అందరూ దొంగలే
వికీపీడియా నుండి
| అందరూ దొంగలే (1974) | |
| దర్శకత్వం | వి.బి.రాజేంద్రప్రసాద్ |
|---|---|
| నిర్మాణం | అక్కినేని ఆనందరావు |
| తారాగణం | శోభన్ బాబు, లక్ష్మి ఎస్.వి.రంగారావు, నాగభూషణం, సత్యనారాయణ |
| నిర్మాణ సంస్థ | పల్లవి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
"విక్టోరియా 203" హిందీ సినిమా ఆధారం గా నిర్మించబడ్డ చిత్రం. హీరో హీరోయిన్లు శోభన్, లక్ష్మి ఐనా చిత్రానికి ప్రధానాకర్షణ ఎస్.వి.రంగారావు, నాగభూషణం ధరించిన దొంగల పాత్రలే. వీరిపై రెండు పాటలు చిత్రీకరింపబడ్డాయి (చంటిబాబు ఓ బుజ్జి బాబు, గురుదేవ మహదేవ). హిందీ లో ఈ పాత్రల్ని అశోక్ కుమార్, ప్రాణ్ లు పోషించారు. ఒక గుర్రపుబండిలో దాచబడ్డ వజ్రాలకు సంబంధించి కథ. (బొంబాయి (ముంబయ్) లో గుర్రపు బళ్ళను విక్టోరియా లని పిలుస్తారు.) వి.రామకృష్ణ నేపధ్యగానం తో కొన్ని హిట్ గీతాలున్నాయి.
పాటలు
| వరుస సఖ్య | పాట | రచన | సంగీతం | పాడిన వారు |
|---|---|---|---|---|
| 1 | నాయుడోళ్ల ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద | కొసరాజు రాఘవయ్య చౌదరి | కె.వి.మహదేవన్ | |
| 2 | గుడు గుడు గుంచం గుళ్లో రాగం | కె.వి.మహదేవన్ | ||
| 3 | చూసానురా ఈ వేళ | కె.వి.మహదేవన్ | ||
| 4 | చంటి బాబు...ఓ బుజ్జి బాబు | ఆరుద్ర | కె.వి.మహదేవన్ |