అమర్నాథ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Amarnath Temple
[[file:మూస:Location map India Jammu and Kashmir|240px|Amarnath Temple is located in మూస:Location map India Jammu and Kashmir]]<div style="position: absolute; top: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; left: సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను%; height: 0; width: 0; margin: 0; padding: 0;">
<div style="font-size: 90%; line-height: 110%; position: relative; top: -1.5em; width: 6em; సమాసంలో(Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను">Amarnath Temple
Location in Jammu and Kashmir
భౌగోళికాంశాలు: 34°12′54″N 75°30′03″E / 34.2149°N 75.5008°E / 34.2149; 75.5008Coordinates: 34°12′54″N 75°30′03″E / 34.2149°N 75.5008°E / 34.2149; 75.5008
Name
నామము: Cave Temple of Lord Amarnath
స్థానము
దేశము: India
రాష్ట్రము: Jammu and Kashmir
ప్రదేశము: Amarnath
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం: Amarnath (Shiva)
History
నిర్మాత: Natural formation

భారత దేశం లోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో అమర్నాథ్ పర్వతంపై ఉన్న అమర్నాథ్ గుహలు హిందూమతం యొక్క చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దేవుడు శివుడు కు అంకితమైన ఈ పుణ్యక్షేత్రం 5,000 సంవత్సరాలకు పై పాత ఆలయం. ఈ ఆలయం హిందూ పురాణాలలో ఒక ముఖ్య భూమిక వహిస్తుంది. [1]

ప్రధాన అమర్నాథ్ గుహ లోపల శివలింగం మాదిరిగా కనిపించే ఒక మంచు స్టలాగ్‌మైట్ ఉంటుంది. ఇది మే నుంచి ఆగష్టు వరకు వృద్ధి చెంది, ఆ తరువాత కరుగుతుంది.[2] చంద్రుడి యొక్క దశలతో పాటు పెరుగుతూ, తగ్గుతూ, వేసవి పండుగ సమయములో మంచి ఎత్తుకు చేరుకుంటుంది. [3] హిందూ పురాణాల ప్రకారం, ఈ గుహలోనే శివుడు తన దైవిక సహాధర్మచారిణి అయిన పార్వతికి జీవిత యొక్క రహస్యము మరియు సనాతనం గురించి వివరించారు.[4] ఇంకో రెండు మంచు ఆకారాలు పార్వతి మరియు శివుడు కుమారుడు అయిన గణేశవని సూచిస్తాయి.

ఈ గుహ, జమ్మూ మరియు కాశ్మీరు రాజధాని అయిన శ్రీనగర్ కు సుమారు 141 km (88 mi) దూరములో, 3,888 m (12,756 ft),[2] ఎత్తులో ఉంది. భద్రతా కారణాల వలన, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, భారత సైన్యం మరియు భారత పారామిలిటరీ దళాలు ఈ ప్రాంతములో తమ బలగాలను మొహరించాయి.[5]

చరిత్ర[మార్చు]

అర్యరాజ (34 బిసిఈ -17 సిఈ) "తన అత్యంత ఆనందకరమైన కాశ్మీర్ వేసవి"ని, "అడవుల పైన ఉన్న ప్రదేశాలలో" మంచు లింగాన్ని పూజ చేసుకుంటూ గడిపేవాడు. ఇది కూడా అమర్నాథ్ లోని మంచు లింగాన్నే సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. రాజతరంగిణి (పుస్తకం VII v.183) లో అమరేశ్వర లేదా అమర్నాథ్ ను సూచిస్తూ మరొక సూచన ఉంది. కల్హన ప్రకారం, రాజు అనంత (1028–1063) బార్య అయిన రాణి సూర్యమతి , "అమరేశ్వలో అగ్రహారాలను దానముగా తన భర్త పేరు మీద ఇచ్చి, త్రిశూలాలు, బాణలింగాలు మరియు ఇతర [పుణ్య చిహ్నాలు] వాస్తవాలను అక్కడ ఏర్పాటు చేశారు."

లిడ్డెర్ (vv.1232-1234) నది యొక్క ఎడమ తీరములో ఒక కాలువను నిర్మిస్తున్న సందర్భంగా సుల్తాన్ జైనుల్-అబిడిన్ (1420–1470) అమర్నాథ్ లోని పుణ్యతీర్థాన్ని సందర్శించాడని కల్హన యొక్క రాజతరంగిణికి తదుపరి రచనగా వ్రాయబడిన తన కాశ్మీర్ క్రానికల్ లో జోనరాజా వ్రాశాడు.[citation needed] ప్రస్తుతం ఈ కాలువ షా కోల్ వి.అమర్నాథ్ గా పిలవబడుతుంది.

ప్ర్జజయభట్టచే ప్రారంభించబడి శుకచే ముగించబడిన రాజవలిపాటక అని పిలవబడే నాల్గవ క్రానికిల్ లో ఈ పుణ్య స్థలానికి తీర్థయాత్ర వెళ్ళిన సంఘటన గురించి స్పష్టమైన వివరాలు ఉన్నాయి (వి.841, డబల్యూ . 847-849). దాని ప్రకారం, అప్పట్లో కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న యూసుఫ్ ఖాన్ ను కాశ్మీర్ గురించి అక్బర్ అడిగినప్పుడు, అతను ఇతర విషయాలతో పాటు అమర్నాథ్ యాత్రను సవివరంగా వివరించాడు. దేవుడు శివుడు యొక్క గొప్ప భక్తుడైన సంట్‌బెట్రా స్వామి రామానంద్ జి మహారాజ్ చడ్డితో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేవాడట.అతను షేర్ కి స్వారిని చేస్తూ ఉండేవాడని చెప్పబడుతుంది.పిఓకే లో ఉన్న బెహట్రానే అతని స్వస్థలం. సంట్ బెట్రా అశోక.

తీర్థయాత్ర[మార్చు]

పవిత్రమైన గుహలో మంచు శివ లింగం

హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా క్షేత్రం- జూలై-ఆగష్టులో శ్రావణి మేళ పండగ సమయములో 45-రోజులలో సుమారు 400,000 మంది[6][not in citation given] సందర్శిస్తారు. ఇది హిందువుల పుణ్యమాసమైన శ్రావణ మాసములో ఉంటుంది.

శ్రీనగర్ నుంచి 96 km (60 mi) దూరములో ఉన్న పహల్గం పట్టణము నుండి భక్తులు నడుచుకుంటూ నాలుగు లేక ఐదు రోజులు ప్రయాణం చేసి ఈ 42 km (26 mi) తీర్ధయాత్రను చేపడతారు. ఈ ఆలయానికి మరో రెండు మార్గాలు ఉన్నాయి; శ్రీనగర్ నుంచి ఎక్కువ సాంప్రదాయ మరియు ఎక్కువ దూరమైన దారి, మరియు బల్తాల్ పట్టణము నుంచి తక్కువ దూరమైన దారి ఉన్నాయి. కొందరు భక్తులు, ముఖ్యంగా వృద్దులు, గుర్రంపై కూర్చుని కూడా ఈ ప్రయాణాన్ని చేపడతారు. ఇప్పుడు, కావాలనుకునేవారు, డబ్బు ఉన్నవారు ఈ ప్రయాణాన్ని హెలికాప్టర్ ద్వారా చేయవచ్చు.[7]

1990 లలో సమస్యలు[మార్చు]

ఉగ్రవాదుల నుండి బెదిరింపులు రావడంతో, 1991 నుండి 1995 వరకు తీరయాత్ర నిషేధించబడింది. ఉగ్రవాదులు, తాము జోక్యం చేసుకోమని హామీనివ్వడంతో, 1996లో యాత్ర మళ్ళా గతానికంటే ఎక్కువ సంఖ్యలో కొనసాగింది. అయితే, ఆ సంవత్సరం ఆగష్టు చివరలో అకాలపు మంచు తుఫాన్లు రావడంతో, లక్షలాది యాత్రికులు ఇరుక్కున్నారు. అప్పుడు జరిగిన విషాదంలో, 242 యాత్రికలు బడలికతోను మరియు మంచును తట్టుకోలేక మరణించారు.[8][9]

2000 నాటి మారణకాండ[మార్చు]

నాలుగు సంవత్సరాల తరువాత, యాత్రికులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. కాశ్మీర్ వేర్పాటు ఉగ్రవాదులు 30 మందిని పహల్గం లో హతమార్చి, మారణకాండ సృష్టించారు.[10] వీరిలో చాలా మంది, అమర్నాథ్ [11]కు వెళ్తున్నవారు లేదా యాత్రికులను తీసులువెళ్ళే పోర్టర్లు మరియు గుర్రం నడిపేవారు ఉన్నారు.[12] ఈ మారణకాండకు లష్కర్-ఇ-తైబానే కారణమని భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయి నిందించారు[13]

2006 నాటి కృత్రిమ శివలింగ వివాదము[మార్చు]

[ 2006లో అమర్నాథ్ లో కృత్రిమ శివలింగం గురించి ఒక పెను వివాదం నెలకొంది. 2006లో, యాత్ర ప్రారంభ సమయములో సహజ శివలింగం చాలా చిన్నదిగా ఉంది. అయితే, యాత్రను కొనసాగించడానికి అమర్నాథ్ ఆలయ మండలి వారు, గుహను చల్లగా ఉంచాలనే నెపంతో, చాలా పొడి మంచును నేరుగా అసలు శివలింగం పైనే పోశారు. దీని మూలాన పెను వివాదం చెలరేగింది కాని యాత్రకు ఎటువంటి భంగం కలుగలేదు. మంచు లింగం పైన మరియు క్రింద రెండు నీటి కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువలనుంచి వచ్చే నీళ్ళే శివలింగ ఆకార సృష్టికి దారి తీస్తున్నాయి. 2005లో జరిగిన భూకంపంలో ఇవి దెబ్బ తిన్నాయి కనుకనే మంచు లింగం సరిగ్గా ఏర్పడలేదని నమ్మబడింది. ఆ కాలువలు మళ్ళీ బాగవడంతో ఆ తరువాత సంవత్సరాలలో మంచు లింగం మంచి ఆకారంతో ఏర్పడి ఉంటుంది.

