అంజి (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అంజి (2004)
Chiruinandasanji.jpg
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి
రచన సత్యానంద్
తారాగణం చిరంజీవి, నమ్రతా శిరోద్కర్, టినూ ఆనంద్, నాగేంద్ర బాబు, ఎమ్మెస్ నారాయణ, రామిరెడ్డి
సంగీతం మణిశర్మ
నేపథ్య గానం ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
ఛాయాగ్రహణం ఛోటా కె. నాయుడు
విడుదల తేదీ ఫిబ్రవరి, 2004
భాష తెలుగు

అంజి 2004 లో విడుదలైన ఒక సోషియో ఫాంటసీ తెలుగు చిత్రం.

కథ[మార్చు]

హిమాలయాల్లో ఉన్న శివుని యొక్క ఆత్మలింగం అద్భుతమైన శక్తులను కలిగి ఉంటుంది. ప్రతి 72 ఏళ్ళకు ఒకసారి, ఆకాశ గంగ స్వయంగా భూమికి దిగి వచ్చి ఆత్మలింగాన్ని అభిషేకిస్తుంది. ఆ సమయంలో ఆ పవిత్ర జలాన్ని సేవించిన వారికి మరణముండదు. నిత్య యవ్వనులవుతారు. వారికి అద్భుత శక్తులు ప్రాప్తిస్తాయి.

1932 లో భాటియా (భూపిందర్ సింగ్) అనే వ్యక్తి ఎలాగైనా ఆ అత్మ లింగాన్ని సంపాదించి ఆకాశ గంగను తాగాలని ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ ప్రయత్నంలో విఫలమై తన కుడి చేయిని కోల్పోతాడు. 72 ఏళ్ళ తర్వాత 2004 లో భాటియా అమెరికాలో ఉంటాడు. ఆయన అప్పుడు 99 ఏళ్ళ వృద్ధుడవుతాడు. ఆత్మలింగాన్ని గురించి వెతికి వెతికి విసిగి వేసారి పోయి ఉంటాడు. అదే సమయంలో ఆత్మలింగం గురించి జీవితకాలం పరిశోధన చేసిన ఒక ప్రొఫెసర్ గురించి తెలుస్తుంది. ఆయన తన పరిశోధనలో కనుగొన్న విషయాలన్నీ తన డైరీలో పొందుపరచి ఉంటాడు. దాన్ని ఎలాగైనా కాజేయాలని చూస్తున్న భాటియా నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసిన ప్రొఫెసర్ అమెరికాలో ఉన్న తన విద్యార్థియైన స్వప్న (నమ్రతా శిరోద్కర్) కు చేరవేస్తాడు. దాన్ని అందుకున్న స్వప్న తన ప్రొఫెసర్ కు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు తిరిగి వస్తుంది. కానీ అప్పటికే భాటియా మనుషులు ఆయన్ను చంపేసి ఉంటారు. అదే మనుషులు ఆమెను కూడా వెంబడించడంతో అంజి (చిరంజీవి) తారసపడతాడు. అంజి ఉరవకొండ అరణ్య ప్రాంతంలో ఒక ఆశ్రమం నిర్మించి అక్కడి ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ, అనాథ పిల్లల్ని చేరదీస్తూ జీవనం సాగిస్తున్న శివన్న (నాగేంద్ర బాబు) దగ్గర పనిచేస్తూ పరోపకారిగా ఉంటాడు.

ఒకరోజు ప్రమాదవశాత్తూ లోయలోపడ్డ అంజికి ఆత్మలింగం తారసపడుతుంది. దానికున్న మహిమ పూర్తిగా తెలియకపోయినా దానికి కొన్ని శక్తులు ఉన్నాయని గ్రహించిన అంజి దానిని ఆశ్రమానికి తీసుకువస్తాడు. దాన్ని గురించి తెలుసుకున్న భాటియా వారిని వెంబడిస్తాడు. ఆకాశగంగ అభిషేకించే రోజు దగ్గరపడుతుండటంతో ఆ ఆత్మలింగాన్ని చేరాల్సిన చోటుకి చేర్చమని అంజికి సలహా ఇస్తాడు శివన్న. దాన్ని అనేక కష్టనష్టాలకోర్చి ఎలా హిమాలయాల్లోకి చేర్చాడు. భాటియాను ఎలా చంపాడన్నది సినిమా చివరి భాగం.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. అబ్బో నీ అమ్మ గొప్పదే - రచన: భువనచంద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు కల్పన
  2. ఓం శాంతి ఓం శాంతి - రచన: చంద్రబోస్ - గానం: గంగ మరియు శంకర్ మహదేవన్
  3. గుమ్మా గులాబీ కొమ్మా - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కార్తిక్ రాజా మరియు షాలినీ సింగ్
  4. చికుబుకు పోరీ... చికుబుకు పోరీ - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: కల్పన మరియు శంకర్ మహదేవన్
  5. మానవా మానవా ఏమి కోరిక. - రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి - గానం: సందీప్ మరియు సునీత
  6. మిరపకాయ బజ్జిలిస్తవా... - రచన: భువనచంద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు రాధిక

ఇతర విశేషాలు[మార్చు]