అగ్రసేన్ మహారాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగ్రసేన్ మహారాజ్ (Maharaja Agrasena)

అగ్రసేన్‌ మహారాజ్‌ క్షత్రియ వంశంలో జన్మించినప్పటికి తన రాజ్యాభివృద్ది కోసం, తన ప్రజల కోసం వైశ్యుడిగా మారి వ్యాపార అభివృద్దికి తోడ్పాటునందించారు. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతేనే ప్రజా సంక్షేమ సాధ్యమవుతుందని భావించి వ్యాపారులను నిరంతరం ప్రోత్సహించేవారు. అగ్రసేన్‌ మహారాజ్‌ 5133వ జయంతోత్సవాలు ఆల్‌ ఇండియా వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో 19.9.2009న జరిగాయి. ఐదు వేల సంవత్సరాల కింద సంపన్నుడిగా జన్మించిన అగ్రసేన్‌ మహారాజ్‌ పేదల అభ్యున్నతి కోసం ప్రతి పేదవాడికి సంపన్నులు రోజు ఓ రూపాయి, ఓ ఇటుక ఇస్తే వారు కొద్ది రోజుల్లోనే సొంత ఇంటిని కట్టుకోవడంతో ఆర్ధికంగా స్థిరపడతారని ఆయన ఈ పధకాన్ని అమలు చేసి విజయం సాధించారు. ఢిల్లీలో మహాజా అగ్రసేన్ స్మారక వైద్యశాల ఉంది.

మూలాలు[మార్చు]