అజాతశత్రువు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజాతశత్రువు
అజాతశత్రువు
దర్శకత్వంవిజయ నిర్మల
రచనగిరిజా శ్రీభార్గవన్
విజయ నిర్మల
సత్యానంగ్
నిర్మాతపి.పద్మనాభం
తారాగణంకృష్ణ, రాధ, జగ్గయ్య, అనూరాధ, అన్నపూర్ణ, గిరిబాబు, కోటా శ్రేనివసరావు
సంగీతంశంకర్ గణేష్ [1]
నిర్మాణ
సంస్థ
మక్కల్ తిలగం మూవీస్
విడుదల తేదీ
20 జూలై 1989[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

అజాత శత్రువు 1989 లో విడుదలైన తెలుగు సినిమా. మక్కల్ తిలకం మూవీస్ పతాకంపై పి.పద్మనాభం నిర్మిచగా విజయనిర్మల దర్శకత్వం వహించింది. కృష్ణ, రాధ ప్రధాన తారాగణంగా నిర్మితమైన ఈ చిత్రానికి శంకర్ గణేష్ సంగీతాన్నందించాడు.[2]

కథ[మార్చు]

"అజాత శత్రువు" అనే పేరుకి ఈ చిత్రానికి ఎక్కడా సంబంధం లేదు. అజాత శత్రువు అనగా శత్రువులు లేనివాడు అని అర్థం. కానీ ఇందులో కథానాయకుడు గోపీకృష్ణకి శత్రువులు చాలా మందే ఉన్నట్లు కనిపిస్తాడు. పోతే ఈ కథలో మనకి జమీందారు ఫాయిదాలు, ఎస్టేట్ వ్యవహారాలు వగైరాలు కూడా కనిపిస్తాయి. ఈ కథ ఎప్పటిదో అనిపిస్తుంది. కానీ చిత్రం ఆధునికంగా ఉంటుంది.

తన భార్య చెడిన ఆడదని భావించి రోజూ కొరడాతో చచ్చేట్టు కొట్టే ఓ జమిందారు తనకి పుట్టిన బిడ్డ తన కొడుకు కాదని భావించి దూరం చేసుకుంటాడు. ఆ కొడుకు పెద్దవాడై మేనేజరుగా ఆ ఎస్టేటుకి వచ్చి తల్లి నిర్దోషిత్వాన్ని నిరూపించి విలన్ల పని పడతాడు. ఇదే సూక్షంగా ఈ సినిమా కథ.

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ: గిరిజా భగవాన్
  • మాటలు: సత్యానంద్
  • పాటలు:వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: పి.సుశీల, రాజ్‌సీతారాం
  • స్టుడియోస్: సత్యా - ప్రసాద్
  • పోరాటాలు: జె.రాజ్, తమిళ్ మణీ, గిరి
  • దుస్తులు: కాస్ట్యూమ్స్ కృష్ణ
  • మేకప్ ఛీప్: సి.మాధవరావు
  • స్టిల్స్: శ్యామలరావు
  • కళ: బి.చలం
  • నృత్యాలు:శ్రీనివాస్
  • పోరాటాలు: సూపర్ సుబ్బరామన్
  • కూర్పు:ఆదుర్తి హరనాథ్
  • ఛాయాగ్రహణం:లక్ష్మణ్ గోరే
  • సంగీతం:శంకర్ - గణేష్
  • నిర్మాత: పి.పద్మనాభం
  • చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల

పాటలు[మార్చు]

  1. దొంగలా వెన్నలు దోచుకోవద్దురా కృష్ణయ్యా - పి. సుశీల, రాజ్ సీతారాం
  2. బందరు లడ్డమ్మో నా బంగరు జంపమ్మో - రాజ్ సీతారాం
  3. సరస సరాగం ప్రతి సాయంకాలం చిలిపి దుమారం - రాజ్ సీతారాం,పి. సుశీల
  4. స్వాతి వానలో ముత్యమందుకో లేలేత జల్లులో - రాజ్ సీతారాం,పి. సుశీల
  5. కన్నదెవరు బ్రాహ్మణి కన్నదెవరు విష్ణువుని - రాజ్ సీతారాం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Ajatha Satruvu 1989 film".
  2. "Ajatha Satruvu (1989)". Indiancine.ma. Retrieved 2020-08-05.

బాహ్య లంకెలు[మార్చు]