2008 నాటి భూమి బదలీ వివాదము[మార్చు]

2008 మే 26న, భారత దేశం మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి హిందూ యాత్రికులకు తాత్కాలిక నివాసాలు, సదుపాయాలు కల్పించడం కొరకు అటవీ భూములను శ్రీ అమర్నాథ్జి ఆలయ మండలి (ఎస్ఏఎస్‌బి)[14]కి బదిలీ చేయడానికి100 acres (0.40 km2) ఒక అంగీకారానికి వచ్చాయి. కాశ్మీర్ వేర్పాటువాదులు ఈ చర్యను వ్యతిరేకించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చి, ఏ భారతదేశ పౌరుడైనా కూడా కాశ్మీర్ లో స్థిరపడడాన్ని నివారించే ఆర్టికిల్ 370కు ఈ చర్య వ్యతిరేకమని వారు వాదించారు. భారత ప్రభుత్వం యొక్క ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్ ప్రజలు విస్తృతంగా ఆందోళన చేపట్టారు.[15] ఈ ఆందోళన వలన, జే&కే ప్రభుత్వం భూమిని బదిలీ చేసే నిర్ణయాన్ని ఉపసంహరించింది. ఈ ఉపసంహరించాడాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ ప్రదేశములో ఉన్న హిందువులు ఒక ఎదురు ఆందోళనకు దిగారు.[16]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • అమర్నాథ్ భూమి బదలీ వివాదము
 • 1996 అమరనాథ్ యాత్ర విషాదం
 • 2000 అమర్నాథ్ తీర్ధయాత్రా మారణకాండ

సూచనలు[మార్చు]

 1. "New shrine on Amarnath route". The Hindu. 2005-05-30. 
 2. 2.0 2.1 "Amarnathji Yatra - a journey into faith". Official Web Site of Jammu and Kashmir Tourism. 
 3. ఆర్ట్నేర్, జోన్. మళ్ళా రోడ్డు మీదకి. పిడిఎన్ గ్యాలరీ .
 4. "Amarnath Cave - The legend". Bhole Bhandari Charitable Trust. 
 5. "The pilgrimage to Amarnath". BBC News. 2002-08-06. Retrieved 2010-04-23. 
 6. Puri, Luv (2005-04-17). "Amarnath Yatra: court vests authority with shrine board". The Hindu. 
 7. [1]ప్రసిద్ద సెలవు ప్రదేశాలనుండి అమర్నాథ్ కు రోడు మార్గాలలో ఎలా చేరుకోవాలి?/1}
 8. Rediff On The NeT: హర్కతుల్ ముజహీదిన్ అమర్నాథ్ యాత్రను 'నిషేదించింది'
 9. http://rajyasabha.gov.in/journals/178/26081996.htm
 10. అమర్నాథ్ తీర్ధయాత్ర పునః ప్రారంభం, బీబీసీ, 2000-08-04
 11. ఆ రాత్రి మారణకాండ వలన లోయలో 105 మంది మరణించారు, థ ట్రిబ్యూన్, 2000-08-03
 12. ముస్లిము తీవ్రవాదులు 21 మంది హిందూ తీర్ధయాత్రికులను కాశ్మీరులో హత్య చేశారు, థ ఇండిపెండెంట్, 2000-08-02
 13. జమ్మూ మరియు కాశ్మీరులో ఇటీవల జరిగిన మారణకాండ గురించి శాసనసభలో ప్రధాన మంత్రి వాజ్ పేయి ఉద్ఘాటన
 14. అమర్నాథ్ భూమి తగాదా: ఎస్ ఏఎస్ బీ సేఈఓ ను తీసివేశారు
 15. జమ్మూ కాలిపోవడానికి కాదు – 2008 Rediff.com ఇండియా
 16. ఆర్ధిక నిర్భంధం కాశ్మీరులోని జీవనాన్నికష్టతరం చేస్తుంది

బాహ్య లింకులు[మార్చు]

మూస:Hindu Temples in Jammu and Kashmir మూస:Famous Shiva temples మూస:Jammu and Kashmir topics

"http://te.wikipedia.org/w/index.php?title=అమర్నాథ్&oldid=894444" నుండి వెలికితీశారు