ఆదిలాబాదు జిల్లా
| ?ఆదిలాబాదు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 16,128 కి.మీ² (6,227 చ.మై) |
| ముఖ్య పట్టణము | ఆదిలాబాదు |
| ప్రాంతం | తెలంగాణా |
| జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
27,37,738 (2011) • 170/కి.మీ² (440/చ.మై) • 1366964 • 1370774 • 61.55 (2001) • 71.22 • 51.99 |
ఆదిలాబాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. [1] [2]దీని ముఖ్యపట్టణం ఆదిలాబాదు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిల్చేవారు. రాష్ట్ర ఆదాయంలో 20% కలిగి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సంపన్న జిల్లాలలో ఇదిఒకటి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
అదిలాబాదు జిల్లాకు ఈ పేరు,ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన మొహమ్మద్ అదిల్ షాహ్ పేరు మీద వచ్చింది.[3] చారిత్రకంగా అదిలాబాదు జిల్లా పలు సంస్కృతులకు పుట్టిల్లు. దక్షిణభారతదేశ సరిహద్దులలో ఉపస్థితమై ఉన్న కారణంగా ఇది ఉత్తరభారతదేశ సామ్రాజ్యాధినేతలైన ముగలాయిలు, మౌర్యులు, దక్షిణ భారతదేశ సామ్రాజ్యాధినేతలైన శాతవాహనులు మరియు చాళుక్యులు పాలించారు. ప్రస్థుతం ఈ జిల్లా ప్రజలలో పొరుగున ఉన్న మరాఠీ సంప్రదాయం రాష్ట్ర తెలుగు సంప్రదాయంతో గుర్తించ తగినంతగా కలిసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ జిల్లాలో, పలు సంస్కృతులకి చెందిన వారైన బెంగాలి, మళయాళీ మరియు గుజరాతీలు,పరస్పర సహకార జీవనం సాగిస్తున్నారు.
[మార్చు] భౌగోళిక స్వరూపం
జిల్లాలో 75% భూభాగం ఉష్ణమండల తేమతోకూడిన అడవులతో నిండి ఉంది. ఇది ఆంద్రప్రదేశ్ లోని అటవీప్రాంతం కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. అదిలాబాదు జిల్లాలో కుంతల జలపాతాలు, సహ్యాద్రి కొండలు మరియూ సత్మాల కొండలు అనేక సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. 600 మిలియన్ టన్నుల మేలిరకం సున్నపురాయి నిల్వలు జిల్లాలో ఉన్నాయి. పింగాణి పాత్రలు, సానిటరీ పైపులు, ఇటుకలు, బెంగుళూరు పెంకుల తయారీకి పనికి వచ్చే బంకమన్ను విస్తారంగా లభిస్తుంది. ఈ జిల్లాలోని ప్రధాన నదులు ప్రాణహిత, పెన్‌గంగ మరియు వార్థా.
[మార్చు] ఆర్ధిక స్థితిగతులు
[మార్చు] వ్యవసాయం
ఆదిలాబాదు జిల్లాలో అధికంగా సాగుచేయబడే ఆహారపు పంట జొన్నలు, వడ్లు, మొక్కజొన్నలు, కందులు, మినుములు, సోయాబీన్, ఇతర పప్పులు, మిరపకాయలు, గోధుమలు, చెరకు. వాణిజ్యపంటలు పత్తి, పసుపు. నిర్మల్, లక్షింపేట్, ఖానాపూర్ సమీప మండలాలలో నీటిపారుదల వసతులు లభ్యం ఔతున్న కారణంగా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారు. 3.5% భూమిలో సాగుచేయబడే హార్టీకల్చర్ సాగుబడి వలన విదేశీమారకం వంటి ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. సాధారణ వర్షపాత ప్రాంతం అలాగే నీటిపారుదల వసతులు స్వల్పంగా కలిగిన ఎగువ భూములలో హార్టీకల్చర్ సాగుబడికి అనుకూలంగా ఉండి కూరగాయలు, పండ్లు, కూరగాయలు అలాగే సుగంద ద్రవ్యాలు, పూలు వంటి పంటలు కూడా పండుతున్నాయి.
