అజయ్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజయ్ శర్మ

అజయ్ శర్మ (ఆంగ్లం:Ajay Sharma; జననం 1964, ఏప్రిల్ 3) ఢిల్లీకి చెందిన భారత క్రికెట్ క్రీడాకారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 67.46 సగటుతో 10,000 కు పైగా పరుగులు సాధించాడు.[1] కాని టెస్టులలో ఆడే అవకాశం ఒకేఒక్క సారి మాత్రమే లభించింది. వన్డేలలో 31 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 20.19 సగటుతో 424 పరుగులు సాధించాడు. వన్డేలలో ఇతని అత్యధిక స్కోరు 59 (నాటౌట్).

2000లో 36 సంవత్సరాల వయస్సులో ఇతని క్రీడాజీవితం అర్థాంతరంగా ఆగిపోయింది. మ్యాచ్‌ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కొని జీవితకాలపు బహిష్కరణకు గురైనాడు.[2]

మూలాలు[మార్చు]

  1. "Ajay Sharma (Cricket Archive)". Retrieved 2006-06-09.
  2. క్రిక్‌ఇన్ఫో ప్రొఫైల్ అజయ్ శర్మ

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అజయ్_శర్మ&oldid=4177158" నుండి వెలికితీశారు