అగ్ని దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇరాన్ లోని యాజ్డ్ వద్దగల జొరాస్ట్రియన్ దేవాలయంలో మండుతున్న అగ్నిగుండం

ప్రాచీన పర్షియా (నేటి ఇరాన్) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు జొరాస్ట్రియన్ మతము. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం జెండ్ అవెస్తా, వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు.[1][2][3] 2010 నాటికి ముంబయిలో 50 దేవాలయాలు, ముంబయి తప్ప మిగిలిన భారతదేశంలో 50 దేవాలయాలు, ప్రపంచంలోని యితర దేశాలలో 27 దేవాలయాలు ఉన్నాయి.[4]

చారిత్రకాంశాలు[మార్చు]

పార్శీ=జొరాస్ట్రియన్ "జస్‌హాన్" వేడుక

ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడు ఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియా సామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజు చేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులు కన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు

పూజింపబడే దేవుడు[మార్చు]

ఈ మతము క్రైస్తవ మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రియన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

పూజ విధానము[మార్చు]

జొరాస్త్రియన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రియన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారతదేశం లోను మిగిలియున్నాయి.

Ml[మార్చు]

దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు

హైదరాబాదులోని అగ్నిదేవాలయాలు[మార్చు]

  1. పార్శీలు ఆరాధించే అగ్ని దేవాలయం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఒకటి ఉంది. దీని నిర్మాణం 1904లో జరిగింది. పార్శీలలో ముఖ్యులైన షనాయ్ వంశీయులు తిలక్‌రోడ్‌లో 190 మార్చిలో స్థలం కొనుగోలు చేసి ‘మానెక్‌బాయ్ నస్సేర్‌వాన్‌జీ షనాయ్’ పేరున ‘అగ్ని దేవాలయాన్ని’ నిర్మించారు. 1904 అక్టోబర్ 16న ఇది ప్రారంభమైంది. ఈ ఆలయం పూర్తిగా ఇండో-యూరోపియన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. కేవలం సున్నం ఇటుకలతో నిర్మితమై ఉంటుంది. హైదరాబాద్ అత్యంత పురాతన కట్టడాలలో ఇది ఒకటి. దీన్ని ప్రభుత్వం వారసత్వ కట్టడంగా గుర్తించింది.
  2. సికింద్రాబాదులో కూడా పార్సీ ఫైర్ టెంపుల్ ఉంది. సికింద్రాబాద్‌ ప్రాంతంలో వ్యాపారరంగంలో స్థిరపడిన పెస్టోంజి మెహెర్జీ, విక్కాజీ మెహెర్జీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు.[5]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Boyce, Mary (1975), "On the Zoroastrian Temple Cult of Fire", Journal of the American Oriental Society, Journal of the American Oriental Society, Vol. 95, No. 3, 95 (3): 454–465, doi:10.2307/599356, JSTOR 599356
  2. Boyce, Mary (1993), "Dar-e Mehr", Encyclopaedia Iranica, vol. 6, Costa Mesa: Mazda Pub, pp. 669–670
  3. Kotwal, Firoz M. (1974), "Some Observations on the History of the Parsi Dar-i Mihrs", Bulletin of the School of Oriental and African Studies, 37 (3): 664–669, doi:10.1017/S0041977X00127557
  4. Mathai, Kamini (12 July 2010). "Parsis go all out to celebrate milestone in Chennai". The Times of India. Chennai: The Times Group. Retrieved 24 Apr 2014.
  5. Dharmendra Prasad (1986), Social and Cultural Geography of Hyderabad City: A Historical Perspective, Inter-India Publications, p. 86, ISBN 8121000459
  • Boyce, Mary (1996), "On the Orthodoxy of Sasanian Zoroastrianism", Bulletin of the School of Oriental and African Studies, 59 (1): 11–28, doi:10.1017/S0041977X00028536
  • Boyce, Mary (1987), "Ātaškada", Encyclopaedia Iranica, vol. 2, Costa Mesa: Mazda Pub, pp. 9–10
  • Boyce, Mary; Kotwal, Firoze (2006), "Irānshāh", Encyclopaedia Iranica, vol. 13, Costa Mesa: Mazda Pub, archived from the original on 2008-02-08, retrieved 2006-09-06
  • Drower, Elizabeth Stephens (1944), "The Role of Fire in Parsi Ritual", Journal of the Royal Anthropological Institute, Royal Anthropological Institute, 74 (1/2): 75–89, doi:10.2307/2844296
  • Gnoli, Gherardo (1993), "Bahram in old and middle Iranian texts", Encyclopaedia Iranica, vol. 3, Costa Mesa: Mazda Pub, pp. 510–513
  • Russell, James R. (1989), "Atrušan", Encyclopaedia Iranica, vol. 3, Costa Mesa: Mazda Pub
  • Shenkar, Michael (2007), "Temple Architecture in the Iranian World before the Macedonian Conquest", Iran and the Caucasus, 11 (2): 169–194, doi:10.1163/157338407X265423
  • Shenkar, Michael (2011), "Temple Architecture in the Iranian World in the Hellenistic Period", in Kouremenos, A., Rossi, R., Chandrasekaran, S. (eds.), From Pella to Gandhara: Hybridisation and Identity in the Art and Architecture of the Hellenistic East: 117–140
  • Schippmann, Klaus, Die iranischen Feuerheiligtümer
  • Stausberg, Michael (2004), Die Religion Zarathushtras, vol. III, Stuttgart: Kohlhammer, ISBN 3-17-017120-8

బయటి లింకులు[మార్చు]