పట్టుపురుగుల పెంపకం కూడా జిల్లాకు కొంత ఆదాయం సమకూరుస్తుంది. పట్టుపురుగుల పెంపకం కొరకు 1000 ఎకరాలలో మలబరీ చెట్లు పెంచబడుతున్నాయి. జిల్లాలో పట్టుపురుగుల పెంపకం కొరకు అనుకూల వాతావరణం ఉంది కనుక పట్టుపురుగుల పెంపకం అబివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ ప్రణాళిక కారణంగా జిల్లాలో పెంపుడు జంతువుల పెంపకం వలన ఆదాయం మరియు ఉపాధి లభిస్తుంది. జిల్లాలోఆవులు, బర్రెలు, గొర్రెలు, కోళ్ళు పెంచబడుతున్నాయి. జిల్లాలో భూపరిస్థితి పెంపుడు జంతువుల పెంపకానికి అనుకులంగా ఉంది. జిల్లాలో 87 పశువుల ఆసుపత్రులు ఉన్నాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉన్న పచ్చిక నిండిన కొండ ప్రాంతాలు గొర్రెలు, మేకలు పెంచడానికి అనుకూలంగా ఉంది.
[మార్చు] పరిశ్రమలు
ఆదిలాబాదు జిల్లాలో రైస్ మిల్లులు, ఆయిల్ రిఫైనరీలు, మైజ్ స్టార్చ, ఎనర్జీ ఫుడ్స్, మినిపప్పు మిల్లులు, సుగంధద్రవ్య పొడులు, బేకరీలు, ఐస్ క్రీం, గార్లిక్ పేస్ట్, సేమ్యా, మిరపకాయల కారం, నూడిల్స్, బిస్కట్టలు కుక్కీలు, టిష్యూ తయారీ, ఊరగాయలు, అప్పడాలు, వేరుశనగ బర్ఫీ, పశుగ్రాసం, వ్యవసాయం, వ్యవసాయ సంభంధిత వృత్తులు వంటి పరిశ్రమలు జిల్లాలో ఉపాధి మరియు ఆదాయం కల్పిస్తున్నాయి. ముడి తోలు, ఫినిష్డ్ లెదర్, లెదర్ బ్యాగులు, తోలు చెప్పులు, తోలు వస్తువులు తయారీ ఆదాయాన్ని ఉపాధిని కలిగిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, అల్లికలు, స్కూల్ యూనిఫాం, రెడీమేడ్ దుస్తులు, స్క్రీన్ ప్రింటింగ్ వస్త్ర పరిశ్రమ సంభంధిత ఆదాయం ఉపాధి కలిగిస్తున్నాయి. ఫ్లాస్టిక్ బ్యాగులు, ఎలెక్ట్రానిక్ పరికరములు, గాజులు పూసలు, టైర్లు తయారీ ఉపాధి కలిగిస్తున్నాయి. అల్యూమినియం, సిమెంటి ఇటుకలు, మట్టి ఇటుకల తయారీ ఉపాధి కలిగిస్తున్నాయి. బ్లాక్ & వైట్ ఫెనిలిజ్, వాషింగ్ పౌడర్ తయారీ చేస్తున్నారు. నోట్ బుక్స్, గ్రీటింగ్ కార్డులు, వివాహ పత్రికలు తయారు చేస్తున్నారు. మినరల్ వాటర్ తయారీ, చేటా ప్రొసెసింగ్, అల్యూమినియం పాత్రలు, ఫర్నీచర్, సైబర్ కేప్స్, ఆటోమొబైల్ రిపేరు పనులు వంటివి ఆదాయం ఉపాధి కలిగిస్తున్నాయి.
