వికారాబాద్

వికీపీడియా నుండి

(అనంతగిరి (వికారాబాదు) నుండి దారిమార్పు చెందింది)
  ?వికారాబాద్ మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో వికారాబాద్ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము వికారాబాద్
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 25
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
73,200 (2001)
• 36820
• 36380
• 63.60
• 74.59
• 52.47


వికారాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఈ పట్టణానికి రంగారెడ్డి జిల్లాకు ప్రధానకేంద్రంగా చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ అమలు జర్గడం లేదు. హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు రోడ్డు మరియు రలుమార్గములో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో, తాండూర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి కర్ణాటకలోని వాడి మార్గములో ఉన్న ఈ పట్టణం నుంచి ఉత్తరంగా మహారాష్ట్రలోని పర్భనికి రైలుమార్గం కలదు.

విషయ సూచిక

[మార్చు] రవాణా సౌకర్యాలు

పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే జంక్షన్ ఇది. బస్సూ సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డీపో కూడా పట్టణంలో ఉంది.

[మార్చు] పురపాలక సంఘం

పట్టణంలో పురపాలక సంఘాన్ని 1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పల్లి, అంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు.

[మార్చు] పట్టణంలోని కాలనీలు

  • రామయ్యగూడ: ఇది వికారాబాద్ పట్టణంలోని ఒక కాలని. ఇక్కడి ప్రజలంతా చిల్లర వ్యాపారాలు చేసుకంటూ జీవితాలు వెళ్ళదీసుకుంటారు.

[మార్చు] పర్యాటక ప్రదేశాలు

వికారాబాదు సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:

  • మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కిలోమీటర్ల దూరం)
మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు (6 కిలోమీటర్లు)

హైదరాబాదుకు 72 కిలోమీటర్ల దూరంలో వికారాబాదుకు 4 కిలోమీటర్ల దూరంలో తాండూర్ వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే అనంతగిరి కొండలు. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మూసీ నది పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.

  • అనంత పద్మనాభస్వామి దేవాలయం (6 కిలోమీటర్లు)
  • చిలుకూరు బాలాజీ దేవాలయం (23 కిలోమీటర్లు)
  • ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ (18 కిలోమీటర్లు)

[మార్చు] మండలంలోని పట్టణాలు

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] ఇవి కూడా చూడండి


పేజీకి సంభందించిన లింకులు