అక్క్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం

వికీపీడియా నుండి

మూస:Redirect '

Adult respiratory distress syndrome

Chest x-ray of patient with ARDS
ICD-10 J80.
ICD-9 518.5, 518.82
DiseasesDB 892
MedlinePlus 000103
eMedicine med/70
MeSH D012128

ఊపిరితిత్తులకు ఏవైనా గాయలు అయినప్పుడు తలెత్తే తీవ్ర ప్రతికూల పరిస్థితినే అక్క్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (ARDS) ,లేదా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (RDS) లేదా అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (ఇది IRDS కన్నాభిన్నమైనది)అని పిలుస్తారు.

ARDS అన్నది ఉపిరితిత్తులకు సోకే తీవ్రమైన వ్యాధి. ప్రత్యక్షమైన మరియు పరోక్షమైన అనేక కారణాల వాళ్ళ ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల పేరెంకైమా వాచిపోతాయి. దానితో ఆక్సీజన్ ప్రసారంలో అంతరాయం ఏర్పడటమే గాక దేహవ్యవస్థ నుండి వాత కారకాలు విడుదలయి వాపుకు,రక్తంలో ఆక్సీజన్ క్షీణతకూ దారి తీస్తాయి. తరచూ అనేక అవయవాలు ఏకకాలంలో పనిచేయడం మానేస్తాయి. ఈ స్థితి, రోగిని సాధారణంగా మరణ శయ్య ఫైకి చేరుస్తుంది. యాంత్రిక శ్వాస అవసరం అవుతుంటుంది.ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో రోగిని చేర్చవలసి వస్తుంటుంది. దీనికన్నా రోగ తీవ్రత కాస్తా తక్కువగా ఉన్నప్పుడు, ఆ స్థితిని అక్క్యూట్ లంగ్ ఇంజరీ (ALI) అని పిలుస్తారు.

ARDS అంటే మొదట్లో అడల్ట్ రెస్పిరేటరీ డిష్ట్రెస్ సిండ్రోం అనే అర్థమే వాడుకలో ఉండేది. నెలలు తక్కువగా పుట్టిన శిశువులలో కనిపించే ఇన్ఫాంట్ రెస్పిరేటరీ డిష్ట్రెస్ సిండ్రోం కన్నా ఇది భిన్నమైనది. ayite ఇలాంటి శ్వాసకోశ వాతం చిన్న పిల్లల్లో కూడా ఏర్పడుతుంటుంది.ఇందు వల్ల ARDS అంటే అడల్ట్ అని కాక అక్క్యూట్ అనే అర్థం క్రమంగా స్థిర పడ్డది. అపరిణత శిశువుల్లో కనిపించే సిండ్రోం కన్నా ఇది భిన్నమైనది.

విషయ సూచిక

[మార్చు] నిర్వచనం

[మార్చు] చారిత్రిక నేపథ్యం

అక్క్యూట్ రేస్పిరేటరి డిస్ట్రెస్ సిండ్రోం ను ఆశ్బాఫ్ తదితరులు 1967లో తొలిసారిగా వర్ణించడం జరిగింది.[1][2] మొదట్లో ఎలాంటి నిర్వచనం లేకపోవడం చేత ఈ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారో,ఎంతమంది చనిపోతున్నారో అన్న విషయం వివాదాస్పదంగా ఉండేది. 1988లో ఒక విస్తృతమైన నిర్వచనం ప్రతిపాదించబడింది. దీంతో శారిరిక శ్వాస సంబంధిత అవలక్షణాలను గురించి పరిమాణాత్మకంగా మాట్లాడటం సాధ్యపడింది.

రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఎదురైనప్పుడు రోగుల ఊపిరితిత్తులు అచేతనమై పోతాయి.శ్వాస కొరకు గొట్టాలు అమర్చవలసి వస్తుంది. తగిన మోతాదులో వాయు మార్పిడి జరిగేలా చూడటంలో అవియోలార్(ఊపిరితిత్తులలోని చిన్నచిన్న గదులు)ప్రభావం కోల్పోతాయి. CO2 నిల్వలు క్రమక్రమంగా పేరుకునిపొయి ఆసిడియోసిస్ సంభవిస్తుంది. శ్వాస కోశ ఆసిడియోసిస్ క్రమాన్ని వెనక్కి మళ్ళించేందుకు కార్బోనేట్ ద్రావణాలను అందించవలసిన అవసరం ఏర్పడ్డది అనేందుకు ఇది సూచిక. రేస్పిరేటరి డిస్ట్రెస్ అన్నది ఒక వైద్యపరమైన అత్యవసర స్థితి. శ్వాస నాళం వాచిపోయి, ఊపిరి తీసుకోవడమే పూర్తిగా అసాధ్యంగా మారే పరిస్థితి ఏర్పడక ముందే గొట్టాలను ప్రవేశపెట్టడం తక్షణ కర్తవ్యంగా భావించాలి.

1994లో అమెరికన్-యూరోపియన్ ఏకాభిప్రాయ సాధనా కమిటీ[3][1] వారు ఒక కొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించారు. ఈ నిర్వచనానికి రెండు అనుకూలతలు ఉన్నాయి. 1.శ్వాస కోశ అపఘాతాల తీవ్రతలో తేడాలను గుర్తించడం సాధ్యమవుతుంది. 2.ఈ నిర్వచనాన్ని ఉపయోగించడం తేలిక.[4]

రక్త నాళాలలోని పాక్షిక ఆక్సీజన్ తన్యతకూ(PaO2); 200mmHG కంటే దిగువన శరీరంలోకి ప్రవేశ పెట్టబడిన ఆక్సీజన్(FiO2) కూ మధ్యన ఉండే నిష్పత్తిగా ARDS ను నిర్వచించారు. ఛాతి ఎక్స్-రే లోద్విపుటాకార కణజాల వాపు కనిపిస్తున్న సమయంలో మాత్రమే పై నిర్వచనం వర్తిస్తుంది. ఈ కణజాల వాపులు, గుండెపోటులో ఎడమ గదులు దెబ్బతిన్నప్పుడు కనిపించే కణజాల వాపులను పోలి ఉంటాయి. కానీ ARDSలో గుండె యొక్క రూపు రేఖలు సాధారణ స్థితి లోనే ఉంటాయి. అంతేకాక ARDSలో ధమనులకు సంబంధించిన కేశ రక్తనాళికలలో రక్త పీడనము సాధారణ స్థితిలో(18mmHg కన్నా తక్కువ స్థాయిలోనే)ఉంటుంది. అదే గుండె పోటులో ఈ రక్త పీడనము అధికంగా ఉంటుంది.

పాక్షిక ఆక్సీజన్ తన్యతకూ(PaO2), ప్రవేశపెట్టబడిన ఆక్సీజన్(FiO2)కూ మధ్య నిష్పత్తి 300mmHg కన్నా తక్కువగా ఉండి, ద్విపుటాకార కణజాల వాపులు ఉన్నట్లయితే ఆ స్థితిని అక్క్యూట్ లంగ్ ఇంజ్యూరీ(ALI) అంటారు. దీన్ని ARDS కన్నా భిన్నమైన వ్యాధిగా గుర్తిస్తున్నప్పటికీ, ALI అన్నది సర్వ సాదారణంగా ARDS కే దారి తీస్తుంది.

