అద్దంకి

వికీపీడియా నుండి

  ?అద్దంకి మండలం
ప్రకాశం • ఆంధ్ర ప్రదేశ్
ప్రకాశం జిల్లా పటములో అద్దంకి మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో అద్దంకి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°49′N 79°59′E / 15.809762, 79.975491
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము అద్దంకి
జిల్లా(లు) ప్రకాశం
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
74,904 (2001)
• 37882
• 37022
• 59.51
• 70.41
• 48.40

అక్షాంశరేఖాంశాలు: 15°49′N 79°59′E / 15.809762, 79.975491

అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము.

[మార్చు] చరిత్ర

అద్దంకి, రెడ్డి రాజుల తొలి రాజధాని. తరువాత వారు తమ రాజధాని కొండవీటికిమార్చారు. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది. అందుకే అద్దంకి తెలుగు పద్యమునకు జన్మభూమిగా ప్రసిద్ధికెక్కినది. ఎర్రాప్రెగడ, తన దివ్య ఘంటముతో మహాభారత కావ్యాన్ని అద్దంకిలో పూర్తి చేసినారు. అద్దంకి, ఆంధ్రమహాభారతాన్ని అసంపూర్ణముగా మిగిలిపోకుండా కాపాడిన నేలగా ప్రాముఖ్యత పొందినది. ఈ పుణ్య భూమిపై మొదలుపెట్టిన ఏ మంచి కార్యమైనా విజయవంతమౌతుందని ఇక్కడి ప్రజల నమ్మకము.

అద్దంకి ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం. దీనిని మొదట రెడ్డి రాజులు తమ రాజధానిగా చేసుకొన్నారు. తర్వాత వీరు తమ రాజధానిని అద్దంకి నుండి కొండవీటికి మార్చుకొన్నారు. వీరి కాలంలో 'ఎర్రన'అనే మహా కవి ఉండేవాడు.ఈయన మహా భారతంలో ఒక పర్వాన్నీ పూర్తి చేసినప్పటికి తను పూర్తి చేసానని చెప్పలేదు.తర్వాత తరం వారు ఆయన భాషా శైలిని అర్దం చేసుకొని ఇది ఖచ్చితంగా ఎర్రన పూర్తి చేసి ఉంటాడని భావించారు.అదే నిజం అయినది.


ఈ ఊరిలో ఒక శాశనం లభ్యం అయినది. ఆ శాశనంలో ఈ విధంగా వ్రాసి ఉంది. "అద్దంకిలో 101 గుళ్ళు కాని, 101 బావులు కాని లేవు అని చెప్పేవారు తరువాయి జన్మలో గాడిదగా పుట్టు గాక" అని వ్రాసి ఉంది. అందుకే అద్దంకిని పద్య శాసనానికి పుట్టినిల్లు అంటారు.టంగుటూరి ప్రకాశం పంతులు బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు అద్దంకి లో అద్ద మరియు అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం ప్రాణలను సమర్పించుకొన్నారు.అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.ఈ ప్రాంతానికి 5 కిలో మీటర్ల దూరంలో శింగరకొండ అనే మహా పుణ్య శేత్రం ఉన్నది. ప్రస్తుతం అద్దంకి మారినప్పటికీ అద్దంకి యొక్క గొప్పతనం చిరస్మనీయం. అద్దంకి లో "గుండ్లకమ్మ" అనే నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రక్కన ఇటుకలను తయారు చేస్తారు.

ప్రస్తుతం ఈ ఊరి ఎమ్.ఎల్.ఎ. బలరాం నిషేదానికి గురయ్యారు.ఇక్కడ రకరకాల పంటలు పండిస్తారు.పొగాకు ఇక్కడ బాగా పండుతుంది.

[మార్చు] మండలంలోని గ్రామాలు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు