అంబరీషుడు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి. ఈ రాజు శ్రీరాముడు కి పూర్వీకుడు. అత్యంత విష్ణు భక్తుడు.
[మార్చు] ఏకాదశీ వ్రతము-దూర్వాసుని రాక
ఈ వృత్తాంతం మహాభాగవతము, స్కాంద పురాణములలో చెప్పబడింది.
- 1.అంబరీషుడు నాబాగుని కుమారుడు. బంగారాన్ని మట్టినీ సమానంగా చూసేవాడు. ఏకాదశీ వ్రతం చేసి,ఉపవాసం ఉండి, మరునాడు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసదీక్ష విరమించి, ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్య బోతుండగా దూర్వాస మహర్షి వస్తాడు. దూర్వాసుడికి అర్ఘ్య పాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీస్నానానికి వెళ్లి వస్తానని చెబుతాడు. స్నానార్థం నదికి వెళ్ళిన దుర్వాసుడు ఎంతకూ తిరిగి రాడు. ద్వాదశి ఘడియలు గడిచి పోతున్నాయని భావించి, ద్వాదశి ఘడియలు గడవక మునుపు దీక్ష విరమించడంకోసం భుజించక పోతే వ్రత భంగం జరుగుతుంది, భుజిస్తే అతిథిని భంగ పరచి నట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దలసలహా మేరకు, సమారాధన చేసి, తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి, దీక్షా విరమణ చేస్తాడు. అప్పుడు దూర్వాసుడు నదీస్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి, అతిథి కంటె ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై, తన జటలలో ఒక దానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచి పెడతాడు. అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీమహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచి పెడతాడు. సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి , దూర్వాసుడి మీదకు వెడుతుంది, బ్రహ్మ, శివుడు కూడా దుర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు. చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువు ను ప్రార్థిస్తాడు. మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణు వేడుకొమ్మనీ అంటాడు. అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది.
- 2.భాగవతం బిందుమతి మాందాతల పెద్దకొడుకు. యౌవనాశ్వుని తండ్రి. మాందాతృ గోత్రంలో ప్రవరుడు.
- 3.భారతం ఇతని భటుడు సుదేవుడు ఏ యజ్ఞం చేయకపోయినా ఇతని కంటే ముందే ఇంద్రలోకానికి పోతాడు.
- 4.లింగపురాణం ఇక్ష్వాకు రాజు. పద్మావతి కుమారుడు. ఇతని కూతురు శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని పర్వతుడు, నారదుడు పోటి పడుతుంటే ఆమెను విష్ణుమూర్తి తీసికెళతాడు. పిల్లనిస్తానని మాట తప్పినందుకు తమోమయుడివై పొమ్మని అంబరీషుడిని వాళ్ళిద్దరూ శపిస్తారు. విష్ణువు తన చక్రంతో వాళిద్దరినీ విష్ణులోకం దాకా తరుముతాడు.
- 5.రామాయణం అయోధ్య రాజు. రుచీకుని కొడుకు శునశ్శేపుడిని యజ్ఞపశువుగా జేసి యూపస్తంభానికి కట్టేస్తాడు. శునశ్శేపుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించితే ఇంద్రుడు అంబరీషునికి యాగఫలం ఇచ్చి రక్షిస్తాడు.
- 6.స్కాంద పురాణము ప్రకారం అంబరీషుడు జలపానం చేయడంవల్ల దూర్వాసుడు కుపితుడై అంబరీషుడిని మలము తింటూ బ్రతికే జంతువు గా అనేక జన్మలు పొందమని శపిస్తాడు. ఆ సమయంలో సుదర్శన చక్రం అక్కడకు రావడం వల్ల, సుదర్శన చక్రం చేసే ధ్వని వల్ల ఆ శాపాలు అంబరీషుడిని తాకవు.