[మార్చు] 1967 మరియూ 1994 తర్వాత ఏర్పడ్డ ఏకాభిప్రాయం

ARDS లక్షణాలు:[3][1]

  • అకస్మాత్ విజ్రుంభణ
  • చాతి ఎక్స్-రే లో భిత్తికను(కాస్తోఫెర్నిక్ యాంగిల్స్) మినహాయించగా కనిపించే ద్విపుటాకార కణజాల వాపులు
  • ధమని సంబంధ కేశ రక్తనాళికలలో రక్త పోటు 18mmHg కన్నా తక్కువగా (పల్మోనారి అర్టరీ క్యాథటరైసేషణ్ ద్వారా తెలుస్తుంది) ఉంటుంది. ఒక వేళ ఈ సమాచారం లేకపొతే, గుండె ఎడమ గదుల్లో ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకోవాలి.
  • PaO2:FiO2 < 300mmHg(40kPa)ఉంటే అక్క్యూట్ లంగ్ ఇంజ్యూరీ(ALI)ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
  • PaO2:FiO2200mmHg(26.7kPa)

ఉంటే అక్క్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం(ARDS)అని నిర్ధారించుకోవాలి.

క్లుప్తంగా, సరళంగా చెప్పాలంటే, ARDS అన్నది శరవేగంగా, విస్తృతంగా ఊపిరితిత్తులను దెబ్బ తీసే వ్యాధి. అయితే ఇందులో గుండె పోటు ఏమీ ఉండదు.

[మార్చు] లక్షణాలు

ARDS అన్నది, ఏదైనా తీవ్ర గాయం తగిలినప్పుడు గానీ(అంటే ట్రామా, కాలిన గాయాల వల్ల, తీవ్ర ఆయాసం వల్ల, తీవ్ర రక్త స్రావం అయినప్పుడు, అతిగా మద్యం/మాదక ద్రవ్యం సేవించినప్పుడు)లేదా ఏదైనా తీవ్ర వ్యాధి విజ్రుంభిన్చినప్పుడు గానీ(ఇన్ఫెక్షియస్ న్యూమొనియా,సెప్సిస్,అక్క్యుట్ పాన్క్రియాటైటిస్)24 - 48 గంటల లోపే ఏర్పడుతుంది. ARDS వ్యాధిగ్రస్తులలో సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి.వేగంగా ఊపిరి తీసుకోవడము,టాఖిప్నియా,అప్పుడప్పుడూ అయోమయం లాంటివి ఉంటాయి.

మలేరియా లాంటి దీర్ఘ కాలిక వ్యాధుల వల్ల కూడా ARDS సంభవించే అవకాశం ఉంది.ఆతరువాత అతితీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఎప్పుడు సోకినా ARDS పునరావృతం అవ్వచ్చు. మలేరియల్ ARDS యొక్క ఎక్స్-రే ను చూడండి.

[మార్చు] వ్యాధి నిర్ధారణ

పైన పేర్కొన్న ప్రమాణాల ప్రకారం ఆర్టిరియల్ బ్లడ్ గ్యాస్ విశ్లేషణ మరియు చాతి ఎక్స్-రే ల సహాయంతో రోగ నిర్ధారణ చెయ్యవచ్చు. (రోగ నిర్ధారణ లో)తీవ్ర హైపోక్జేమియాను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. కానీ PaO2 ఏ స్థాయిలో అసాధారణంగా ఉండాలో కచ్చితంగా తేల్చిన అధ్యయనాలు లేవు. అయితే తీవ్ర ఆక్సీజనీకరణ అనే లోపాన్ని వెంటిలెటరి సపోర్ట్ తో సమానంగా చూడరాదు. అదనంగా అందించిన ఆక్సీజన్ భాగంలో 50% వద్ద, PaO2 100 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ARDS ఉన్నట్లే లెక్క. ఎలాంటి వెంటిలేటర్ సహాయం లేకుండానే ముమ్మరంగా ఆక్సిజన్ ను అదనంగా అందించడం ద్వారా దీన్ని సులభంగా సాధించవచ్చు.

గుండె జబ్బుల కారణంగా ఊపిరితిత్తులలో వచ్చే వాపులను మనం ఈ సందర్భంలో లెక్కలోకి తీసుకోరాదు. పల్మొనరీ ఆర్టరీ వేడ్జ్ ప్రెజర్ ను లెక్కించడానికి పల్మోనారి అర్టరీ క్యాథటార్ ను ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు ఇది అనవసరంగా భావించి ఎవ్వరూ వాడడం లేదు. పల్మోనరి ఆర్టరీ క్యాథటార్స్ వాడినంత మాత్రాన ARDSతో సహా ఏ ప్రాణాంతక వ్యాదులలో కూడా రోగులకు పెద్ద ఉపయోగం అయిన దాఖలాలు లేవు.

చాలా కేసులలో బైలేటరల్ అల్వియోలార్ ఇన్ఫిల్ట్రేట్స్ ని గుర్తించడానికి మామూలు ఎక్స్-రే చాలు. CT స్కానింగ్ లో, ARDS వల్ల ఏర్పడే పల్మోనరి పారెంఖైమాకు సంబంధించిన స్పష్టమైన చిత్రాలు లభించే మాట నిజమే అయినా, ఈ సమాచారం వల్ల చికిత్సకు కలిగే అదనపు లాభం ఎమీ ఉండదు. పరిశోధనలకు తప్ప చికిత్సకు పనికిరాని పనిముట్టు ఇది.

[మార్చు] వ్యాధివిజ్ఞాన శరీరధర్మశాస్త్రం

ARDS యొక్క రోగకారక రక్తపు చిత్రం.

ARDS అన్నది ఒక క్లినికల్ సిండ్రోం. ఇందులో అనేక వ్యాధుల లక్షణాలు సమ్మిళితమై ఉంటాయి. న్యుమోనియా, ఈసినోఫిలిక్ న్యుమోనియా, క్రిప్తోజేనిక్ ఆర్గనైజింగ్ న్యుమోనియా, అక్క్యూట్ ఫిబ్రినాస్ ఆర్గనైజింగ్ న్యుమోనియా మరియు డిఫ్యూజ్ అల్వియోలార్ డ్యామేజ్ (DAD)తదితర వ్యాధులు ఉంటాయి. వీటి అన్నిటిలోకీ ARDSతో కలిసి అతి ఎక్కువగా కనిపించే వ్యాధి DAD.

ఊపిరితిత్తులలో పలుచగా వ్యాపించి ఉన్న వాపు అన్నది DAD యొక్క లక్షణము. ప్యారెంఖైమాలో కలిగిన వాపుతో పాటు స్థానిక ఎపిథిలియల్,ఎండోథిలియల్ కణాలు ప్రేరితమై, సైటోకైన్లు తదితర వాతకారకాలను స్రవిస్తాయి.

న్యూట్రోఫిల్సు,Ti-లిమ్ఫోసైట్స్ శరవేగంగా, వాచియున్న ఊపిరితిత్తుల ప్యారంఖైమాలోకి ప్రవేశించి వాపును మరింతగా పెంచేస్తాయి.

ఊపిరితిత్తుల టిశ్యూలను పరిశీలిస్తే వ్యాపించిన అల్వియోలార్ డ్యామేజ్ కనిపిస్తుంది. అల్వియోలార్ గోడలలో హయాలైన్ పొర ఏర్పడటం కనిపిస్తుంది.

వ్యాధిని ఉత్పన్నం చేసే ప్రక్రియల గురించి పూర్తి అవగాహన లేదు కాని, ఇటివలి పరిశోధనలు వాపు, యాంత్రిక ఒత్తిడి అనే వాటి పాత్రల గురించి పరిశీలన చేసాయి.

[మార్చు] వాపు

సెప్సిస్ లాగే వాపు కూడా ఎండోతిలియాల్ అవ్యవస్థకు కేశనాళికల నుండి అతి స్రావాలకు, ఊపిరితిత్తుల నుండి ద్రవాలు బయటికి పోవడంలో అవాంతరాలకు కారణమవుతుంది. ఊపిరితిత్తులలోని టైప్-II ఎపిథిలియల్ కణాలు అవ్యవస్థకు గురయ్యి, సర్ఫక్టాంట్ ఉత్పత్తిలో తరుగుదల కనిపిస్తుంది. ఈ దశలో ఎలేవేటేడ్ ఇన్స్పైర్డ్ ఆక్సీజన్ కాన్సంట్రేషన్ తరచూ అవసరం అవుతుంది. దీని వల్ల రోగనిరోధక కణాలలో 'శ్వాసక్రియా స్ఫోటనం'జరిగే ఆవకాశం ఉంది.

తదనంతర దశలో ఎండోతిలియాల్ అవ్యవస్థ ఏర్పడి కణాలు, వాత కారకాలు అల్వియోలిలోకి ప్రవేశిస్తాయి. ఈ శ్వాస కోశ వాతం, అల్వియోలి-కేశ నాళికల మధ్య దూరాన్ని పెంచుతుంది.దీని వల్ల రక్తాన్ని చేరుకోవడానికి, ఆక్సీజన్ వ్యాపించ వలసిన దూరం పెరిగిపోతుంది. ఇది వాయు మార్పిడికి అంతరాయం కలిగించి, హైపోక్జియాకు దారి తీస్తుంది. శ్వాసక్రియను కష్టతరం చేస్తుంది. వాయు ఆవరణంలో ఫైబ్రోసిస్ ను కలిగిస్తుంది.

అంతేకాక వాపు మరియు టైప్ II న్యుమోసైట్స్ లో తగ్గిపోయిన సర్ఫక్టాంట్ ఉత్పత్తి ఫలితంగా మొత్తం అల్వియోలి కుప్పకూలి పోవడం గానీ లేక పూర్తిగా రక్తప్రవాహంతో నిండి పోవడం కానీ జరుగుతుంది. రక్తంలో వాయు మిలనం తగ్గిపోయే కొద్దీ ARDSలో కుడి-నుండి-ఎడమ వైపుగా రక్త ప్రసార భ్రంశం కనబడుతుంది. అల్వియోలిలో వాయు ప్రమాణం క్రమక్రమంగా తగ్గే కొద్దీ, వాటిలో ఆక్సీకరణ చెందకుండానే ప్రవహించే రక్త ప్రమాణం పెరుగుతూ పోతుంది. ఇది చివరకు అతి పెద్ద స్థాయిలో ఊపిరితిత్తుల లోపల రక్తప్రసార అపభ్రంశాలకు దారి తీస్తుంది.

శిథిలమైన అల్వియోలి మరియు చిన్న బ్రాంఖైలు వాయు మార్పిడిని జరగనివ్వవు. మెకానికల్ వెంటిలేషన్ ద్వారా 100% ఆక్సిజన్ ను అందుకునే రోగులలో కూడా PaO2 పరిమాణం 60mmHg(8.0 kPa)మించకపోవడం ఎన్నో సార్లు జరుగుతుంది.

ఈ వాయు మిలనం జరగక పోవడం అన్నది కారణ భూతమైన రోగాన్ని బట్టి, ఇతర కారణాలను బట్టి అనేక విధాలుగా ఉండేందుకు ఆస్కారం ఉంది. ఉదాహరణకు, న్యూమోనియాచే ప్రేరితమైన ARDSలో అల్వియోలార్ ఇంఫిల్ట్రేట్స్ అన్నీ కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ కేంద్రాలు సాధారణంగా క్రింది తమ్మెల వైపు వెనుక భాగాన ఉంటాయి. ఎక్కడైతే వ్యాధి మొదలు సోకిందో ఆ భాగాలలోనే ఇవి కేంద్రికృతమై ఉంటాయి.

అదే సెప్సిస్ లేదా ట్రామా వల్ల ప్రేరితమైన ARDSలో ఇంఫిల్ట్రేట్స్, ఒక క్రమమ లేకుండా ముక్క ముక్కలుగా అంతటా వ్యాపించి ఉంటాయి. వెనుక భాగాలు, దిగువ భాగాలు, ఎప్పుడూ ఎక్కువగానే ప్రభావితం అవుతుంటాయి. కానీ ఎక్కడా ఒక సమ వ్యాప్తి కనిపించదు.

వాయు మిలనం తగ్గడం అన్నది ఊపిరితిత్తుల యాంత్రిక ధర్మాలలో ప్రధానమైన మార్పులు తెస్తుంది. ఈ మార్పులే యాంత్రిక వెంటిలేషన్ పై ఉన్న రోగుల విషయంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం లోనూ, అది ARDSగా పరివర్తన చెందడంలోనూ అతి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

[మార్చు] యాంత్రిక ఒత్తిడి

ARDS చికిత్సలో యాంత్రిక వెంటిలేషన్ అన్నది ఒక మౌలికమైన భాగం. వాయు మిలనం తగ్గే కొద్దీ (అంతర్ భూతమైన వ్యాధి ముదిరే కొద్దీ)శ్వాసక్రియ వేగం ఎంతగా పెరిగిపోతుందంటే జీవించడమే అసాధ్యం అయిపోతుంది. అందువల్ల శ్వాస క్రియా కండరాలకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశ్యంతో రోగి వాయు ప్రసార పథాలను కాపాడేందుకు యాంత్రిక వెంటిలేషన్ ను ప్రవేశపెడతారు.

కానీ ఈ యాంత్రిక వెంటిలేషన్ అన్నదే ARDS సంభవించడానికీ, మరింత తీవ్ర తరం కావడానికి కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి.[1]

శ్వాస వాహికలో గొట్టాలను దూర్చే వెంటిలేషన్ వల్ల తలెత్తే రోగ కారక సమస్యలే కాక ARDS రోగులలో, పాజిటివ్ - ఒత్తిడి వెంటిలేషన్ నేరుగా ఊపిరితిత్తుల పనితీరునే మార్చి వేస్తుంది. దీని ఫలితంగా అంటే బ్యారో- ట్రామా ఫలితంగా, అధిక మరణాలు సంభవిస్తాయి.[1]

1998లో ఎమాటో తదితరులు ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. తక్కువ టైడల్ వాల్యూమ్(V t)(6mL.kg-1)తో వెంటిలేట్ చేయబడిన రోగులలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని వారు అందులో రుజువు చేసారు.[1][5] ఈ ఫలితం(సరియైనదే అని), 2000 సం.లో NIH స్పాన్సర్ చేసిన ఒక అధ్యయనంలో తిరిగి నిర్ధారించబడింది.[6] ఈ రెండు అధ్యయనాలు కూడా రకరకాల కారణాలతో బాగా విమర్శించబడినప్పటికీ లోవర్ వాల్యూమ్ వెంటిలేషన్ తో ప్రయోగాలు చేసిన వారిలో ఈ రచయితలు మొదటివారు కానప్పటికీ యాంత్రిక వెంటిలేషన్ కు మరియు ARDS కు మధ్య ఉన్న సంబంధం పై వీరు, కొత్త వెలుగును ప్రసరింపచేసారు.

ఒక అభిప్రాయం ప్రకారం, వెంటిలేటర్ వల్ల ఊపిరితిత్తుల పై అనువర్తితమయ్యే బలాలు ఒక లీవర్ లాగా పని చేసి ఊపిరితిత్తులను మరింతగా పాడు చేస్తాయి. శిథిలమైన యూనిట్లు, ఆక్సీకరీంచబడిన యూనిట్లు పరస్పరం కలిసే సంపర్క క్షేత్రం వద్ద జనించే తీవ్ర ఒత్తిడి కారణంగా ఆక్సీకరించబడిన యూనిట్లు విచ్చిన్నమైపోతున్నట్లు కనిపిస్తున్నది. రక్తపు వరదతో నిండిపోయిన అల్వియోలి పరిసరాలు మొత్తం జిగటగా తయారయ్యి, ఆక్సీక్రిత యూనిట్లను అస్తవ్యస్తమైన వాపుకు గురి చేస్తాయి. అల్వియోలస్ చుట్టూరా ఈ సంపర్క క్షేత్రాలు ఎన్ని తక్కువ ఉంటే అంత తక్కువ ఒత్తిడి ఉంటుంది.

నిజానికి కొద్దిపాటి ఒత్తిడికే, కణాల స్థాయిలో పని చేసే సంకేత ప్రసార వ్యవస్థలు ప్రేరితమై వాత కారక మాధ్యమాలను విడుదల చేస్తాయి.

ఈ రకమైన ఒత్తిడికి ట్రాన్స్ పల్మోనారి ఒత్తిడి(గ్రేడియంట్(P 1) కారణం. వెంటిలేటర్ యొక్క పునారావృత వ్యత్యాసాలే ఈ ఒత్తిడిని కలిగిస్తాయి. తక్కువ స్థాయి V t వద్ద వెంటిలేట్ చేయబడ్డ రోగులలో మెరుగైన ఫలితాలు కనిపించడానికి కారణం, బహుశః తక్కువ స్థాయి P 1 యొక్క అనుకూల ప్రభావమే అని చెప్పవచ్చు. వెంటిలేటర్ పై మనం ఏ స్థాయిలో V t ని సెట్ చేస్తామో అదే మోతాదులో ట్రాన్స్ పల్మోనరి ఒత్తిడి ఉత్పన్నం అవుతుంది. అంటే ఈ ఒత్తిడి అన్నది Vt చర్య యొక్క పరోక్ష ఫలితమే అన్నమాట. ప్లాట్యూ ఒత్తిడి(అసలైన P 1 కి బదులుగా తీసుకున్నది)32cmH2O(3.1kPa)కన్నా తక్కువ ఉన్న ట్రయల్ రోగులలో మాత్రమే బ్రతికే అవకాశాలు మెరుగయ్యాయి.

అల్వియోలార్ ఉపరితలం పై, P 1 అనువర్తించబడిన తీరును బట్టి ఊపిరితిత్తి యూనిట్లు అనుభవించే యాతన నిర్దారింపబడుతుంది. ARDSలో సర్వసాధారణ లక్షణం ఏమిటంటే, వాయు ఆవరణం క్రమరహితంగా కుదించుకుపోవడం. దీని వల్ల ఏర్పడే ధోరణి ఏమిటంటే V t స్థిరంగా ఉన్నప్పటికీ P 1 క్రమంగా పెరుగుతూ పోవడం, వ్యాధిగ్రస్తం అంతగా కాని యూనిట్ల పై అధిక భారం పెరుగుతూపోవడం.

వ్యాధి యొక్క భిన్న దశలలో పెరిగే అల్వియోలి క్రమరాహిత్యం, వాటి పై ప్రసరించే గురుత్వాకర్షక గ్రేడియంట్ కారణంగాను మరియు వాటిలో ప్రవహించే రక్తం యొక్క పెర్ఫ్యూజన్ ఒత్తిడి కారణంగాను మరింతగా పెరిగిపోతుంది. చివరగా, ఉదర భాగాలు కూడా ఊపిరితిత్తుల క్రింది మరియు వెనుక భాగాల పై అదనపు ఒత్తిడి కలుగచేస్తాయి. ఆ భాగాలు కుంచించుకుపోయి చివరకు పూర్తిగా నిర్విర్యం అయిపోతాయి.

ARDSలో కనిపించే అల్వియోలి యొక్క భిన్న యాంత్రిక లక్షణాలను, మారిపోయే భిన్న కాల స్థిరాంకాలు (అల్వియోలార్ అనుగుణ్యత X నిరోధముల మధ్య లబ్దము)గా వ్యాఖ్యానించవచ్చు. టైడల్ ఇన్ఫ్లేషణ్ జరుగుతున్నప్పుడు అల్వియోలాస్ తన చుట్టూ మారుతున్న ఒత్తిడి ఫలితంగాను, తన లోపల మారే జల - వాయు సంపర్కం(సర్ఫేక్టాంట్ క్షయం,వెల్లువ)కారణంగాను నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఈ స్థితిని దీర్ఘ కాల స్థిరాంకం ద్వారా తెలుసుకోవచ్చు.

పాజిటివ్ ఎండ్-ఎక్స్పిరేటరీ ఒత్తిడిని ఉపయోగించి స్లో అల్వియోలిని తెరిచి ఉంచాలి అని అంటారు. ఆధునిక వెంటిలేటర్ల లక్షణమిది. మొత్తం శ్వాస వలయం జరుగుతున్నంత సేపూ పాజిటివ్ ఎయిర్ వే ఒత్తిడి కొనసాగించబడుతుంది. అధిక మీన్ ఒత్తిడి సైకల్-వైడ్, రోగగ్రస్త యూనిట్లు నిర్వీర్యమ్ అయి పోకుండా అడ్డుకుంటుంది. అయితే దీన్ని P 1/ప్లాట్యూ ఒత్తిడితో సరిపోల్చుకోవలసి ఉంటుంది. ఇటీవలి కాలంలో అమలవుతున్న వెంటిలేటరి విధానాల్లో, మీన్ ఎయిర్ వే ఒత్తిడిని గరిష్టంగా ఉంచడం అన్నది ఒకటి. దీని ద్వారా కూలిపోయిన ఊపిరితిత్తి భాగాలను తిరిగి పనిచేయించే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ఆక్సీక్రుత యూనిట్లు పదే పదే తెరుచుకోవడం, మూసుకోవడము వల్ల జనించే అంతర యాతనను కూడా తగ్గించడం జరుగుతుంది.

ఈ అనుకూల స్థితిలో అల్వియోలార్ కాలస్థిరాంకాలలో గ్రావిటీ మరియు వాపు వల్ల ఏర్పడే అస్థవ్యస్థత తగ్గుతుంది. చికిత్సాపరంగా సరైనది అని అనిపిస్తే వెంటిలేటెడ్ రోగిని కదిలించినప్పుడు కూడా ఇదే ఫలితం వస్తుంది.

[మార్చు] వ్యాప్తి

ARDSకు కారణం అయిన అసలు వ్యాధిని కానీ లేదా గాయ కారణాన్ని కానీ తొలగించనట్లైతే, ARDS అన్నది క్రమంగా సిస్టమిక్ ఇన్ఫ్లమెట్రి రెస్పాన్స్ సిండ్రోంగా (లంగ్ ఇన్ఫెక్షన్ అయినట్లయితే సేప్సిస్ గా పరిణామం చెందుతుంది.[1] తీవ్ర ఘాతం వైపుగా మరియు బహుళ అవయవ శైతిల్యం వైపుగా సాగే ఈ క్రమం అచ్చంగా సేప్సిస్ వల్ల కలిగే వ్యాధి జన్య శరీర ధర్మాన్ని(పాతోఫిజియాలజీ)పోలి ఉంటుంది.

