అడ్రియన్ మేరీ లెజెండ్రీ

వికీపీడియా నుండి

అడ్రియన్ మేరీ లెజెండ్రీ (సెప్టెంబర్ 18, 1752జనవరి 10, 1833) ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త. సాంఖ్యక శాస్త్రము, సంఖ్యా శాస్త్రము మొదలైన విభాగాలలో విశేష కృషి చేశాడు. చంద్రుడిపై ఉన్న 'లెజెండ్రీ క్రేటర్' ఈయన జ్ఞాపకార్థం పేరుపెట్టబడింది.

జీవితం [మార్చు]

లెజెండ్రీ ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. ప్యారిస్ లో భౌతిక శాస్త్రాన్ని అభ్యసించాడు. తరువాత ఒక మిలిటరీ అకాడమీ లో బోధకుడిగా చేరాడు. ఇది కేవలం ఆయన ఆసక్తికోసమే తప్ప డబ్బు కోసం కాదు. ఆయన మొట్టమొదటి పని చేసింది బాలిస్టిక్స్ లో. కానీ తరువాత గణిత శాస్త్రంవైపు దృష్టి సారించాడు. 1782లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఫ్రెంచి విప్లవం సమయంలో లెజెండ్రీ తన ధనాన్నంతా పోగొట్టుకున్నాడు. ఆయన రాసిన Éléments de Géométrie అనే పుస్తకం బాగా పేరొందింది. చాలా భాషల్లోకి తర్జుమా చేయబడింది. కానీ ఆయన్ను తగిన జీవన ప్రమాణంలో జీవించేలా చేసింది మాత్రం బోధన సదుపాయం మరియు పెన్షన్ మాత్రమే. 1824 లో కార్యాలయ రాజకీయాల్లో చిన్న పొరపాటు జరిగి పెన్షన్ కూడా ఆగిపోయింది. దాంతో ఆయన అప్పటి నుంచీ పేదరికంలోనే బతికాడు.

శాస్త్రీయ పరిశోధనలు [మార్చు]

ఈయన చేసిన చాలా పరిశోధనలు ఇతర శాస్త్రవేత్తలు వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఆయన కనిపెట్టిన మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే పద్దతి ఇప్పుడు లీనియర్ రెగ్రెషన్, సిగ్నల్ ప్రాసెసింగ్, కర్వ్ ఫిటింగ్ మొదలైన వాటిలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది.