అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి
అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Botanical Nomenclature : ICBN)
18 వ శతాబ్దంలో వృక్ష శాస్త్రజ్ఞులు అనేక రకాల కొత్త మొక్కలను కనుగొనటం, వాటికి పేర్లు పెట్టడం జరిగింది. ఈ నామీకరణ (Nomenclature) చేయటానికి ఒక నియమావళి (Code) లేకపోవటంతో, ఒకే మొక్కకు రకరకాల పేర్లు పెట్టడం జరిగింది. అందువలన వృక్ష నామీకరణకు ఒక నియమావళి ఉండాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మొక్కల నామీకరణకు కొన్ని మూల సూత్రాలను మొదటిసారిగా కరోలస్ లిన్నేయస్ తన స్పీషీస్ ప్లాంటేరమ్ (1753) లో ప్రతిపాదించాడు. అగస్టీన్ డీ కండోల్ 1813లో వృక్ష నామీకరణకు సంబంధించిన పూర్తిస్థాయి సూత్రాలను తన గ్రంధమైన థియెరి ఎలిమెంటైరి డి లా బొటానిక్ (Theorie elementaire de la botanique) లో ప్రతిపాదించాడు. వాటిని డీ కండోల్ సూత్రాలు (de CAndollean rules) అని అంటారు. అంతర్జాతీయ వృక్షశాస్త్ర సమావేశము (International Botanical Congress)లలో వృక్షనామీకరణ నియమావళులను పునఃపరిశీలన చేశారు. ప్రస్తుతము ఉన్న అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి (International Code of Botanical Nomenclature:ICBN) 2006 వ సంవత్సరం వియన్నాలో అమోదించబడినది. ప్రతి నూతన నియమావళి అంతకు ముందున్న నియమావళిని మార్పుచేస్తుంది.
[మార్చు] బయటి లింకులు
- Tokyo Code (1994)
- St. Louis Code (2000)
- Vienna Code (2006)
- John McNeill, Tod F. Stuessy, Nicholas J. Turland & Elvira Hörandl. "XVII International Botanical Congress: preliminary mail vote and report of Congress action on nomenclature proposals". Taxon 54 (4): 1057–1064. (PDF file)
|
||||||||||||||||||||||||||