అంబటి చంటిబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబటి చంటిబాబు
2017లో అంబటి చంటిబాబు, కార్టూనిష్టు
జననంఅంబటి చంటిబాబు
1966
తూర్పు గోదావరి జిల్లాలోని తుని
నివాస ప్రాంతంవిశాఖపట్నం జిల్లా నాతవరం మండలం లోని చమ్మచింత గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు రచయితగ, కార్టూనిష్టు, దర్శకుడు
ప్రసిద్ధి" కార్టూన్ శతకం" రచయిత
మతంహిందూ
తండ్రివీరయ్యదొర
తల్లిలక్ష్మి
2009లో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందిన చంటిబాబు

అంబటి చంటిబాబు ఉపాధ్యాయుడు, రచయిత, కార్టూనిష్టు.[1] అంబటి చంటిబాబు తూర్పు గోదావరి జిల్లాలోని తుని పట్టణంలో 1966లో వీరయ్యదొర, లక్ష్మి దంపతులకు తాతగారి ఇంట జన్మించాడు. అతని స్వగ్రామం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం లోని చమ్మచింత గ్రామం. చిన్నప్పటి నుండి ఉపాధ్యాయ వృత్తి అన్నా, కార్టూనులన్నా, బొమ్మలన్నా అతనికి చాలా ఇష్టం. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ; బి.ఎడ్ పట్టాలను, భీమునిపట్నం లోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణాసంస్థ నుండి టి.టి.సి సర్టిఫికేట్ ను తీసుకున్నారు. అతను తన పది హేడవ యేటనుండే మాష్టారికథలు, కార్టూనులు, సమీక్షా రచనలు వివిధ పత్రికలలో అనేకం అచ్చయ్యాయి. ఇరవైయవ యేటనే తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. 1986 జూలై 1 నుండి తను చదువు కున్న ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల, చమ్మచింత లోనే ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.[2]

రచయితగా[మార్చు]

ఉపాధ్యాయునిగా, రచయితగా, కార్టూనిష్టుగా, దర్శకునిగా అనేక విజయాలను సాధించాడు. బాలలకోసం 100 కార్టూనులతో "కార్టూన్ శతకం" పుస్తకం రాశాడు. వేలిముద్రలతో "మనోహరం" పుస్తకం రాశాడు.[3] తెలుగు వాచక రచనపై ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిప్రాయాలను ఖండించి, వారితో ఒకటో తరగతికి వాచకం రాయించి అందులోని అనేక దోషాలను ఎత్తి చూపి రాష్ట్ర వ్యాప్తంగా పేరుపొందారు. తెలుగు అభ్యసించే పిల్లలకోసం, వారికి బోధించే ఉపాధ్యాయులకోసం "తెలుగు నేర్చుకుందాం" పుస్తకం, వినూత్నమైన ఆలోచనతో వేలిముద్రల చిత్రాల పుస్తకం "మనోహరం", బాలగేయాల పుస్తకం "బడిగంటలు" రాశాడు. బాపు గారి నాయకత్వంలో వరకట్నంపై "వందమంది కార్టూనిస్టుల సమరం" పుస్తక రచనలో పాలుపంచుకున్నారు. "మనం .. మన చమ్మచింత", "జగమంత కుటుంబం" పుస్తకాలు కూడా రాశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఉపాధ్యాయులలో ఈయన ఒక్కరే కార్టూనిష్టు కావడం విశేషం! పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు చిత్రాలు అవలీలగా వేస్తూ వివరించడం, నాటకీకరణ చేయిస్తూ బాలలలో దాగియున్న సృజనాత్మక శక్తులను వెలికి తీయడంలోను ఈయన దిట్ట. ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీచేసిన గ్రంథాలయ పుస్తకాలలో మాష్టారీ రచనలు, చిత్రాలు, కార్టూనులు అనేకం ఉన్నాయి. విశాఖపట్నం, మచిలీపట్నం, హైదరాబాదు, బెంగళూరు మొదలగు చోట్ల కార్టూన్ ప్రదర్శనలు నిర్వహించి ప్రశంసలు పొందాడు. 2017 లో తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నాడు. ఐ.ఐ.సి ఆర్టీగ్యాలరీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్) బెంగళూరు లో మాష్టారీ కార్టూనులు ప్రదర్శించబడ్డాయి. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందాడు. మాష్టారి కార్టూనులు, రచనలు అనేక పత్రికల్లో అచ్చయ్యాయి. అతను అప్పటికప్పుడు నల్లబల్లపై సుద్దముక్కతో బొమ్మవేసి బాలలను రంజింపజేయడంలో దిట్ట. అక్షరజ్యోతి కార్యక్రమంలో 'అయ్యోపాపం అప్పలకొండ' నాటిక ద్వారా రచయితగా, దర్శకునిగా ప్రముఖుల ప్రశంసలు పొందారు. సామాజిక సేవలో భాగంగా సుమారు 30 సెంట్ల స్వంత స్థలాన్ని తను పనిచేస్తున్న పాఠశాలకు విరాళంగా ఇచ్చాడు. అంబటి చంటిబాబుకు దేశవ్యాప్తంగా ప్రముఖ కళాకారులు మిత్రులుగా, అభిమానులుగా ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన తెలుగు కార్టూన్ల పుస్తకంలో చంటిబాబు కార్టూన్లకు చోటు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం మేరకు హైదరాబాదులో నిర్వహించిన తెలుగు మహాసభలకు ఆయన వెళ్ళారు. తెలుగు ఔన్నత్యం, సామెతలు, జీవవైవిధ్యం అంశాలపై చంటిబాబు గీసిన కార్టూన్లకు ఈ పుస్తకంలో ఒక పేజీ కేటాయించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రభుత్వం అతనిని సన్మానించింది.[4]

అవార్డులు - ప్రశంసాపత్రాలు[మార్చు]

  • రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2009)
  • ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ తిరుపతి వారి రాష్ట్రస్థాయి ఉత్త మ ఉపాధ్యాయ అవార్డు (2016)
  • కార్టూనిష్టుగా ఉత్తమ సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కతిక సలహాదారు కె.వి. రమణాచారి(ఐఏయస్ )గారి చేతులమీదిగా ప్రశంసాపత్రం (2012)
  • జిల్లాస్థాయి ఉత్తమఉపాధ్యాయ అవా ర్డు (2006),
  • రాష్ట్ర స్థాయి సేవారత్న అవార్డు (2008),
  • అక్షరజ్యోతిలో సేవలకుగాను జిల్లా కలెక్టరువారి ప్రశంసా పత్రం,గోల్డ్మెడల్ (1992)
  • జన్మభూమిలో సేవలకు గాను జిల్లాకలెక్టరు వారీ ప్రశంసాపత్రం (1997)
  • జిల్లా అగ్నిమా పక వారోత్సవాలలో సేవలకుగాను జిల్లాఅగ్నిమాపక అధీకారీవారీ ప్రశంసాపత్రం(2008 )
  • ఇంకా మండలస్థాయి లో అనేక బహుమతులు, సన్మానాలు ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తెలుగు కార్టూనోత్సవానికి అంబటి".
  2. "Aided Ps Chammachinta School Visakhapatnam, Andhra Pradesh".
  3. "జాతీయ స్థాయి కర్టూనోత్సవానికి చంటిబాబు - ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్". 2017-10-22.[permanent dead link]
  4. "Sakshi Telugu Daily Visakhapatnam District epaper dated Wed, 20 Dec 17". epaper.sakshi.com. Archived from the original on 2018-03-03. Retrieved 2019-01-27.

బయటి లంకెలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.