అతిథి
| అతిథి (2007) | |
| దర్శకత్వం | సురేందర్ రెడ్డి |
|---|---|
| నిర్మాణం | జి.రమేష్ బాబు |
| కథ | వక్కంతం వంశీ |
| తారాగణం | మహేశ్ బాభు, అమృతారావు, మురళీశర్మ, ఆశీష్ విద్యార్ధి, కోట శ్రీనివాసరావు, నాజర్ బ్రహ్మానందం మాళయికా అరోరా |
| సంగీతం | మణిశర్మ |
| ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
| కూర్పు | గౌతం రాజు |
| పంపిణీ | UTV మోషన్ పిక్చర్స్ |
| నిడివి | 157 నిముషాలు |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | 22 కోట్లు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
అతిథి 2007లో విడుదలైన ఒక తెలుగు సినిమా. మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపధ్యంలో ఈ సినిమా విడుదలయ్యింది. "థమ్సప్" శీతల పానీయాల ప్రకటనలకు ఈ సినిమాలోని హీరో పాత్రను వాడారు.
విషయ సూచిక |
కథ [మార్చు]
ఢిల్లీలో ఒక కుర్రవాడు బెలూన్లు అమ్ముకుంటుంటాడు. అతడు ఒక పాపకు బెలూన్ ఇచ్చిన తరువాత జరిగే ఘటనలవల్ల ఆ పాప కుటుంబం ఆ కుర్రవాడిని తమ ఇంటికి "అతిథి"గా ఆహ్వానిస్తారు. ఒకమారు కొందరు దుండగులు ఆ పాప తల్లిదండ్రులను చంపగా ఆ నేరం అతిథిపై పడుతుంది. అతను అరెస్టవుతాడు. ఆ పాప కూడా అతనిని అసహ్యించుకుంటుంది.
14 సంవత్సరాల తరువాత అతిథి (ఇప్పుడు మహేష్ బాబు) జైలునుండి విడుదలయ్యాక అమృత (అమృతారావు) అనే యువతికి పరిచయమౌతాడు. వారి మధ్య ప్రేమ పెరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులే ఇంతకు ముందుకు హత్య చేయబడ్డారని, అందువల్ల ఆ యువతి ఇప్పటికీ "అతిథి"ని ద్వేషిస్తున్నదనీ అతనికి తెలుస్తుంది. హైదరాబాదు చేరిన అమృతను చంపాలని ఆ పాత రౌడీ విలన్ కైజర్ ప్రయత్నిస్తున్నాడని హీరో తెలుసుకుంటాడు. అంతే కాకుండా నిజాయితీ పరునిగా పేరుపడ్డ ఒక పోలీసు ఆఫీసర్, గూండా లీడర్ కైజర్ ఒకరేనని కూడా హీరో తెలుసుకుంటాడు.
ఆ విలన్ హీరోయిన్‌ను ఎత్తుకుపోతాడు. అతనినుండి హీరోయన్‌ను రక్షించుకోవడం పతాక సన్నివేశం.
పాటలు [మార్చు]
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 6 పాటలున్నాయి. ఆడియో విడుదల సెప్టెంబరు 27, 2007న జరిగింది.
- ఖబడ్దారనీ - నవీన్, రాహుల్ నంబియార్
- గొన గొన గోనన్నగోనా - నవీన్, రీటా
- సత్యం ఏమిటో - దీపు, ఉషా
- ఖిలాడి కూనా - కార్తీక్, రీటా
- రాత్రైనా ఓకే, నాకు పగలైనా ఓకే - రంజిత్, అనుష్కా (ఈ పాట బాగా విజయవంతమయ్యింది)
- వాల్లా వాల్లా - రాహుల్ నంబియార్, ధర్మా
బయటి లింకులు [మార్చు]
- Athidi At Idlebrain
- ATHIDI movie review
- ATHIDI cinema movie review details
- Athidi shooting photo gallery
- Lyrics Of Athidi On MusicMazaa.com