(
అండాశయం నుండి దారిమార్పు చెందింది)
అండాశయము (Ovary) స్త్రీ జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు కటి ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక అండం చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం శుక్రంతో ఫలదీకరణం చెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది. అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి గర్భం దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉన్నది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.
లిగమెంట్లు [మార్చు]
మానవులలో రెండు అండాశయాలు కటిభాగంలో గర్భకోశానికి రెండు వైపులా ఒక బలమైన అండాశయపు లింగమెంటు (ovarian ligament) ద్వారా వేలాడినట్లుగా సంధించబడి వుంటుది. ఇవి కొంతభాగం ఉదరకోశ ఉపకళా కణజాలముతో కప్పబడివుంటుంది. అండాశయన్ని చుట్టూ ఉన్న గర్భాశయపు వెడల్పాటి లిగమెంటు (broad ligament of the uterus) ను మీసో ఒవేరియం అంటారు.
సూక్ష్మ నిర్మాణము [మార్చు]
Section of the ovary of a newly born child.
Germinal epithelium is seen at top. Primitive ova are seen in their
cell-nests. The
Genital cord or
genital ridge is still discernible in this young child. A blood vessel and an
ovarian follicle is also seen. Formation of about 30 primordial follicles in the ovarian cortex region during 5-7 month of embryonic development.
- ప్రతి నెల ఒక అండాన్ని విడుదల చేసి పిండోత్పత్తికి కీలకపాత్ర పోషిస్తుంది.
- ఇవి ఈస్ట్రోజెన్ (Estrogen) మరియు ప్రొజెస్ట్రోజెన్ (Progesterone) అనే రెండు హార్మోనులను స్రవిస్తుంది. ఈస్ట్రోజెన్ యౌవనంలో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ప్రొజెస్ట్రోజెన్ తో కలసి ఋతుక్రమాలు సక్రమంగా జరిపిస్తుంది.
చిత్రమాలిక [మార్చు]
- ↑ Langman's Medical Embryology, Lippincott Williams & Wilkins, 10th ed, 2006