అంగుల్ జిల్లా

వికీపీడియా నుండి
(అంజుల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అంగుల్ జిల్లా
జిల్లా
Location of అంగుల్ జిల్లా
దేశం India
రాష్ట్రంఒడిశా
స్థాపన1993 ఏప్రిల్ 1
ప్రధాన కార్యాలయంఅంగుల్
Government
 • కలెక్టరుSachin R Jadhav[IAS]
Area
 • Total6,232 km2 (2,406 sq mi)
Elevation
875.5 మీ (2,872.4 అ.)
Population
 (2011)
 • Total12,71,703
 • Density199/km2 (520/sq mi)
భాషలు
 • అధికారఒరియా, హిందీ,ఇంగ్లీషు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
759 xxx
టెలిఫోన్ కోడ్676x
Vehicle registrationOD-19
సమీప పట్టణంభువనేశ్వర్
లింగ నిష్పత్తి0.942 /
అక్షరాస్యత78.96%
Vidhan Sabha constituency5
శీతోష్ణస్థితిAw (Köppen)
అవపాతం1,421 millimetres (55.9 in)
సగటు వేసవి ఉష్ణోగ్రత47 °C (117 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత10 °C (50 °F)
General Information
Subdivisions: 4
Blocks: 8
Municipalities: 2
N.A.C.: 1
Tehsils: 5
Forest Coverage: 2,716.82 km²
Villages: 1,922
Grama panchayat: 180
Towns: 9

ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో అంగుల్ జిల్లా ఒకటి.

చరిత్ర[మార్చు]

అంగుల్ జిల్లా ప్రాంతం తీరప్రాంత ఒడిషాకు పశ్చిమ ఒడిషాకు వంతెనలా ఉంది. జిల్లాలోని భీమకుండ్, కంకిల్, కులెయి, సమల్, సనకర్జంగ్, కలియకత, పరంగ, కెర్జంగ్, ఓగి, తికరపత, పల్లహర వద్ద చరిత్రకాలానుకి ముందు, ఆదిమకాలంనాటి అవశేషాలు లభించాయి. అంగుల్ భౌగోళికంగా భంజాల అంగుల్- పట్టణ, సుల్కీల కొడలక మండలం, నందోద్భవాల అరివట్ట మండలం, తుంగాల యామగట్టా మండల, అని 4 పాలనా భాగాలుగా భావించబడుతుంది. వైద్యమున్న సామ్రాజ్యంలో భాగమై ఉన్నా అంగుల్ సంస్కృతి రాజ్యాలకు అతీతంగా ఉంటుంది.

బౌమకర[మార్చు]

