తరువాత అహల్య కి సూర్యుని వల్ల ఓ కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఆమెకి మరియొక కుమారుడు కలిగాడు. కొన్నాళ్ళకు ఓ రోజు గౌతముడు కుమారులను ఎత్తుకుని కూతురిని నడిపించుకుని సముద్రతీరం లో తిరుగుతూ ఉంటే అంజన - "నీ కూతురిని నడిపించి పరుల బిడ్డలను ఎత్తుకుంటావా?" అన్నదట. దానితో గౌతముడు సందేహించి - "మీరు పరుల బిడ్డలైతే మీ ముఖాలు వానరముఖాలగుగాక" అని శపించి వారిని సముద్రం లోకి తోశాడు. ఆ పిల్లలే వాలి సుగ్రీవులైనారని, తన గుట్టు బయట పెట్టినది కనుక అహల్య అంజనను - నీయందు వానరుడు జన్మించునని శపించెననీ - విచిత్ర రామాయణం లో ఉంది.

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=అంజన&oldid=371146" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె