అంబటి రాయుడు
వికీపీడియా నుండి
| అంబటి రాయుడు | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| పూర్తి పేరు | అంబటి తిరుపతి రాయుడు | |||
| జననం | సెప్టెంబరు 23 1985 (వయసు 27) గుంటూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
|||
| బ్యాటింగ్ శైలి | కుడి చేతి బ్యాట్స్ మన్ | |||
| బౌలింగ్ శైలి | రైట్ ఆర్మ్ , ఆఫ్ స్పిన్ | |||
| పాత్ర | బ్యాట్స్ మన్ | |||
| దేశవాళీ జట్టు సమాచారం | ||||
| సంవత్సరాలు | జట్టు | |||
| 2001/02–2009/10 | హైదరాబాద్ | |||
| 2005/06 | ఆంధ్రా క్రికెట్ టీమ్ | |||
| 2010/11–present | బరోడా క్రికెట్ టీమ్ | |||
| 2007/08 | హైదరాబాద్ హార్సెస్ | |||
| 2010–present | ముంబై ఇందియన్స్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| పోటీ | FC | List A | T20 | |
| మ్యాచులు | 63 | 45 | 50 | |
| సాధించిన పరుగులు | 3754 | 1335 | 1128 | |
| బ్యాటింగ్ సగటు | 42.17 | 32.56 | 24.52 | |
| 100 పరుగులు/50 పరుగులు | 9/19 | 1/11 | 0/8 | |
| ఉత్తమ స్కోరు | 210 | 117 | 75* | |
| వేసిన బాల్స్ | 660 | 216 | – | |
| వికెట్లు | 9 | 8 | – | |
| బౌలింగ్ సగటు | 47.88 | 25.25 | – | |
| ఇన్నింగ్స్ లో వికెట్లు | 0 | 0 | – | |
| మ్యాచులో 10 వికెట్లు | 0 | n/a | n/a | |
| ఉత్తమ బౌలింగు | 4/43 | 4/45 | – | |
| క్యాచులు/స్టంపింగులు | 48/– | 19/– | 26/3 | |
| Source: Cricinfo, 10 October 2011 | ||||
1985, సెప్టెంబర్ 23న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరులో జన్మించిన అంబటి రాయుడు (Ambati Thirupathi Rayudu) క్రికెట్ క్రీడాకారుడు. 2001-02లో రంజీట్రోఫిలో హైదరాబాదు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2002-03 సీజన్‌లో రాయుడు ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ మరియు సెంచరీ పూర్తిచేశాడు. 2005-06 సీజన్‌లో ఒకసారి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున కూడా ఆడినాడు.
రాయుడు 2002లో అండర్-19 భారత క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లాండు పర్యటించి అక్కడ మూడవ వన్డేలో 177 పరుగులు సాధించి 305 పరుగుల పక్ష్యఛేధనలో భారత జట్టు విజయానికి దోహదపడ్డాడు. అంతకు క్రితం మ్యాచ్‌లో 80 పరుగులు సాధించి అందులోనూ భారత జట్టు లక్ష్యసాధనకు తోడ్పడ్డాడు. 2003-04 లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ పోటీలో రాయుడు భారత జట్టుకు నేతృత్వం వహించాడు.