సా.శ. 10వ శతాబ్దంలో ధేన్‌కనల్ ప్రాంతంతో సహా దక్షిణ కోసలకు చెందిన సోమవంశీయుల చేతికి వెళ్ళిన తరువాత బౌమకరాల క్షీణదశ ప్రారంభం అయింది. సోమవంశీయులు గంగాల చేత తరిమి వేయబడ్డారు. సా.శ. 1112 నాటికి ఒడిషాను చోడగంగదేవ ఆక్రమించుకున్నాడు. సా.శ. 1435 వరకు గంగాల రాజ్యం కొనసాగింది. తరువాత కపిలేంద్రదేవ సరికొత్త సోలర్ సామ్రాజ్య స్థాపన చేసాడు. 1533-1534 నాటికి గోవింద విద్యాధర్ సూర్యవంశ పాలనకు ముగుంపు పలికి బోయి సామ్రాజ్య పాలనకు శ్రీకారం చుట్టాడు. బోయీల పాలన 1539 వరకు కొనసాగింది. తరువాత చాళుక్య వంశానికి చెందిన బలవంతంగా సింహాసనాన్ని ఆక్రమించింది. 1568 నాటికి ఒడిషా మీద బెంగాల్ ఆఫ్గన్లు దండయాత్ర చేసి ముకుందదేవాను ఓడించి చంపి ఒడిషాను స్వాధీనం చేసుకున్నారు. సామ్రాజ్యాల మార్పులో అంగుల్ ఎటువంటి పాత్ర వహించక జరుగుతున్న రాజకీయ మార్పులకు అనుగుణంగా మారుతూ వచ్చింది. సూర్యవంశీయులు, బోయీల పాలనా కాలంలో అంగుల్, తల్చర్, పల్లహర, అథమాలిక్ వంటి స్వయం పాలక రాజాస్థానాలు అభివృద్ధి చెందాయి. అంగులుకు చివరి రాజుగా సోమనాథ్ సింగ్ 33 సంవత్సరాల కాలం (1814-1847) పాలించాడు. తరువాత ప్రభుత్వం అతనిని పదవి నుండి తొలగించింది. అహంభావి అయిన సోమనాథ్ సింగ్ పాలనలో ఈ ప్రాంతం శక్తివంతంగా మారింది. సోమనాథ్ సింగ్ అహంభావం, డాంబికాల కారణంగా ఢెంకల్, హిండోల్, దాస్పల్ల, బౌధ్, అథమాలిక్ వంటి పొరుగు రాజాస్థాన పాలకులు, బ్రిటిష్ అధికారులలో అయిష్టత అసహనం కలిగేలా చేసాడు. 1848 సెప్టెంబరు 16న బ్రిటిష్ ప్రభుత్వం సోమనాథ్ సింగ్‌ను పదవీచ్యుతుడిని చేసింది. తరువాత అంగుల్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. తరువాత ఈ ప్రాంతంలో తాసిల్దార్ పాలన కొనసాగింది. 1891లో అంగుల్ ప్రాంతం జిల్లాగా రూపొందించబడింది. జిల్లా వైశాల్యం 6232 చ.కి.మీ. జనసఖ్య 12.70 లక్షలు. ఇక్కడ ఉన్న విస్తారమైన బొగ్గుగనుల కారణంగా ఒడిషా ప్రభుత్వానికి ఈ జిల్లా నుండి అధికంగా ఆదాయం లభిస్తుంది. అంగుల్ రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాగా గుర్తించబడుతుంది.

భౌగోళికం[మార్చు]

అంగుల్ జిల్లా ఒడిషా కేంద్రస్థానంలో ఉంది. ఇది 20° 31 ఉత్తర 21° 40 డిగ్రీల అక్షాంశం, 84° 15 తూర్పు, 85° 23 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 564-1187 మీటర్ల ఎత్తులో ఉంది.[1] జిల్లా వైశాల్యం 6232 చ.కి.మీ. జిల్లా తూర్పు సరిహద్దులో ధేన్‌కనల్ జిల్లా, కటక్ జిల్లా, ఉత్తర సరిహద్దులో దేవ్‌ఘర్ జిల్లా, కెంజహర్ జిల్లా, సుందర్‌గఢ్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సోనేపుర్ జిల్లా, సంబల్‌పుర్ జిల్లా,, దక్షిణ సరిహద్దులో బౌధ్ జిల్లా, నయాగఢ్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో సహజ వనరులు విస్తారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత ఆదాయం సమకూర్చడానికి ఈ సహజ సంపద ఎంతగానో సహకరిస్తుంది. జిల్లా కేంద్రం అంగుల్ రాష్ట్రరాజధాని భువనేశ్వర్కు 150కి.మీ దూరంలో ఉంది. అంగుల్ సహజ సంపదకు నిలయం అయినప్పటికీ దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన జిల్లాగా అంగుల్‌ గుర్తించబడుతుంది. జిల్లాలో వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంటుంది. ఢిల్లీ ఐ.ఐ.టి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తమ పరిశోధనలో దేశంలోని అత్యధికంగా కాలుష్యంతో బాధించబడుతున్న నగరాలలో అంగుల్ ఒకటని ఇక్కడ కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుకుందని నివేదికను వెలువరించింది. [2]

ఆర్ధికం[మార్చు]

(నాల్కో), మహానది కోయల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎం.సి.ఎల్), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి), జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్పిఎల్) నేషనల్ అల్యూమినియం కంపెనీ తాల్చర్, భారతీయ అల్యూమినియం ఉత్పత్తి లిమిటెడ్, భూషణ్ స్టీల్స్ లిమిటెడ్, బి.ఆర్.జి లిమిటెడ్ మొదలైన పెద్ద పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి.

ప్రధాన పరిశ్రమలు[మార్చు]

నాల్కో[మార్చు]

నేషనల్ అల్యూమినియం కంపెనీ ( నాల్కో) భారతీయ అల్యూమినియం రంగంలో ఇది ఒక బ్లూ చిప్ (స్టాక్ మార్కెట్) గుర్తించబడుతుంది. అల్యూమినా, అల్యూమినియం, బాక్సైట్ సంస్థలు సమైక్యంగా కలిగిన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఆసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం సంస్థగా గుర్తించబడుతూ ఉంది. నల్కో 2.18 లక్క టి.పి.ఎ అల్యూమినియం కరిగించే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సంస్థకు చెందిన 720 మెగావాట్ల పవర్ ప్లాంట్ అంగుల్‌లో ఉంది.1984 లో నాల్కోలో స్మెల్టింగ్ (కరిగించే ) యూనిట్ వచ్చింది. అప్పటి నుండి జిల్లా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందింది. నాల్కో మాన్యుఫ్యాక్చరింగ్, నాల్కో టైషిప్ కలిసి నాల్కో నగర్ అంటారు. అంగుల్‌కు 5 కి.మీ దూరంలో జాతీయ రహదారి ఎన్.హెచ్ 42 పక్కన ఉంది. నాల్కోలో ప్రాథమిక అల్యూమినియం కడ్డీల, వైర్ రాడ్స్, సామౌల్డ్స్, బిల్లెట్స్, స్ట్రిప్స్ రూపంలో మెటల్ తయారు. నాల్కో నుండి అల్యూమినియం ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు ఎగుమతి చేయబడుతుంది. నాల్కో దేశీయ అల్యూమినియం మార్కెట్‌లో 30% వాటాను కలిగి ఉంది.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్[మార్చు]

అంగుల్ జిల్లాలోని కంహియా వద్ద ఉన్న " నేషనల్ Themal పవర్ కార్పొరేషన్", విద్యుదుత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉంది.ఈ సంస్థ ప్రస్తుతం 1500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామధ్యం కలిగి ఉంది. ఈ సంస్థ సామర్థ్యం రాబోయే రోజుల్లో 3000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళిక చేయబడింది. ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి వలన ఒడిషా, బీహార్, సిక్కిం, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు తాల్చర్ కోయల్ ఫీల్డ్కు నుండి లభిస్తుంది. ఉష్ణ శక్తికి అవసరమైన నీటిని సమల్ బారేజి నుండి తీసుకుంటుంది. అంగుల్ నుండి తాచర్ 25 కి.మీ దూర ంలో ఉంది." నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్" సంస్థకు చెందిన ఉద్యోగుల కుటుంబాలు1500 నివసిస్తున్న Township Kanhia వద్ద ఉంది.

ఎం.సి.ఎల్[మార్చు]

మహానది కోయల్ ఫీల్డ్కు లిమిటెడ్ " తాచర్ (అంగుల్ నుండి 20కి.మీ దూరం) లో ఉంది. ఇది గుర్తింపుకలిగిన బొగ్గుగనులలో ఒకటి. ఎం.సి.ఎల్ కోయల్ ఇండియా లిమిటెడ్ యూనిట్లలో ఇది ఒకటి. ఎం.సి.ఎల్ గతంలో, కోల్ ఫీల్డ్కు లిమిటెడ్ (ఎస్.సి.ఎల్) ఆధ్వర్యంలో ఉండేది. ఎం.సి.ఎల్ ఆధ్వర్యంలో ప్రధాన బొగ్గు గనులు అనంత బొగ్గు గని, డేరా బొగ్గు గని & బలంగ బొగ్గు గని ఉన్నాయి.

ఎఫ్.సి.ఐ[మార్చు]

అంగుల్ జిల్లాలో తాల్చర్ వద్ద " ది ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా " (ఎఫ్.సి.ఐ) సంస్థ ఉంది. ఇది ఈ ప్రాంతంలోని పురాతన సంస్థగా గుర్తించబడుతుంది. ఎఫ్.సి.ఐ నిర్వహణాపరమైన సమస్యను ఎదుర్కొని 1998 నుండి మూసివేయబడింది. అయినప్పటికీ ఈ సంస్థకు చెందున టౌన్‌షిప్, ప్లాంట్ మాత్రం అలాగే ఉంది. రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ సంస్థ 3,000 కోట్లరూపాయతో ఎఫ్.సి.ఐ (తాల్చర్)ను పునరుద్ధాలించాలని ప్రయత్నిస్తుంది.

హెచ్.డబల్యూ[మార్చు]

అంగుల్ జాలాలోని తాల్చర్ వద్ద హెవీ వాటర్ (హెచ్.డబల్యూ.పి) ప్లాంట్ ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ అటామిక్ పవర్ & ఎనర్జీ నేతృత్వంలో పనిచేస్తున్న భారతీయ సంస్థ. ఈ సంస్థలో దేశం యొక్క అణు విద్యుత్ కార్యక్రమంలో భాగంగా టి.బి.పి, డి2ఇ.ఎఫ్.హెచ్.ఎ, టిఎపి.ఒ, టి.ఒ.పి.ఒ మొదలైనవి, ఇతర రసాయనాలు తయారు చేయబడుతున్నాయి..

టి.టి.పి.ఎస్[మార్చు]

తాల్చర్ థర్మల్ పవర్ స్టేషను 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఒడిషా, ప్రభుత్వం లోని పురాతన విద్యుదుత్పత్తి సంస్థలలో ఇది ఒకటి. తాల్చర్‌లోని సంస్థలలో ఇది ఒకటి. ఈ సంస్థ థర్మల్ పవర్ ఉత్పత్తి కొరకు అవసరమైన బొగ్గును తాల్చర్ బొగ్గుగనుల నుండి తీసుకుంటుంది. అవసరమైన నీటిని బ్రహ్మణీ నది నుండి తీసుకుంటుంది. ఇది నిర్వహణాపరమైన సమస్యల కారణంగా ఏ.టి.పిసి ఈ సంస్థను ఆధ్వర్యంలోకి మారింది. 1998 నుండి ఈ సంస్థ ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంస్థ తిరిగి ఆర్ధికంగా శక్తిని పుంజుకుంది.

జె.ఎస్.పి.ఎల్[మార్చు]

అంగుల్ జిల్లాలో జె. ఎస్‌. పి. ఎల్ జిండల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ 20,000.00 పెట్టుబడి తో స్టీల్ ప్రిసెసింగ్ కంపనీ స్థాపించింది. ఈ సంస్థకు 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ఉంది. 2014 న వచ్చిన మరొక ప్రధాన పరిశ్రమ. ఒక ఉక్కు ఉత్పత్తి సౌకర్యం, ఒక సెట్ కోట్లు. జెఎస్పిఎల్ మధ్య 2014 ద్వారా Angul జిల్లాలో దాని 6 మిలియన్ టన్నుల ఏడాదికి (ఎంఓయు) ఉక్కు మొక్క యొక్క మొదటి దశ కమిషన్ యోచిస్తోంది. మొదటి దశలో, అది 1.8 ఎంఓయు సామర్థ్యం ఉంటుంది. జె. ఎస్‌. పి. ఎల్ సంవత్సరానికి 6మిలియన్ టన్నుల స్టీల్ ఉతపత్తి సామర్ధం కలిగిన ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది.

బి.ఎస్.ఎస్.ఎల్[మార్చు]

బి.ఎస్.ఎస్.ఎల్ : భూషణ్ స్టీల్ అండ్ స్ట్రిప్స్ లిమిటెడ్ అంగుల్ జిల్లాలో 5,200 కోట్ల పెట్టుబడితో విద్యుత్ కేంద్రం, అత్యాధునిక " హీట్ రోలింగ్ ప్లాంటు " 1618 ఎకరాల వైశాల్యంలో ఏర్పాటు చేయడానికి ప్రత్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉతపత్తిని 3 రెట్లు అధికం (2.2 మిలియన్లు) చేయడానికి అదనంగా 3,500 ఎకరాలను మజూరు చేసింది. అంగుల్ ప్లాంటు నుండి ప్రస్తుతం 110 మె.వా విద్యుత్తు ప్లాంట్, 0.5 మిలియన్ టన్నుల స్పాంజ్ ఐరన్ ఉత్పత్తి చేయబడుతుంది.

