అనుష్క శర్మ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అనుష్క శర్మ
Anushka sharma womens health magazine.jpg
మహళల ఆరోగ్య పత్రిక ఉమెన్స్ మాగజీన్ ప్రారంభోత్సవంలో అనుష్కా శర్మ
జననం అనుష్క శర్మ
(1988-05-01) 1 మే 1988 (వయస్సు: 26  సంవత్సరాలు)[1]
జాతీయత Indian
వృత్తి నటి, రూపదర్శి
క్రియాశీలక సంవత్సరాలు 2008–ఇప్పటి వరకు

అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాలలో నటించింది.

నేపధ్యము[మార్చు]

ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత మళ్లీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారాత్ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో ఆమె కాంట్రాక్టు పూర్తయింది. 2012లో మళ్లీ షారుక్ ఖాన్ తో సెకండ్ హీరోయిన్ గా 'జబ్ తక్ హై జాన్' చిత్రంలో ఆమె ప్రదర్శించిన నటనకు బాలీవుడ్ దాసోహమంది. ఈ మధ్యలో కూడా లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్, మట్రూ కీ బిజిలీకా మండోలా లాంటి సినిమాలతో తన ప్రతిభ నిరూపించుకుంది.

కుటుంబం[మార్చు]

తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో అధికారి. తల్లి ఆశిమా శర్మ గృహిణి.[2]. పెద్దన్నయ్య కర్ణేష్ మర్చంట్ నేవీ లో పనిచేస్తున్నాడు.[3]. సైనిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి బెంగుళూరు లోని మౌంట్ కార్మల్ కళాశాల నుండి ఉన్నత విద్య పూర్తి చేసింది.[4]. తర్వాత నటనావకాశాల కోసం ముంబై కి మకాం మార్చింది.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2008 రబ్ నే బనాదీ జోడీ తాని సాహి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన
2010 బద్మాష్ కంపెనీ బుల్ బుల్ సింగ్
2010 బ్యాండ్ బాజా బారాత్ శ్రుతి కక్కర్ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కార ప్రతిపాదన
2011 పటియాలా హౌస్ సిమ్రన్
2011 లేడీస్ వర్సెస్ రిక్కి భెల్ ఇషికా దేశాయ్
2012 జబ్ తక్ హై జాన్ అకిరా రాయ్ ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారము
2013 మాతృ కి బిజిలీ కా మండోలా బిజిలీ మండోలా
2014 పీకే జగత్ జనని
2014 బాంబే వెల్వెట్ నిర్మాణం లో ఉన్నది (Filming begins in April 2013)[5]

మూలాలు[మార్చు]

  1. "Wish Anushka Sharma a very Happy Birthday". Times of India. 29 April 2010. Archived from the original on 2010-05-14. సంగ్రహించిన తేదీ 2011-02-20. 
  2. "Walk The Talk with Anushka Sharma-ndtv". 
  3. "Hardly ban-nered, Entertainment – Bollywood". Mumbai Mirror. 2009-03-24. సంగ్రహించిన తేదీ 2010-06-24. 
  4. "The Daily Mail – Daily News from Pakistan – Newspaper from Pakistan". Dailymailnews.com. సంగ్రహించిన తేదీ 2010-06-24.  [dead link]
  5. http://filmfare.com/news/ranbiranushka-finalised-for-bombay-velvet-233.html

బయటిలంకెలు[మార్చు]