అగా ఖాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అగా ఖాన్ (Persian: آقا خان ‎) అనేది షియా మతం యొక్క ఇస్మాయిలీ అనుచరుల (అరబ్బీ: الطائفة الإسماعيلية‎) అతిపెద్ద శాఖ ఇమామ్ యొక్క వంశపారంపర్య బిరుదు. ఇమామ్ జ'ఫర్ అల్-సదిక్ యొక్క పెద్ద కుమారుడు ఇస్మాయిల్ ఇబ్న్ జఫర్ యొక్క వారసుల ఇమామత్ ను వారు ధృవపరుస్తారు, అదే సమయంలో షియా తెగ యొక్క ప్రధాన పన్నెండవ శాఖ ఇస్మాయిల్ యొక్క తమ్ముడు ముస అల్-కాజిమ్ మరియు ఆయన వారసులను అనుసరిస్తుంది.

చరిత్ర[మార్చు]

నిజారీ ఇమాములు ఇరాన్ లో నివశించియున్న 19వ శతాబ్దం ప్రధమార్థంలో అగా ఖాన్ అనే గౌరవ బిరుదు పర్షియా యొక్క షా అయినటువంటి ఫత′హ్-అలీ షా కజర్ చే ఇస్మాయిలీల 46వ ఇమామ్ అగా హసన్ అలీ షాకు సమర్పించబడింది. శబ్దలక్షణపరంగా ఈ బిరుదు "ఉత్కృష్ట" లేదా "అధిపతి" అని అర్థం వచ్చే టర్కీయుల సైనిక బిరుదు అఘాను , అల్టైక్ భాషలో ప్రాంతీయ పరిపాలకుడుకు వాడే బిరుదు ఖాన్ ను కలిగి ఉంది, అందువలన ఈ సమ్మేళనం స్థూలంగా "అధికారం చెలాయించే అధిపతి" అనే అర్థాన్ని ఇస్తుంది. పర్షియా యొక్క కజర్ న్యాయస్థాన నియమావళిలో, ఖాన్ (మరియు అమీర్) సాధారణంగా భద్రతా దళాల దళపతులు మరియు దేశీయ తెగల నాయకులలో భాగం, రాజవంశస్థులు కానివారికిచ్చే ఎనిమిది బిరుదుల తరగతులలో ఇది నాలుగవ స్థానంలో ఉంటుంది.

1887వ సంవత్సరంలో, భారతదేశం యొక్క వలస పాలకులు బ్రిటీష్ రాజ్ సర్కార్, అగా ఖాన్ కు హోదాను మరియు ఘనతను ఇచ్చారు. ఆఫ్ఘన్ యుద్ధం (1841 మరియు 1842) యొక్క చివరి దశలలో అగా ఖాన్ I మరియు ఆయన అశ్వికదళ అధికారులు జనరల్ నాట్ కు ఏదో సేవ చేయటానికై కాందహార్ లో ఉన్నారు మరియు జనరల్ ఇంగ్లాండ్ సింద్ నుండి నాట్ కు చేరేందుకు కుడా సేవలందించారు. ఈ సేవలు, మరియు 1843-44 లో సర్ చార్లెస్ నేపియర్ సింద్ ను జయించుటలో అగా ఖాన్ I అందించిన ఇతర సేవలకై, అగా ఖాన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి పింఛను అందుకున్నారు. 'బ్రిటీష్ రాజ్ మరియు భారతదేశంలో దాని ప్రతినిధులచే రాజవంశీయ హోదా' ఆయనకు ఇవ్వబడింది మరియు దీనితో ఆయన బ్రిటీష్ ఇండియాలో తుపాకీచే గౌరవ వందనం అందుకున్నఏకైక మతపరమైన లేదా సమాజ నేత అయ్యారు; మిగిలిన వందనపు వంశాలు అన్నీ రాజవంశంచే పరిపాలించబడిన రాష్ట్రాలు లేదా రాజ్ చే వదలివేయబడిన రాష్ట్రాలలో వంశపారంపర్య రాజవంశీయ బిరుదులను కలిగి ఉన్న రాజకీయ పింఛనుదారుల వంశాలు.

మొదటి అగా ఖాన్ అయిన హసన్ అలీ షా ఆఫ్ఘనిస్తాన్ నుండి సింద్ వచ్చినప్పుడు, ఆయన మరియు ఆయన సేనలకు సింద్ కు చెందిన మీర్ నాసిర్ ఖాన్ ఆశ్రయం ఇచ్చారు.

వారసుడు[మార్చు]

జూలై 11, 1957వ సంవత్సరంలో 20 సంవత్సరాల వయసులో ఇస్మాయిలీల యొక్క ఇమామత్ ను స్వీకరించడంతో యువరాజు కరీం అల్-హుస్సైనీ ఆయన తాత సర్ సుల్తాన్ ముహమ్మద్ షా అగా ఖాన్ (అగా ఖాన్ III) యొక్క వారసునిగా, ప్రస్తుత అగా ఖాన్ IV అయ్యారు. తన వీలునామాలో, ఆయన తాత తన మనవడిని ఇస్మాయిలీ ఇమామత్ కు వారసునిగా ఎంపిక చేయటానికి దారి తీసిన పరిస్థితులను గూర్చి వెల్లడించారు:

In view of the fundamentally altered conditions in the world in very recent years due to the great changes that have taken place, including the discoveries of atomic science, I am convinced that it is in the best interests of the Ismaili community that I should be succeeded by a young man who has been brought up and developed during recent years and in the midst of the new age, and who brings a new outlook on life to his office.[1]

49వ ఇస్మాయిలీ ఇమామ్ యువరాజు కరీం అగా ఖాన్ IV, మొహమ్మద్ యొక్క దాయాది అలీ, మరియు ఆయని భార్య అయిన మొహమ్మద్ యొక్క కుమార్తె ఫాతిమాల ద్వారా తమ వంశం యొక్క జాడలను చూపిస్తారు.[2] హిస్ హైనెస్ అనే బిరుదు యునైటెడ్ కింగ్డం యొక్క రాణి ఎలిజబెత్ II చే 1957వ సంవత్సరంలో ఇవ్వబడింది,[3] మరియు 1959లో ఇరాన్ యొక్క షా చే హిస్ రాయల్ హైనెస్ అనే బిరుదు ఇవ్వబడింది.[4] 2007వ సంవత్సరం జూలై 11న, అగా ఖాన్ IV ఇస్మాయిలీ సమాజం యొక్క ఇమామ్ గా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నారు.

కుటుంబ ఆస్తి మరియు సమాజ హోదాకు వారసుడు అయిన అగా ఖాన్, ప్రపంచంలోని అతి పెద్ద ప్రభుత్వేతర అభివృద్ధి వ్యవస్థలలో ఒకటైన అగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ యొక్క వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు మరియు విద్యను ప్రోత్సహించేందుకు AKDN అనేక ఆఫ్రికన్ మరియు ఆసియన్ దేశాలతో కలిసి పనిచేయడాన్ని కొనసాగిస్తుంది. ఉదాహరణకు, ఆఫ్ఘనిస్తాన్ లో AKDN అభివృద్ధి పథకాలకై $750 మిలియన్ లను తరలించింది.[5] 1979వ సంవత్సరంలో, ఇస్లామిక్ కళ, నిర్మాణ శాస్త్రం, పట్టణీకరణ, భూదృశ్య రూపకల్పన, మరియు పరిరక్షణ - మరియు ఆ జ్ఞానాన్ని సమకాలీన రూపకల్పన పథకాలకై అన్వయపరుచుట వంటి వాటిని ప్రోత్సహించేందుకు అగా ఖాన్ హార్వర్డ్ యునివర్సిటీ మరియు మాస్సాచుసెట్ట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీలలో అగా ఖాన్ ప్రోగ్రాం అఫ్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ను ప్రారంభించారు.[6] రెండు సంస్థలలోనూ ఈ పథకం పరిశోధనలో నిమగ్నమై ఉంటుంది మరియు విద్యార్థులు MIT యొక్క డిపార్ట్మెంట్ అఫ్ ఆర్కిటెక్చర్ నుండి అగా ఖాన్ ప్రోగ్రాంలో ప్రత్యేకతను సాధిస్తూ మాస్టర్ అఫ్ సైన్స్ అఫ్ ఆర్కిటెక్చరల్ స్టడీస్ లో పట్టభద్రులు కావచ్చు.

ఈ బిరుదును కలిగిన వారి యొక్క పట్టిక[మార్చు]

  1. అగా ఖాన్ I = హసన్ అలీ షా మెహలతీ అగా ఖాన్ I (1800–1881), 46వ ఇమామ్ (1817–1881)
  2. అగా ఖాన్ II = అలీ షా అగా ఖాన్ II (1830–1885 గూర్చి), 47వ ఇమామ్ (12 ఏప్రిల్ 1881–1885)
  3. అగా ఖాన్ III = సర్ సుల్తాన్ మొహమ్మద్ షా (1877-1957), 48వ ఇమామ్ (17 ఆగష్టు 1885–1957)
  4. అగా ఖాన్ IV = యువరాజు కరీం అల్ హుస్సైనీ (బి. 1936), ఇస్మాయిలీల 49వ ఇమామ్ (1957వ సంవత్సరం 11 జూలై నుండి)

వీటిని కూడా చూడండి[మార్చు]

  • ఇస్మాయిలీ
  • నిజారీ
  • అగా ఖాన్ డెవెలప్మెంట్ నెట్వర్క్
  • అగా ఖాన్ యునివర్సిటీ
  • అగా ఖాన్ ఫౌండేషన్

సూచనలు[మార్చు]

  1. "Aly Khan's Son, 20, New Aga Khan", The New York Times, 13 July 1936, p. 1
  2. ఫర్హద్ దఫ్తరీ. ది ఇస్మాయిలీస్: దెయర్ హిస్టరీ అండ్ డాక్ట్రిన్స్.
  3. పాట్రిక్ మోంటగ్యూ-స్మిత్ (1970) డెబ్రెట్’స్ కరెక్ట్ ఫార్మ్ . డెబ్రెట్’స్ పీరేజ్ లిమిటెడ్. ISBN 0-905649-00-1. పేజీ 106.
  4. "Aga Khan Development Network - About us: Awards and Honours". Retrieved 2009-04-28. 
  5. "AKDN in Afghanistan". Retrieved 2008-08-26. 
  6. Harvard University, Massachusetts Institute of Technology. AKPIA (Academic Brochure). 

బాహ్య లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=అగా_ఖాన్&oldid=1165032" నుండి వెలికితీశారు