డివిజన్లు[మార్చు]

ఆంగుల్ జిల్లా పరిపాలన సౌలభ్యం కొరకు బ్లాక్స్, తాలూకాలు, ఉపవిభాగాలుగా విభజించబడింది. అవి:

'ఉపవిభాగాలు'

  • ఆంగుల్
  • ఆథమలిక్
  • టల్చెర్
  • ఫల్లహద

బ్లాక్స్

  • ఆంగుల్ సదర్
  • ఆథమలిక్ సదర్
  • ఛ్హెందిపద
  • టల్చెర్ సదర్
  • ఫల్లహద సదర్
  • బనర్పల్
  • కిషొరెనగర్
  • కణీ

'తాలూకాలు'

  • ఆంగుల్
  • ఆథమలిక్
  • టల్చెర్
  • ఫల్లహద
  • ఛెందిపద

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,271,703, [3]
ఇది దాదాపు. ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. న్యూ హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 380 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 199 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.55%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 942:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 78.96%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఎన్.జి.ఒ[మార్చు]

People For Animals, Angul Unit " పీపుల్స్ ఫర్ అనిమల్స్ అంగుల్ యూనిట్" (పి.ఎఫ్.ఎ) ఇది భారతదేశంలో అతిపెద్ద జీవకారుణ్య సేవాసంస్థగా గుర్తిపు పొందింది. దీనికి దేశవ్యాప్తంగా 26 హాస్పిటల్స్, 60 మొబైల్ యూనిట్లు, 170 యూనిట్స్, 2.5 లక్షల సభ్యులు ఉన్నారు. ఈ సంస్థకు చెందిన సభ్యులు అనాథగా ఉన్న జంతువులను రక్షించి పునరావాద కేంద్రాలకు తరలిస్తుంటారు. వీరు ఆశ్రిత ప్రదేశాలు, అంబులెంస్ సర్వీసులు, స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, చికిత్స శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీదు అదనంగా ఆపదలో ఉన్న జంతువులను విడిపించే కార్యక్రమం చేపడుతున్నారు. వీరు పాఠశాలలలో జాకరూకత తరగతులు, జీవహింసకు ప్రతికూలంగ న్యాయసంస్థలలో కేసు దాఖలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

సంస్కృతి[మార్చు]

రథయాత్ర

ధౌలఝరి వద్ద ఉన్న మహానది ప్రవాహ ప్రాంతంలో ఉన్న శతకోసియా లోయ, రెంగలి ఆనకట్ట, సమల్ బ్రాహ్మణీ నది మీద నిర్మించబడిన బ్యారేజ్, ఉష్ణగుండం మొదలైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. అథమాలిక్ ఉపవిభాగంలో ఉన్న పంచధరా కొండలు, బుధి తకురాని, జగన్నాథ్ ఆలయం, సాటిలేని పప్పెట్ ప్రదర్శన సంస్కృతికి పరిబింబాలుగా ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ సమృద్ధిగా ఉంది. జిల్లాలోని దుర్గాపూర్ గ్రామం సస్కృతి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

గర్హ్‌శాంట్రి యాత్రా - లోవి తకురాని[మార్చు]

ప్రతిసంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున లోవి దేవతకు లోవి తకురాని యాత్రా నిర్వహించబడుతుంది. గర్హ్‌శాంట్రి గ్రామం జిల్లాకేంద్రం అంగుల్ పట్టణానికి 17 కి.మీ దూరంలో ఉంది. గర్హ్‌శాంట్రి గ్రామానికి దేవత లోవి.

అంగుల్ బుధి తకురాని ఆలయం ఒక చిన్న కొండశిఖరం మీద ఉంది. సమీపకాలంలో తకురాని బుధి ఆలయానికి సమీపంలో " శైల శ్రీక్షేత్ర " జగన్నాథ ఆలయం నిర్మించబడింది. ఈ జగన్నాథ ఆలయం కచ్చితమైన పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. చిన్న కొండ మీద నిర్మించబడిన ఈ ఆలయం క్రమంగా రాష్ట్రమంతటి నుండి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది.

