అజ్జరం
అజ్జరం, పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామము
విషయ సూచిక |
ఇత్తడి పరిశ్రమ. [మార్చు]
అజ్జరం అంటే ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ ఊరి ప్రధాన మరియు గుర్తింపు తెచ్చిన వృత్తి ఇత్తడి సామాను తయారీ. సాదారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలననుసరించి వృత్తులను చేయడం పరిపాటి. కాని ఈ ఊరిలో మాత్రం అన్ని వర్ణాలవారూ కలిసి (సుమారు 90%)ఒకే వృత్తి చేయడం జరుగుతూ ఉంది. అజ్జరం ఊరు రెండు పంచాయితీల పరిధిలో ఉంటుంది. అభివృద్ధి కొరకు కొంత భాగాన్ని వెంకట్రాయపురం గా విడగొట్టి కాకరపర్రు పంచాయితీ పరిధిలో కలిపారు. ఊరి మొదట్లో అడుగు పెట్టిన మరుక్షణం టంగ్ టంగ్ టక్కుంటక్కుం అని విని పిస్తూ ఒక వింతైన భావన కలిగిస్తుంది. ఏ ఇంటి ముంగిటి నుండి వెళుతున్నా కొత్తగా తయారయ్యే బిందెలో, బకెట్లో, తపేలాలో, లేదా పెద్దపెద్ద జాగీర్లలో కనిపించే చిత్ర విచిత్ర కళాఖండాలో ఫైవ్ స్టార్ హొటళ్లలో కనిపించే క్రోకరీనో కనుపించి కళ్ళకు కనువిందు చేస్తుంది.
ఇక్కడ అనేక ఇత్తడి పరిశ్రమలు కలవు. దేవత (శోభన్ బాబు, శ్రీదేవి నటించిన)సినిమాలో ఒక పాట కొరకు ఒక రోజు వెయ్యి బిందెలు సరఫరా చెయ్యగలిగిన పరిశ్రమలున్న ఊరు అజ్జరం.
వ్యవసాయం [మార్చు]
ఇత్తడి పరిశ్రమతరువాత రెండవ వృత్తి వ్యవసాయం. ఇక్కడ వరి కంటే కూడా చెరకు ఎక్కువగా పండిస్తారు. పసుపు విస్తారంగా పండిస్తారు. కూరగాయలు పండ్ల తోటలు కలవు. పూల వనాలు కూడా అధికంగా కలవు.
ఊరి విశేషాలు [మార్చు]
అజ్జరం అనేది వూరి పేరుగాను, ఇంటిపేరు గాను కూడా ఉంది. ఈ వంశీయుల మూల పురుషుడొకాయన గజపతులను తన వేద శాస్త్రాది విద్యలతో మెప్పించి ఈ ఆగ్రహారాన్ని బహుమతిగా పొందాడట. ఈ ఇంటి పేరు గలవారిలో 16వ శతాబ్దానికి చెందిన అజ్జరపు పేరయలిగం విద్వత్కవి. ఇతని ఒడయనంబి విలాసం అనే గ్రంధాన్ని రచించాడు. గజపతులు తెలుగు కవులను ఆదరించారనే విషయం ఈ గ్రంధం ద్వారా తెలుస్తుంది. ఇది మహాభక్తుడు, కవి అయిన తమిళ ఒడయనంబి (సుందరాచారి) కధ. ఆరు అశ్వాసాల గ్రంధం. ఈ గ్రంధాన్ని కవి ఆచంటలోని రామేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని రచన హృదయంగమంగా ఉంటుంది. ఈ పేరయ లింగం గురువు ఇవటూరి పెదరామనారాధ్యుడు. తల్లిదండ్రులు కొండమ్మ, పాపన్న.[1]
ఊరి ప్రముఖులు [మార్చు]
- బొప్పే కోటిలింగం. ఈయన ఆంధ్రప్రదేశ్ కర్ణభక్త సంఘ మాజీ ప్రెసిడెంట్ మరియు ప్రస్తుత శ్రీశైల కర్ణభక్త సత్రపు అధ్యక్షుడు. బి.యస్.పౌండ్రీస్ వ్యవస్థపకుడు. ఊరి నుండి నర్సాపురం, నిడదవోలు కాలువ వరకూ కల భూముల నుండి ఊరి వారి సహాయార్ధం అరకిలోమీటరు రోడ్డు వేయించి ఆ భూమిని విరాళంగా పంచాయితీ వారికి ఇవ్వదం జరిగింది, ఊరిలో కళ్యాణమండపం కట్టించి, దానిని కర్ణభక్తులకు ఉచితంగానూ మిగిలిన కులాల వారికి తక్కువ పైకం తోనూ ఇవ్వడం జరుగుతున్నది.
- ప్రముఖ న్యాయమూర్తి పెన్మత్స సత్యనారాయణ రాజు ఈ గ్రామంలో జన్మించారు.
పరిశ్రమలు [మార్చు]
- శ్రీ వీరభద్ర మెటల్ ఇండస్ట్రీ
- శ్రీ వెంకటేశ్వరా మెటల్ ఇండస్ట్రీ
- శ్రీ రాజేశ్వరీ ఇండస్ట్రీస్.
- బి.యస్.ఎం. పౌండ్రీస్.
మూలాలు [మార్చు]
- ↑ తెలుగు సాహిత్య కోశము. - తెలుగు అకాడమీ, హైదరాబాదు వారి ప్రచురణ http://www.archive.org/details/TeluguSahityaKosham
|
|
|
|---|---|
| అజ్జరం · ఖండవల్లి · కాకరపర్రు · కానూరు · కానూరు అగ్రహారం · కాపవరం · కొత్తపల్లి అగ్రహారం · మల్లేశ్వరం · ముక్కామల · ముత్యాలవారి పాలెము · నాడుపల్లె · పిట్టల వేమవరం · పెరవలి · తీపర్రు · ఉసులుమర్రు · అన్నవరప్పాడు |