అగ్ని శ్వాస
శ్వాసతో అగ్నిగోళంను సృష్టించడాన్ని అగ్ని శ్వాస అంటారు.
విషయ సూచిక |
ఎలా చేస్తారు [మార్చు]
నోటిలో కొంత ఇంధనాన్ని ఉంచుకొని ఆ నోటిలోని ఇంధనాన్ని శ్వాస ద్వారా వెలుపలికి వెదజిమ్మడం ద్వారా వెలువడిన ఇంధనపు మంచు వెలుపల ఉన్న మంటను తగిలినప్పుడు ఆ ఇంధనం మండుట ద్వారా అగ్నికీలలు ఏర్పడతాయి. సరైన సాంకేతిక మరియు సరైన ఇంధనాన్ని ఉపయోగించి సాహాసోపేతమైన నిపుణులు అగ్ని శ్వాస ద్వారా సృష్టించే అగ్ని కీలలు ప్రేక్షకులకు అపాయం జరుగబోతున్నదేమోనని భ్రమ కలిగిస్తాయి. సాహాసోపేతమైన ఈ విన్యాసాలు ప్రేక్షకులలో అత్రుతను, అశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంధనం దహనమయ్యేందుకు కావలసిన ఆక్సిజన్, ఉష్ణం సంతులితంగా ఉన్నప్పుడే అగ్నిశ్వాసతో అగ్నిగోళాలు సృష్టించడానికి అనువుగా ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు [మార్చు]
సరైన ఇంధనాన్ని వాడనప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశముంది.
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే మరణం
తీవ్రమైన కాలిన గాయాలు
దంత సమస్యలు
ఇంధన విషం
తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు
పొడి దగ్గు
తలనొప్పి, చికాకు, మత్తు
వికారం, విరేచనాలు, వాంతులు, కడుపులో నొప్పి
నోరు పొడిబారడం
పెట్రోకెమికల్ ప్రభావం వలన నోరు లేదా గొంతు క్యాన్సర్