తికరపరా[మార్చు]

తికపరా జిల్లా కేంద్రమైన 60కి.మీ దూరంలో, రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు 200 కి.మీ దూరంలో ఉంది. అంగుల్ నుండి బదకెరా, జగన్నాథపూర్‌ల మీదుగా తికపరా చేరడానికి రహదారి మార్గంలో దినదసరి బసు వసతి ఉంది. బాడుగ టాక్సి ద్వారా ఓగి, తైంసి, జగన్నథ్ పూర్ మీదుగా తికపరా చేరుకోవచ్చు. ఇది చాలాముఖ్యమైన పర్యాటక " వన్యప్రాణి టూరిస్ట్ అట్రాక్షన్ "గా భావించబడుతుంది. ఈ ప్రాంతంలో మహానదీ తీరంలో ఘరైయల్ క్రొకోడైల్ అభయారణ్యం ఉంది. వన్యప్రాణి ప్రేమికులు పులి, చిరుత, ఏనుగు, గౌర్, సాంబార్, మచ్చల జింకలు, మౌస్‌డీర్, నీలగిరి, ఫోర్ - హార్ండ్ ఏంటిలోప్, స్లాత్ బియర్ వంటి జంతువులను చూడవచ్చు. తరచుగా అడవి కుక్కలు కూడా కనిపిస్తుంటాయి. పలు పక్షులు కూడా అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఘరైయల్, మగ్గర్ క్రొకొడైల్, ఫ్రెష్ వాటర్ టర్టిల్, విషపాములు, విషరహిత పాములు కూడా చూడవచ్చు. ఇది పర్వతారోకకులకు కూడా అనుకూల ప్రదేశంగా ఉంది. మహానది శతకోషియా జార్జ్, ఆకర్షణీయమైన సతతహరితారణ్యం పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తుంది. తికపరాలో ఉన్న గైంది గ్రామం లోని లోయలు ప్రబల విహార కేంద్రగా ఉంది.

భీమకుండ్[మార్చు]

అంగుల్ జిల్లాలోని మరొక పర్యాటక ఆకర్షిత ప్రాంతం భీంకుండ్. ఇది తాల్చర్ పట్టణానికి 28 కి.మీ దూరంలో ఉంది. బ్రాహ్మణి నది తీరంలో అనంతశయం పవళించి ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించిన ఆలయం ఉంది.

ఖుల్ది[మార్చు]

మలయగిరి పర్వతపాదాలలో ఉన్న శివాలయం ఒక యాత్రాస్థలంగా ఉంది. పరమశివుడు ఇక్కడ గిరీశ్వరుడుగా ఉన్నాడు. గిరీశ్వరుడు అంటే గిరులకు ఈశ్వరుడు అని అర్ధం. ఆలయసమీపంలో ఉన్న జలపాతం 10-12 అడుగుల ఎత్తులో ఉంది. ఖులుది గ్రామం పల్లహరకు 25 కి.మీ దూరంలో, జిల్లా కేంద్రం అంగుల్ పట్టణానికి 104 కి.మీ దూరంలో ఉంది. జాతీయ రహదారి 23 మార్గంలో రూర్కెలా మీదుగా ఖుల్ది చేరుకోవచ్చు.

డ్యూయల్ హరి[మార్చు]

ధౌలఝరి జిల్లాలో సహజసౌందర్యం, మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది పురాతన శైవ ఆరాధన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో ఆరాధనలు, సంప్రదాయాలు పురాతన కాలం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ పురాతన కాల శైవసంప్రదాయానికి అద్దంగా ఉంది. ఈ ఆలయం స్థానికమైన జాస్మిన్ ఫారెస్ట్ (ప్రాంతీయంగా కైబనా అరణ్యం) మద్య ఉంది. ఆలయానికి దక్షిణంలో చిత్రోత్పల నది ప్రవహిస్తుంది. ఉత్తరంలో పంచధరా పర్వతాలు ఉన్నాయి. ఆలయ సమీపంలో ఉన్న వేడినీటి ఊట ఈ ప్రాంతానికి ప్రత్యేకత తీసుకు వస్తుంది. ఆలయసమీపంలో 84 వేడినీటి ఊటలు ఉండడం ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకత సంతరించి పెట్టింది. వీటిలో 24 ఇప్పటికీ సజీవంగా ఉన్నాఉన్నాయి. వీటిలో అగ్నికుండ, తప్తకుండ, హిమకుండ, అమృతకుండ ప్రధానమైనవి. ఈ ఊట జలాల ఉష్ణోగ్రత 42 నుండి 62 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది.