[మార్చు] పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు
ఆదిలాబాదు జిల్లాలోని ఐదు డివిజన్లుగా 52 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[4]. డివిజన్లు పేర్లు ఆదిలాబాదు, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల్.
|
1.తలమడుగు 2.తాంసీ 4.జైనథ్ 5.బేల 9.ఇచ్చోడ 11.బోథ్ 12.నేరెడిగొండ 13.సారంగాపూర్ |
14.కుంటాల 15.కుభీర్ 16.భైంసా 17.తానూర్ 18.ముధోల్ 19.లోకేశ్వరం 20.దిలావర్ పూర్ 21.నిర్మల్ 23.మామడ 24.ఖానాపూర్ 25.కడెం 26.ఉట్నూరు |
27.జైనూర్ 28.కెరమెరి 30.జన్నారం 31.దండేపల్లి 32.లక్సెట్టిపేట 33.మంచిర్యాల 34.మందమర్రి 35.కాశీపేట్ 36.తిర్యాని 37.ఆసిఫాబాద్ 38.వాంకిడి 39.కాగజ్‌నగర్ |
40.రెబ్బెన 41.తాండూరు 42.బెల్లంపల్లి 43.నెన్నెల్ 44.భీమిని 46.కౌతల 47.బెజ్జూర్ 48.దహేగావ్ 49.వేమన్‌పల్లి 50.కోటపల్లి 51.చెన్నూర్ 52.జైపూర్ |
- ఆదిలాబాదు లోక్‌సభ స్థానం : ప్రస్తుత ప్రతినిధి: రమేష్ రాథొద్
- శాసనసభ స్థానాలు (10):
| స్థానం | ప్రతినిధి |
|---|---|
| సిర్పూర్ | కె. సమ్మయ్య, తెరాస |
| చెన్నూర్ | నల్లాల ఓదెయ్య, తెరాస |
| బెల్లంపల్లి | జి. మల్లేష్, సీపీఐ |
| మంచిర్యాల | అరవింద రెడ్డి , తెరాస |
| ఆసిఫాబాద్ | అత్రం సక్కు, కాంగ్రెస్ |
| ఖానాపూర్ | సుమన్ రాథోడ్ , తెదేపా |
| ఆదిలాబాదు | జోగు రామన్న - తెరాస, |
| బోధ్ | జి. నగేష్, తెదేపా |
| నిర్మల్ | మహేశ్వర రెడ్డి , కాంగ్రెస్ |
| ముధోల్ | వేణు గోపాల చారి , తెదేపా |
[మార్చు] స్థానిక స్వపరిపాలన
జిల్లాలో 1743 గ్రామాలు 866 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో మరియు పట్టణ ప్రాంతాలకొరకు ఏడు పురపాలక సంఘాలున్నాయి. పురపాలక సంఘాల పేర్లు: ఆదిలాబాదు, మంచిర్యాల్,,బెల్లంపల్లి,మందమర్రి.నిర్మల్,భైంసా, కాగజ్‌నగర్
[మార్చు] రవాణా వ్యవస్థ
2003లో విభాలుగా విభజించిన రైల్వేశాఖలో దక్షిణమద్య రైల్వే లోని హైదరాబాదు విభాగానికి చెందిన ముద్ఖేదు స్టేషన్ అదిలాబాదులో ఉంది. హైదరాబాదు రైల్వేశాఖను రెండు భాగాలుగా విభజించిన తరువాత అదిలాబాదు నాందేడ్ విభాగంలో చేరుతుంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి.క్రిష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదు కు ఒక ప్రధాన రైలు.
దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది. ఇక్కడ వాయుమార్గం 1948లో జరిగిన పోలీస్ ఏక్షన్ భారతీయ వాయు సేనలచేత నాశనం చేయబడింది. అతిసమీపంలో ఉన్న విమానశ్రయం నాగపూరులో ఉన్నా హైదరాబాదు విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.
[మార్చు] జనాభా లెక్కలు
2011 జనాభాగణాంకాలను అనుసరించి అదిలాబాదు జిల్లా జనసంఖ్య 1,39,103. వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగును,ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు ఉర్ధూ మరియు మరాఠీ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది.
[మార్చు] సంస్కృతి
ఆదిలాబాదు జిల్లాలో అడవులు అధికంగా ఉన్నాయి కనుక ఇక్కడ గిరిజన సంస్కృతి నేటికీ వర్ధిల్లుతూనే ఉంది. ఒకప్పటి సంస్కృతిని చాటి చెప్పే కోటలు, కట్టడాలు, గుళ్ళూ, చెక్కిన రాళ్ళు, ఇకా సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. నిర్మల్ బొమ్మలు ప్రసిద్ధి గాంచినవి,
[మార్చు] పశు పక్ష్యాదులు
ఆదిలాబాదు జిల్లా అరణ్యాలను రెండు విభాగాలుగా ఉంటుంది. ఎగువ బాగంలో తాలుక్, నల్లమద్ది, బిజసల్, చైర్మను, విప్ప, జిత్రేగి, ముష్టి వంటి వృక్షసంపద ఉంది. దిగువ భాగంలో ఉసిరి, మారేడు, మౌదుగు, వెదురు, సారపాపు వంటి వృక్షసంపద ఉంది. ఆదిలాబాదు జిల్లా దట్టమైన అరణ్యప్రాంతంలో పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, హైనాలు, తోడేళ్ళు మరియు అడవి కుక్కలు వంటి జంతువులు నివసిస్తున్నాయి. అలాగే అరణ్య మైదానాలలో అలాగే పక్షి జాతులలో నెమలి, పావురాళ్ళు, అడవి కోళ్ళు, రామ చిలుకలు, మైనాలు ఉన్నాయి. నీలి ఆవులు, చుక్కల జింకలు మరియు సంబార్ వంటి సాదు జంతువులు నివసిస్తున్నాయి.
[మార్చు] విద్యా సంస్థలు
- ఎ ఎమ్ ఆర్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
- బాసర ఐ ఐ ఐ టి అంతర్జాతీయ కళాశాల.
- అయిజ్జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎండ్ టెక్నాలజీ.
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్.
- విద్యార్ధి కాలేజెస్.
- నలందా కాలేజెస్.
- వివేకానంద డిగ్రీ కాలేజ్, ఎచోడా
- గవర్నమెంట్ జూనియర్ కాలేజ్.
[మార్చు] ఆకర్షణలు
జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం నిర్మల్ పట్టణానికి 70 కి.మీ దూరంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని ఏకైక సరస్వతీ ఆలయం ఇక్కడే ఉంది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరు లో ఉండగా, రెండవది ఇదే. ఇక, నిర్మల్ పట్టణం చిత్రకళకు ప్రసిద్ధి గాంచింది. కుంటాల జలపాతం చాలా ఆకర్షణీయమైంది. పులి, మొసళ్ళు, దుప్పి వంటి అడవి జంతువుల సంరక్షణకోసం "ప్రాణహిత సంరక్షణ కేంద్రం" ఏర్పాటు చేయడం జరిగింది.
- దర్శనీయ ప్రదేశాలు: బాసర, పోచంపాడు, నిర్మల్, కుంతల జలపాతం, కడెం ప్రాజెక్టు, బెల్లంపల్లి,మందమర్రి, సిర్పూర్, బుగ్గ రాజేశ్వరాలయం, కొకసమన్నూరు హనుమాన్ ఆలయం. ఎచోడా, నారాయణస్వామి ఆలయం, జైనాధ్
[మార్చు] క్రీడలు
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
ఉ ద్యమకారుడు కొమరం భీం,
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ ఆదిలాబాదు అధికారిక వెబ్‌సైటు
- ↑ ఆదిలాబాదు జిల్లా గణాంకాలు (ఎపిఆన్లైన్ లో)
- ↑ ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు. జూన్ 30, 2007న సేకరించారు.
|
||||||||||||||
|
|||||||||||||||||
