అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండ్

దేశంలోని బాలబాలికలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాలల చిత్రాల్లోని సరికొత్త ధోరణులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకునేందుకు వీలుగా 1979లో ముంబయి నగరంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించారు.పారిస్‌లోని "ది ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిల్మ్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ (సీఫేజ్) 'ఎ' గ్రేడ్" చలన చిత్రోత్సవంగా వర్గీకరించింది. ఇంకా.. పారిస్, లాస్‌ఏంజిల్స్, మాస్కో తదితర ప్రాంతాలలో జరిగే చలన చిత్రోత్సవాలతో సరిసమానమైన మేటి ఉత్సవంగా పరిగణించింది.

పదిరోజులపాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాలు ముంబయి తరువాత చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, ఢిల్లీ, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, హైదరాబాద్.. నగరాలలో వరుసగా నిర్వహించారు. అయితే హైదరాబాద్‌లో 1995లో జరిగిన 'భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' ఘనవిజయం సాధించడంతో 1997వ సంవత్సరం తరువాత హైదరాబాద్ నగరాన్ని భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించే శాశ్వత వేదికగా ప్రభుత్వం నిర్ణయించింది. అప్పట్నించి ప్రతి రెండేళ్లకోసారి ఈ ఉత్సవాలను నగరం వేదికగా మారింది.

2013 లో జరిగిన 18వ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం' (ఐ.సి.ఎఫ్‌.ఎఫ్‌.ఐ ) ఏడు రోజులు జరిగిగినది. ఇందులో 15 థియేటర్లులో 48 దేశాలకు చెందిన, 198 చిత్రాలు ప్రదర్శించారు. సుమారు లక్షన్నర మంది ప్రేక్షకులు హాజరు అయ్యారు.

2013 చిత్రోత్సవాల్లో అంతర్జాతీయ ఉత్తమ లఘుచిత్రంగా రష్యాకు చెందిన ‘చిన్టీ’, అంతర్జాతీయ ఉత్తమ యానిమేషన్‌ చిత్రంగా ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎర్నెస్టు అండ్‌ సెలస్టీన్‌’ నిలిచింది. అంతర్జాతీయ లైవ్‌ యాక్షన్‌లో ఉత్తమ విధానం అవార్డును నెదార్లండ్స్‌కు చెందిన ‘కౌబోయ్‌’, చిల్డ్రన్‌ జ్యూరీ విభాగంలో లైవ్‌యాక్షన్‌, అంతర్జాతీయ లైవ్‌ యాక్షన్‌ పోటీల్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఆస్ట్రియాకు చెందిన ‘ది హార్స్‌ ఆన్‌ ది బాల్కనీ’ ఎంపికైంది. అలాగే అంతర్జాతీయ లైవ్‌ యాక్షన్‌ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును జర్మనీకి చెందిన ‘విండ్‌ స్టార్మ్‌’, అంతర్జాతీయ లైవ్‌ యాక్షన్‌ పోటీ విభాగంలో ఉత్తమ సందేశాత్మక చిత్రంగా ‘ మదర్‌ ఐ లవ్‌ యూ’ నిలిచింది.[1]

భారత బాలల ఫిల్మ్‌ సొసైటీ[మార్చు]

భారత ప్రభుత్వంలోని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ 'భారత బాలల ఫిల్మ్‌ సొసైటీ' (సి.ఎఫ్‌.ఎస్‌.ఐ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంటుంది. ఇప్పటికి 58 ఏళ్ళ క్రితం 1955లో స్థాపితమైన ఈ బాలల ఫిల్మ్‌ సొసైటీ పిల్లల్లో వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పెంచే చిత్రాలను నిర్మించడం, ప్రదర్శించడం, పంపిణీ చేయడం లాంటివి చేస్తుంటుంది.

మూలాలు[మార్చు]