ఇవన్నీ కలిసి ఆక్సీజన్ ప్రసారాన్ని మరింతగా అడ్డుకుంటాయి. ARDS యొక్క ముఖ్య సమస్య ఇదే. ఇంతే కాక రేస్పిరేటారి అసిదియొసిస్ కు కూడా దారితీస్తుంది. పర్మిస్సివ్ హైపర్ క్యాప్నియ లాంటి వెంటిలేషన్ పద్దతులే తరచూ ఈ స్థితికి కారణం అవుతుంటాయి. ARDSలో వెంటిలేటర్ ప్రేరిత ఊపిరితిత్తుల గాయాన్ని పరిమితం చేయడానికి చేసే ఈ ప్రయత్నం చివరికి ఇలా వికటిస్తుంది.

ఫలితంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయి ఎండోథీలియల్ డిసీజ్ ఆఫ్ సివియర్ సెప్సిస్/SIRS అనే ప్రాణాంతక వ్యాధి తలెత్తుతుంది. ఇది ఆక్సీజన్ ప్రసారాన్ని మరింతగా అడ్డుకుంటుంది.

[మార్చు] చికిత్స

[మార్చు] సాధారణ

అక్క్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం(రోగుల)ను సాధారణంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో, యాంత్రిక వెంటిలేషన్ ను ఉపయోగించి చికిత్స చేయడం జరుగుతుంది. నోరు-శ్వాస వాహిక ద్వారా గొట్టాలను అమర్చి కానీ,(2 వారాల కన్నా)ఎక్కువ కాలం వెంటిలేషన్ అనివార్యం అయిన సందర్భాలలో ట్రాఖియొస్టమీ ద్వారా గానీ, ఈ వెంటిలేషన్ ను అందచేస్తారు.

గొట్టాలను అమర్చని వెంటిలేషన్, వ్యాధి యొక్క తొలి దశలో మాత్రమే సాధ్యం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే ARDS వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో(అంటే,ఎటిపికల్ న్యుమోనియా,పల్మొనరీ కన్త్యూశన్ లాంటి జబ్బులున్న వారు లేదా పెద్ద ఆపరేషన్లు అయిన రోగులలో) ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే ఇది సాధ్యం.

అంతర్భూతమైన అసలు రోగానికి చికిత్స చాలా ముఖ్యం. అది తగ్గనంత వరకు ARDS తగ్గే ప్రసక్తి ఉండదు.

మైక్రోబయలాజికల్ కల్చర్ ఫలితాలు తెలియగానే తగిన యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభించాలి. స్థానిక మైక్రోబయలాజికల్ పర్యవేక్షణ సమర్థవంతంగా ఉంటే ఎంపిరికల్ చికిత్స చేయడం మంచిదే . ARDS రోగులలో 60% కన్నా ఎక్కువ మంది ఊపిరితిత్తుల గాయానికి ముందు కానీ తర్వాత గానీ (నోసోకొమియల్/ఆస్పత్రుల ద్వారా వ్యాపించే) పల్మొనరీ ఇన్ఫెక్షన్ బారిన పడతారు.

ఇన్ఫెక్షన్ కు కారణం అయిన రోగానికి శస్త్రచికిత్స చేయడం సాధ్యమయినట్లైతే వెంటనే చేసేయాలి. ఒక వేళ సెప్సిస్ నిర్ధారణ అయితే, స్థానికంగా చేయవలసిన ప్రోటోకాల్స్ ను వెంటనే అమలు చేసేయాలి.

సాధారణంగా ఉపయోగించే సహాయక చికిత్సలో రెండు అంశాలు ఉన్నాయి. యాంత్రిక వెంటిలేషన్ లోని కొన్ని పద్దతులు, ఔషధ శాస్త్రంలోని కొన్ని ఏజెంట్స్. అయితే వీటి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఇంకా రుజువు కాలేదు. యాంత్రిక వెంటిలేషన్ ను కేవలం సహాయక చికిత్సగా చూడాలా లేక ప్రధాన చికిత్సగా చూడాలా అన్న చర్చ ఒకటి ఇటీవల జరుగుతున్నది. ఎందుకంటే రోగి మనుగడను అది అతి ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

[మార్చు] యాంత్రిక వెంటిలేషన్

స్థూల లక్ష్యం ఏమిటంటే, ఆమోదయోగ్యమైన స్థాయిలో వాయు మార్పిడిని నిర్వహించి (వెంటిలేటర్ ఉపయోగించడం వల్ల కలిగే)దుష్ఫలితాలను సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూడడం. మూడు విషయాలను ఉపయోగిస్తారు: PEEP(పాజిటివ్ ఎండ్-ఎక్స్పిరేటరీ ప్రెషర్, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో అల్వియోలార్ యూనిట్ లను తీసుకోవటానికి),మీన్ ఎయిర్ వే ఒత్తిడి(తీసుకొనే సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి, రక్త చలన ప్రభావాలను అంచనా వేయడానికి) మరియు ప్లట్యూ ఒత్తిడి(అల్వియోలార్ దిస్తేన్షన్ ను అత్యుత్తంగా అంచనా వేయటానికి).[7]

సాంప్రదాయ చికిత్సలో టైడల్ వాల్యుమ్స్ V t ఆఫ్ 12-15ml/kg అనేది లక్ష్యం. హెచ్చు స్థాయి టైడల్ వాల్యుమ్స్ అల్వియోలిని అతిగా వ్యాకోచింపచేసి వాల్యూట్రామా(ద్వితీయ ఊపిరితిత్తుల గాయం)కి దారి తీస్తాయి. ARDS క్లినికల్ నెట్వర్క్ లేదా ARDSNet ఇటీవల జరిపిన ఒక కీలక ప్రయోగం ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని రుజువు చేసారు. సాధారణంగా వాడే 12 ml/kg కి బదులుగా టైడల్ వాల్యూమ్ ని 6 ml/kg వద్ద ఉంచి వెంటిలేట్ చేసినప్పుడు జీవించే అవకాశాలు మెరుగయ్యాయి. అల్ప టైడల్ వాల్యుమ్స్(V t) వల్ల హైపర్ క్యాప్నియా మరియు అతేలేక్తాసిస్[1] లు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి వల్ల మృత ప్రదేశం పెరుగుతుంది.

ARDSలో టైడల్ వాల్యూమ్ పాత్ర పై NIH సహాయంతో ARDSnet చేబట్టిన ప్రయోగంలో తగ్గిన మరణాల సంఖ్యకు సంబంధం కల అతి ముఖ్యమైన స్వతంత్ర లక్షణం అల్ప టైడల్ వాల్యూమ్ వెంటిలేషనే అన్నది నిజం. 30 cm H2O కన్నా తక్కువ స్థాయి ప్లాట్యూ ఒత్తిడి అన్నది(ఈ ప్రయోగానికి)ద్వితీయ లక్ష్యమే. ARDSnet ప్రయోగం(ఇతర ప్రయోగాల ఫలితాల)లో లభించిన సమాచారాన్ని విశ్లేషించినప్పుడు ఒక సంగతి తెలిసింది. ప్లాట్యూ ఒత్తిడికి సురక్షితమైన ఊర్ధ్వ పరిమితి అంటూ ఏదీ లేదు. అంటే ప్లాట్యూ ఒత్తిడితో నిమిత్తం లేకుండా అల్ప టైడల్ వాల్యూమ్ తో రోగులు లాభపడ్డారు అని అర్థం.(చూడుము:హేగర్ తదితరులు; అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్,2005).

[మార్చు] APRV(ఎయిర్ వే ప్రెషర్ రిలీజ్ వెంటిలేషన్) మరియు ARDS / ALI

ARDSలో మరణాలను తగ్గించే వెంటిలేటర్ మోడ్ ఇదీ అంటూ ప్రత్యేకంగా చెప్పడం కష్టం. చరిత్రాత్మకమైన ARDSNet ప్రయోగం వాల్యూమ్ కంట్రోల్ మోడ్ ను ఉపయోగించి అల్ప పరిమాణాల వద్ద మరణాల సంఖ్య తగ్గినట్లు నిరూపించింది. అయితే ఈ వాల్యూమ్ కంట్రోల్డ్ వెంటిలేషన్ అన్నదాన్ని ఇతర వెంటిలేషన్ మోడ్స్ తో ప్రత్యక్షంగా పోల్చి చూడలేదు అన్నది వాస్తవం.

కొంత మంది వైద్యులు ఎయిర్ వే ప్రెషర్ రిలీజ్ వెంటిలేషన్(APRV)ను ఇష్టపడతారు. APRV వెంటిలేషన్ లోని కొన్ని అనుకూలతలు: తగ్గిన ఎయిర్ వే ఒత్తిడి, తగ్గిన సూక్ష్మ వెంటిలేషన్, తగ్గిన మృత ప్రాంత వెంటిలేషన్, పెరిగిన సహజ శ్వాస క్రియ, దాదాపు(రోజులో)24 గంటల పాటు అల్వియోలార్ రిక్రూట్మెంట్, తగ్గిన మత్తు మందుల వాడకం, దాదాపు పూర్తిగా నిర్మూలించబడ్డ న్యూరో మస్క్యులార్ బ్లాకేడ్, ఆప్టిమైజ్ద్ ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ రిజల్ట్స్, FRC(ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటి)యాంత్రిక పునః స్థాపన, గుండె పని తీరు పై సత్ ప్రభావం(సహజంగా తీసుకున్న ప్రతీ శ్వాసతో పాటు అధికమయ్యే బేస్ లైన్ కారణంగా ఏర్పడే నెగెటివ్ ఇన్ఫ్లెక్షన్ వల్ల), పెరిగిన అవయవ మరియు కణజాల పెర్ఫ్యూషన్, పెరిగిన కిడ్నీ పర్ఫ్యుషన్ కారణంగా పెరిగిన మూత్ర ఉత్పత్తి.

ARDS రోగి సాధారణంగా 8 నుండి 11 రోజుల వరకు యాంత్రిక వెంటిలేటర్ పైనే ఉంటాడు. APRV ఈ సమయాన్ని గణనీయముగా తగ్గించి విలువైన వనరులను పరిరక్షిస్తుంది.

ARDSNet వారి ప్రోటోకాల్ తో పోల్చితే APRV అన్నది మరణ శాతాన్ని తగ్గిస్తుందా లేదా అన్నదాని పై ఒక ప్రత్యేక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. చికిత్స పరంగా APRV ఎన్నో అద్భుత ఫలితాలు సాధించినప్పటికీ ఇలాంటి అధ్యయనం జరపవలసిన అవసరాన్ని గుర్తించడానికి తగిననంత రాజకీయ ధృడ నిశ్చయం వైద్య సముదాయానికి లేదా అనిపిస్తుంది.

[మార్చు] పాజిటివ్ ఎండ్ -ఎక్స్పిరేటరీ ప్రెషర్

పాజిటివ్ ఎండ్ - ఎక్స్పిరేటరీ ఒత్తిడి(PEEP)అన్నది యాంత్రిక వెంటిలేషన్ పై ఉన్న ARDS రోగులలో ఆక్సీజనీకరణను పెంచడానికి ఉపయోగిస్తారు. ARDSలో మూడు రకాలైన అల్వియోలీ సముదాయాలను గుర్తించవచ్చు. సాధారణ(మొదటి రకం) అల్వియోలిలు ఎల్లప్పుడూ వ్యాకోచ స్థితిలోనే ఉండి వాయు మార్పిడిలో పాల్గొంటాయి. వెల్లువెత్తిన (రెండవ రకం) అల్వియోలిలను ఏ రకం వెన్టిలేటరీ రెజీమ్ లలో కూడా వాయు మార్పిడిలో ఎన్నటికీ ఉపయోగించుకోలేము. అతేలేక్తిక్ లేదా పాక్షికంగా వెల్లువెత్తిన అల్వియోలి(మూడవ రకం)లను కొన్ని రకాలైన వెన్టీలేటరీ రెజీమ్ లలో గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రక్రియలో పాల్గొనేందుకు తీసుకోవచ్చును. రిక్రూట్ చేయదగ్గ అల్వియోలి ఒక అవిచ్చిన్న సముదాయంగా ఉంటుంది. వీటిలో కొన్నిటిని స్వల్ప PEEPతోనే రిక్రూట్ చేసుకోవచ్చు. మరి కొన్ని చాలా అధిక PEEPతో మాత్రమే రిక్రూట్ అవుతాయి. ఇంకొక అదనపు చిక్కేమిటంటే దాదాపు అన్ని అల్వియోలీ కూడా తెరుచుకోవడానికి ఎంత ఒత్తిడి అయితే అవసరమో అంత కంటే అధిక ఒత్తిడిలో మాత్రమే తెరుచుకుంటాయి. ఈ కారణంగానే PEEPని కొన్ని సార్లు చాలా అధిక స్థాయికి(కొన్ని సెకండ్ల నుండి కొన్ని నిమిషాల దాకా)పెంచి చాలా దిగువ స్థాయికి తగ్గిస్తుంటారు. అంతిమంగా PEEP చాలా హాని కూడా చేయగలదు. అధిక PEEP అన్నది అనివార్యంగా మీన్ ఎయిర్ వే ఒత్తిడిని మరియు అల్వియోలార్ ఒత్తిడిని పెంచుతుంది. ఇది సాధారణ అల్వియోలిలో ఓవర్ దిస్తేన్షన్ ను కలిగించి వాటిని పాడు చేస్తాయి. తత్ఫలితంగా DAD ఏర్పడుతుంది.

అత్యుత్తమ PEEPని ఊపిరితిత్తి యొక్క సిగ్మాయిడల్ ఒత్తిడి-వాల్యూమ్ ల సంబంధాన్ని (గ్రాఫ్ లో) సూచించే వక్రరేఖలో కనిపించే నిమ్న ఇన్ఫ్లేక్షన్ పాయింట్ (LIP) కన్నా కాస్త అధికమైన cmH2Oగా నిర్వచిస్తారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం LIP-బిందు ఒత్తిడి అన్నది దాని కన్నా అధికమైన ఏ ఒత్తిడి కన్నా మెరుగైనదేమీ కాదు అని తెలిసింది. ఎందువల్లనంటే, ఇన్ఫ్లేషణ్ అంతటా శిథిల అల్వియోలీ యొక్క రిక్రూట్మెంటు మరియు వాయు మిశ్రిత యూనిట్ల ఓవర్ దిస్తేన్సేషన్ అన్నవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి. ఒత్తిడి పరిమాణం వక్రరేఖను రాబట్టడానికి ఉపయోగించే పద్దతులు చాలా వికారంగా ఉన్నప్పటికీ, ఈ రోగుల పై ఉపయోగించవలసిన కనిష్ట PEEPను తెలుసుకోవడానికి, కొంతమంది ఇప్పటికీ ఈ పద్ధతినే అవలంబిస్తున్నారు. అత్యాధునికమైన కొన్ని వెంటిలేటర్లకు ఒత్తిడి పరిమాణం వక్రరేఖను aయత్నకృతంగా కనుగొనే సామర్థ్యం ఉన్నది. 'తక్షణమే' గుర్తించగల ట్రిగ్గర్ ను కలిగి ఉండే అవకాశం ఈ విశ్లేషణ పై కొత్త ఆసక్తిని రేకెత్తించవచ్చు.

PEEPను వాస్తవ పరిస్థితుల ఆధారంగా కూడా అమర్చవచ్చును. కొందరు రచయితల ప్రకారం పూర్వపు వెంటిలేషన్ ను తిరిగి తీసుకువచ్చే ముందు 'రిక్రూటింగ్ మ్యానూవర్'(అంటే, శిథిలమైపోయిన యూనిట్లను రిక్రూట్ చేసుకోవడానికి లేదా తెరువడానికి స్వల్పకాలం పాటు అత్యధికమైన పాజిటివ్ ఎయిర్ వే ఒత్తిడిని నిరంతరాయంగా ఉదా:50 cmH2O(4.9 kPa) ఉండేలా అత్యధిక డిస్తెన్డింగ్ ఒత్తిడిని కలగచేస్టారు) చేయటం మంచిది. స్టెప్ - డౌన్ ట్రయల్ చేస్తున్నప్పుడు PaO2(పెరిఫెరల్ రక్త ఆక్సిజన్ సంత్రుప్తీకరణ)పడిపోవటానికి ముందు ఉన్న ఒత్తిడినే PEEP యొక్క అంతిమ స్థాయిగా నిర్ణయిస్తారు.

ఇంట్రిన్సిక్ PEEP(iPEEP) లేదా ఆటో PEEPని మొదటిసారి అభివర్ణించిన వ్యక్తి సెయింట్ పాల్ రీజియన్స్ ఆసుపత్రికి చెందిన జాన్ మ్యారిని. ఇతని ప్రకారం రోగులలో PEEPకు అదృశ్యంగా దోహదం చేసేది ఇదే. అధిక పునఃపున్యంతో వెంటిలేషన్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా అబ్స్త్రక్తివ్ లంగ్ డిసీజ్ ఉన్న రోగుల విషయంలో దీని యొక్క పాత్ర చాలా గణనీయమైనది. వెంటిలేషన్ పై ఉన్న ARDS రోగులలో iPEEPని అధికారికంగా అధ్యయనం చేసిన ఉదాహరణలు చాలా తక్కువ. అందుకే దీని ప్రభావం ఏమిటో స్పష్టంగా చెప్పలేము. ARDS రోగుల చికిత్సా సమయంలో ముఖ్యంగా అధిక - పునఃపున్యం (ఆసిలేటరీ/jeT)తో వెంటిలేషన్ చేస్తూ ఉన్నప్పుడు దీన్ని కొలత వేయాలనే సూచన ఉన్నది.

PEEP వల్ల కలిగే లాభాలకు మరియు దుష్ఫలితాలకు నడుమ సంతులనం పాటించక తప్పదు.

[మార్చు] అనుకూల భంగిమ

అక్క్యుట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోంలో ఊపిరితిత్తుల ఇన్ ఫిల్త్రేట్స్ యొక్క వ్యాప్తి క్రమరహితంగా ఉంటుంది. రోగిని అనుకూల భంగిమలోకి మార్చడం వల్ల(ముఖం క్రిందికి)అతేలేక్తాసిస్ తగ్గి పెర్ఫూశన్ పెరిగి ఆక్సిజనీకరణం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అయితే హైపోక్జేమియాను అధిగమించినంత మాత్రాన రోగి మనుగడ పై దీని ప్రభావం మాత్రం ఏమీ లేదు అన్నది నిజం.[1][8]

[మార్చు] ద్రవ నిర్వహణ

అనేక అధ్యయనాల ప్రకారం బరువు కోల్పోయిన లేదా దయూరిసిస్/ద్రవ నియంత్రణ వలన పల్మొనరీ వేద్జ్ ఒత్తిడి తగ్గిపోయిన రోగులలో ఊపిరితిత్తుల పని తీరు మెరుగుపడింది.[1]

[మార్చు] కార్టికోస్టీరాయిడ్స్

మేడురి తదితరులు చేసిన ఒక అధ్యయనం పరిమిత మోతాదులో కార్టికోస్టీరాయిడ్స్ యొక్క ఇనియోగం ARDSలో గుర్తించతగిన అభివృద్దిని కనుగొంది. ప్రాధమిక మందుల వినియోగం మిథైల్ ప్రేడ్నిసొలాన్ ను రోజుకి 2 mg/kg చొప్పున తీసుకోవటాన్ని కలిగి ఉంది. 3–5 రోజుల తరువాత స్పందన ప్రస్పుటంగా ఉండాలి. 1–2 వారాలలో మిథైల్ ప్రేడ్నిసొలాన్ మోతాదును రోజుకి 0.5-1.0 mg కి తగ్గించవచ్చును. ARDS రోజులు అధిక మోతాదులో కార్టికోస్టీరాయిడ్స్ తీసుకోవటం ద్వారా ఎలాంటి లాభం పొందలేరు.[1][9] ఒక కేంద్రంలో కొంతమంది రోగుల పై చేసిన అధ్యయన ఫలితం ఇది. ఈ మధ్యకాలపు NIH-చే ARDS కొరకు స్పాన్సర్ చేయబడిన కార్టికోస్టీరాయిడ్స్ యొక్క బహుళ కేంద్ర ARDSnet LAZARUS అధ్యయనం అవి ARDSలో ప్రాభావం చూపలేవు అని నిరూపించింది.

[మార్చు] నైట్రిక్ ఆక్సైడ్

నైట్రిక్ ఆక్సైడ్ ను పీల్చితే అది సెలెక్టివ్ అల్మొనరీ వాసోడైలేతర్ గా పని చేస్తుంది. హీమోగ్లోబిన్కు వేగంగా చుట్టుకోవడం వల్ల వ్యవస్థాగత ప్రభావాలు తగ్గుతాయి. బాగా వెంటిలేషన్ అందిన ప్రాంతాలలో ఇది పెర్ఫూశన్ ను పెంచుతుంది. మంచి ఫలితాలు ఉంటాయని రుజువు చేసిన పెద్ద పెద్ద అధ్యయనాలు లేవు. అందువల్ల దీనిని జాగ్రత్తగా వినియోగించాలి.

కారోతిక్ మరియు అయోర్తిక్ కణాలలో కేమోరిసేప్తర్స్ ను అల్మిత్రైన్ బై స్మేసైలేట్ అన్న మందు ప్రేరేపిస్తుంది. హైపోక్జియా చే ప్రేరిత పల్మొనరీ వాసో కాన్స్త్రిక్షణ్ ను బలోపేతం చేయడం ద్వారా NO యొక్క ప్రభావాన్ని బలోపేతం చెయ్యడానికి ఈ మందును వాడతారు. ARDS వ్యాధి చికిత్సలో ఈ కాంబినేషన్ వల్ల లాభమో కాదో తెలియదు.[1]

[మార్చు] సర్ఫక్తాంట్ చికిత్స

ARDSలో ఎక్సోజీనస్ సర్ఫెక్తాంట్ వల్ల మరణాలు గణనీయంగా తగ్గుతాయని రుజువు చేసిన ఒక్క ప్రయోగాత్మక క్లినికల్ పరీక్ష కూడా లేదు.