ఒగి- పర[మార్చు]

ఇది జాతీయరహదారి 42 కు 2 కి.మీ దూరంలో కంజరా గ్రామం వద్ద ఉంది. ఇది అంగుల్ పట్టణానికి 27 కి.మీ దూరంలో ఉంది. అంగుల్ నుండి ఒగి-పరాకు దినసరి బదులు లభ్యం ఔతున్నాయి. ఒకదానికి ఒకటి ఆనుకుని ఉన్న ఓగి-పరా అనే రెండు గ్రామాలను లిగరా నదిచేత విడదీయబడుతున్నాయి. ఇక్కడ ఉన్న బుధ తంకురా ఆలయం, అగరా సంత లేక ఫల్గుణా సంత ప్రజాదరణ కలిగి ఉన్నాయి.ఓగి గ్రామంలో బుద్ధుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో బుద్ధా తకురా మూర్తి ప్రతిష్ఠినబడి ఉంది. అగరా జాత్ర ఈప్రాంతంలో పురాతతన ఉత్సవంగా గుర్తించబడుతుంది. అంగుల్ పట్టణానికి 20కి.మీ దూరంలో ఉన్న కంజరా గ్రామంలో డాల్ యాత్ర, రథయాత్ర, దండయాత్ర, చందన్ యాత్ర, రామనవమి యాత్ర ప్రఖ్యాతి వహిస్తున్నాయి..

శారదాపూర్[మార్చు]

ఇది అంగుల్ పట్టణానికి 5కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో " పురాణపాణి " అనే ప్రఖ్యాత ఆశ్రమం ఉంది. ఈ గ్రామంలో ప్రబల " మంధరగిరి " పర్వతం ఉంది. జిల్లాలో మచి ఫాం హౌసులు, ప్రకృతి సౌందర్యం ప్రతిబింబించే ప్రదేశాలు, విహార ప్రదేశాలు ఉన్నాయి. ఈ గ్రామం సందర్శించడానికి అక్టోబరు- డిసెంబరు మాసాలు అనుకూలమైన కాలం.

రాజకీయాలు[మార్చు]

Angul జిల్లా ప్రభావవంతమైన వ్యక్తుల -

  • తథాగత సత్పథి (బిజెడి)
  • నాగేంద్ర ప్రధాన్ (బిజెడి)
  • రజనీ కాంత్ సింగ్ (బిజెడి)
  • రబీ నారాయణ్ పాణి (బిజెడి)
  • Suparno సత్పథి (ఐఎన్సి)
  • రుద్ర నారాయణ్ పాణి (బిజెపి)
  • ధర్మేంద్ర ప్రధాన్ (బిజెపి)
  • రమేష్ చంద్ర జెనా (మాజీ శాసన సభ్యులు)

అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

The following is the 5 Vidhan sabha constituencies[6][7] of Angul district and the elected members[8] of that area

క్ర.సం నియోజకవర్గం రిజర్వేషను పరిధి 14 వ శాసనసభ సభ్యులు పార్టీ
59 పల్లహర లేదు పల్లహర, కనిల (భాగం) రబి నారాయణన్ పాణి బి.జె.డి
60 తాల్చర్ లేదు తాల్చర్ (ఎం), తాల్చర్, కనిహ (భాగం) బరజ కిషోర్ ప్రధాన్ స్వతంత్ర
61 అంగుల్ లేదు అంగుల్ (ఎం), నల్కొ (సి.టి), అంగుల్ (భాగం) , బనర్పల్ (భాగం) రజని కాంత్ సింఘ్ బి.జె.డి.
62 చెందిపద షెడ్యూల్డ్ కులాలు చెందిపద, బనర్పల్ (భాగం) ఖగేశ్వర్ బెహరా బి.జె.డి
63 అత్మాలిక్ లేదు అత్మాలిక్ (ఎన్.ఎ.సి), అత్మాలిక్, కిషోర్‌నగర్, అంగుల్ (భాగం) సంజీబ్ కుమార్ సాహూ BJD

మూలాలు[మార్చు]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. hindu.com:Angul-Talcher seventh most polluted industrial cluster in the country
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Estonia 1,282,963 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470
  6. Assembly Constituencies and their EXtent
  7. Seats of Odisha
  8. "List of Member in Fourteenth Assembly". ws.ori.nic.in. Archived from the original on 2 మే 2007. Retrieved 19 February 2013. MEMBER NAME

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]