అబ్బరాజు మైథిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అబ్బరాజు మైథిలి

'డాక్టర్ అబ్బరాజు మైథిలి' ( 27-7-1966 )అంతర్జాలంలో ప్రసిద్ధి చెందినరచయిత్రి. ఆమె ప్రస్తుతం బెంగళూరు స్పర్శ్ హాస్పటల్స్ లో ప్రసూతి, స్త్రీ వైద్య విభాగంలో పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మైధిలి వినుకొండ నిర్మల బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. నెల్లూరు వి.అర్ కళాశాలలో ఇంటర్, గుంటూరు వైద్య కళాశాల లో ఎంబిబిఎస్ చదివారు. ఎన్.టి.ఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1988 జనవరి 24తేదీన ఎముకల వైద్యనిపుణులు డాక్టర్ చీమలమర్రి శ్రీనివాస్ ను వివాహం చేసుకున్నారు. ఇరవై ఏళ్ళకు పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం లో అమృత హాస్పిటల్స్ ను విజయవంతం గా నిర్వహించి 2014 లో విరమించుకొని బెంగుళూరు లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, అబ్బాయి. వాళ్ళ అమ్మాయి చీమలమర్రి సాంత్వన తెలుగులోను, ఇంగ్లీష్ లోనూ ఎన్నో వ్యాసాలు రాశారు.స్వాప్నిక్ చీమలమర్రి పుస్తకం. నెట్ లో సాహిత్య వ్యాసాలు రాశారు.

సాహిత్యరంగం[మార్చు]

రచన రంగం[మార్చు]

ఆంధ్ర మహాభారత నిఘంటువు ను రచించిన అబ్బరాజు సూర్యనారాయణ ఈమె తాతగారు. 19 వ శతాబ్దంలో నెల్లూరు నుంచి అముద్రిత గ్రంథ చింతామణి అనే పత్రిక ను నడిపిన ప్రసిద్ధ సాహిత్య వేత్త పూండ్లరామకృష్ణయ్య ఈమె ముత్తాత.

మొదట్లో చలం ,  కొడవటిగంటి కుటుంబరావు రచనలను బాగా చదివేవారు. తరువాతి కాలంలో విశ్వనాధ సత్యనారాయణ రచనలు చదివి ఆయన అభిమానులయ్యారు. ఆంగ్ల సాహిత్యం లో కూడా అభినివేశం ఉంది.  సాహిత్యంతో పాటు సంగీతం, చిత్రలేఖన పట్ల అభిరుచి, అవగాహన ఉన్నాయి.

2016 లో ' నిమగ్న ' సారస్వత వ్యాసాల సంపుటాన్ని ప్రచురించారు. వ్యాసాలు, అనువాదాలు, కథలు అన్నిటిలోనూ కృషి చేస్తున్నారు. H.Rider Haggard నవల ' She' ని ,L.M.Montgomery నవల ' Anne Of Green Gables ' ను పూర్తిగా తెలుగు లోకి అనువదించారు. చాలా fairy tales ను పిల్లల కోసం అనుసృజన చేశారు. సంస్కృత సాహిత్యం లో కృషి చేస్తున్నారు. 2022 లో ' తన్మాత్ర' పేరుతో కథాసంకలనం వచ్చింది.

పురస్కారాలు[మార్చు]

2017 లో తెలుగు తల్లి కెనడా పురస్కారం ' స్వాధీన ' కథకు వచ్చింది.

మూలాలు[మార్చు]