[మార్చు] ఉపద్రవాలు

ARDS అన్నది ఇన్వాసీవ్ పద్దతుల్లో చికిత్స చేయవలసిన చాలా తీవ్రమైన వ్యాధి. ఇందులో చాలా ప్రమాదాలు ఉన్నాయి. దృష్టిలో ఉంచుకోవలిసిన ప్రమాదాలు:[1]

  • శ్వాసకోశ: బారో ట్రామా (వాలూత్రామా),పల్మోనరి ఏమ్బాలిసం(PE),పల్మోనరిఫిబ్రోసిస్,వెంటిలేటర్ సంబంధ న్యుమోనియా(VAP)
  • జీర్ణకోశ: రక్తస్రావం (అల్సర్), డిస్మోటిలిటి, న్యుమో పెరితోనియం, బ్యాక్టీరియల్ త్రాన్సలోకేషన్.
  • గుండె: అరితిమియాస్, మాయో కార్దియల్ దిస్ఫంక్షన్.
  • మూత్రపిండ: ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ (ARF), పోసిటివ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్.
  • మెకానికల్: వాస్క్యులార్ గాయం, న్యూమో తోరాక్స్ (పల్మోనరీ ఆర్టరీ కతేటార్ ను పెట్టటం ద్వారా), త్రాఖియాల్ గాయం/స్తేనోసిస్ (ఏందో ట్రాకియల్ గొట్టం యొక్క ఇంటుబెషణ్ మరియు/లేదా ఇరిటేషన్ ఫలితంగా)
  • పోషక సంబంధ: పోషక లోపం(కెటబాలిక్ స్థితి),ఎలేక్త్రోలైట్ లోటు.

[మార్చు] సాంక్రమిక రోగ విజ్ఞానం

మొత్తం జనాభాలో ప్రతి 100,000 మందిలో 1.5-13.5 మంది ప్రతి ఏటా ARDS బారిన పడతారు.[citation needed] ఇంటెన్సివ్ కేర్ యునిట్(ICU)లో యాంత్రిక వెంటిలేషన్ పై ఉన్న వారే వీరిలో అత్యధికం. 4 గంటల కన్నా ఎక్కువ సేపు వెంటిలేషన్ పై ఉన్న రోగులలో అక్క్యూట్ లంగ్ ఇంజ్యూరీ బారిన పడ్డవారు 16.1% ఉన్నారు అని బ్రాన్-బుయ్సన్ మొదలైనవారు (2004) నివేదించారు. వీరిలో సగం కన్నా ఎక్కువ మందిలో ARDS వచ్చే అవకాశం ఉంది.

యాంత్రిక వెంటిలేషన్, సేప్సిస్, న్యుమోనియా, షాక్,ఆస్పిరేషణ్, ట్రామా(ముఖ్యంగా పల్మోనరి కాన్ట్యూశన్)పెద్ద ఆపరేషన్, పెద్ద మొత్తంలో రక్త మార్పిడి, పొగ పీల్చడం మందుల రియాక్షన్ లేదా అతి మోతాదు, ఊపిరితిత్తుల మార్పిడి లేదా పల్మోనరి ఏమ్బోలేక్టమి తరువాత కలిగే ఫాట్ ఏమ్బోలి, రేపర్ఫుషణ్ పల్మోనారి ఎడేమా మొదలైన ఏ కారణమైనా ARDSను రేకెత్తించవచ్చు. న్యుమోనియా, సేప్సిస్ లు అతి పెద్ద కారకాలు. 60% రోగులలో న్యుమోనియా ఉంటుంది. న్యుమోనియా, సేప్సిస్ లు ARDS యొక్క కారణాలైనా కావచ్చు లేదా దాని వల్ల కలిగిన ఉపద్రవాలైనా కావచ్చు.

ఏ కారణం చేతనైనా సరే, ఎలేవేటేడ్ అబ్డామినల్ ఒత్తిడి ఉన్నప్పుడు ARDS తల ఎత్తే ప్రమాదం, ముఖ్యంగా యాంత్రిక వెంటిలేషన్ ఉన్న సమయంలో గణనీయంగా పెరుగుతుంది.

మరణ శాతం 30% నుండి 85% వరకు ఉంటుంది.[citation needed] సాధారణంగా (వైద్య)సాహిత్యంలోని రాన్దమైజ్ద్ కంట్రోల్డ్ ట్రయల్స్ ప్రయోగాల్లో కానీ చికిత్సలో ఉన్నవారు కానీ తక్కువ మంది మాత్రమే చనిపోతున్నట్లు చూపుతున్నాయి. దీనికి కారణం బహుశః రోగులను చేర్చుకోవడానికి పెట్టుకొన్న కటిన నిబంధనలు కావచ్చు. పరిశీలనాత్మక అధ్యయనాలన్నీ 50%-60% దాకా మరణాలు జరుగుతున్నట్లు చెబుతున్నాయి.[citation needed]

[మార్చు] సూచనలు

  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 Irwin RS, Rippe JM (2003). Irwin and Rippe's Intensive Care Medicine, 5th, Lippincott Williams & Wilkins. ISBN 0-7817-3548-3. 
  2. Ashbaugh D, Bigelow D, Petty T, Levine B (1967). "Acute respiratory distress in adults". Lancet 2 (7511): 319–23. DOI:10.1016/S0140-6736(67)90168-7. PMID 4143721. 
  3. 3.0 3.1 Bernard G, Artigas A, Brigham K, Carlet J, Falke K, Hudson L, Lamy M, Legall J, Morris A, Spragg R (1994). "The American-European Consensus Conference on ARDS. Definitions, mechanisms, relevant outcomes, and clinical trial coordination". Am J Respir Crit Care Med 149 (3 Pt 1): 818–24. PMID 7509706. 
  4. Ware L, Matthay M (2000). "The acute respiratory distress syndrome". N Engl J Med 342 (18): 1334–49. DOI:10.1056/NEJM200005043421806. PMID 10793167. 
  5. Amato M, Barbas C, Medeiros D, Magaldi R, Schettino G, Lorenzi-Filho G, Kairalla R, Deheinzelin D, Munoz C, Oliveira R, Takagaki T, Carvalho C (1998). "Effect of a protective-ventilation strategy on mortality in the acute respiratory distress syndrome". N Engl J Med 338 (6): 347–54. DOI:10.1056/NEJM199802053380602. PMID 9449727. 
  6. MacIntyre N (2000). "Mechanical ventilation strategies for lung protection". Semin Respir Crit Care Med 21 (3): 215–22. DOI:10.1055/s-2000-9850. PMID 16088734. 
  7. Malhotra A (2007). "Low-tidal-volume ventilation in the acute respiratory distress syndrome". N Engl J Med 357 (11): 1113–20. DOI:10.1056/NEJMct074213. PMID 17855672. 
  8. Gattinoni L, Tognoni G, Pesenti A, Taccone P, Mascheroni D, Labarta V, Malacrida R, Di Giulio P, Fumagalli R, Pelosi P, Brazzi L, Latini R (2001). "Effect of prone positioning on the survival of patients with acute respiratory failure". N Engl J Med 345 (8): 568–73. DOI:10.1056/NEJMoa010043. PMID 11529210. 
  9. Meduri G, Tolley E, Chrousos G, Stentz F (2002). "Prolonged methylprednisolone treatment suppresses systemic inflammation in patients with unresolving acute respiratory distress syndrome: evidence for inadequate endogenous glucocorticoid secretion and inflammation-induced immune cell resistance to glucocorticoids". Am J Respir Crit Care Med 165 (7): 983–91. PMID 11934726. 

[మార్చు] మరింత చదవటానికి


[మార్చు] బాహ్య లింకులు

మూస:Respiratory pathology మూస:Intensive care medicine

'

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు