అమాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమాయకుడు
(1968 తెలుగు సినిమా)
దర్శకత్వం అడ్డాల నారాయణరావు
తారాగణం కృష్ణ, జమున
సంగీతం బి.శంకర్
నిర్మాణ సంస్థ ఉదయశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

అమాయకుడు సినిమా 1968 మే 10వ తేదీన విడుదలయ్యింది. ప్రముఖ హాస్యనటుడు అడ్డాల నారాయణరావు దీనికి దర్శకుడిగా పనిచేశాడు. దర్శకునిగా ఇది ఇతని రెండవ సినిమా. ఈ చిత్రానికి మూలం 1959లో వచ్చిన అనారీ హిందీ చిత్రం.

సాంకేతిక వర్గం[మార్చు]

  • సంభాషణలు- రావూరి
  • కథ- ఇందిరారాజ్ ఆనంద్
  • కళ- సూరన్న
  • కూర్పు- కె.ఏ.శ్రీరాములు
  • ఫొటోగ్రఫీ- ఎం.కె. రాము
  • పోరాటాలు- రాఘవులు అండ్ పార్టీ
  • నృత్యం- చిన్ని, సంపత్, వి.జె.శర్మ
  • సంగీతం- బి.శంకర్
  • దర్శకత్వం- అడ్డాల నారాయణరావు
  • నిర్మాతలు- ఉదయశ్రీ (మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్).

నటీనటులు[మార్చు]

కథ[మార్చు]

రాజు (కృష్ణ) నీతి, నిజాయితీగల విద్యాధికుడైన, ఒక పెయింటర్, తల్లి, తండ్రి ఎవరూ లేని అనాథ. మేరియమ్మ (జి.వరలక్ష్మి) ఇంట్లో అద్దెకు వుంటున్నాడు. ఎక్కడ ఏ పనిలో ఉద్యోగంలో చేరినా అచ్చట మోసాలు తట్టుకోలేక, ఉద్యోగాలు వదిలివేస్తుంటాడు. జాలి హృదయం గల మేరియమ్మ అతణ్ణి మందలిస్తూనే, అతని పోషణ భారం వహిస్తుంది. చిత్రాలు గీసి డబ్బులు సంపాదించమని, వాటికి తనే డబ్బు చెల్లిస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా రాజు, ఆ వూరిలో ధనవంతుడు, రామనాథ్ (గుమ్మడి) తమ్ముని కూతురు రాణి (జమున)ని కలుసుకుంటాడు. ఆమె అతనికి సాయం చేయాలని అతనితో చిత్రం గీయించుకుంటానని, పిలిచి, తన స్నేహితురాలు (పనిమనిషి) ఆశ (విజయలలిత)ను రాణిగా చెప్పి, అతనితో తమాషా చేస్తుంది. ఆపైన అతన్ని ప్రేమిస్తుంది. రాజుకూడా ఆమె పేద పిల్ల అని ప్రేమిస్తాడు. ఒకసారి డబ్బుతో పర్స్ పోగొట్టుకున్న రామనాథంకి దాన్ని తెచ్చి ఇచ్చిన రాజు నిజాయితి మెచ్చి, అతనికి తన ఆఫీసులో ఉద్యోగం ఇస్తాడు. ఆ కంపెనీలో అతనికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఇంతలో రాజు, తన తమ్ముని కుమార్తె రాణిని ప్రేమించాడని తెలిసి రామనాథం ఆమెనుండి అతన్ని దూరం చేయాలని రాణిని మందలిస్తాడు. ఈలోపు ఆ కంపెనీలో తయారైన కల్తీ మందుల వలన జ్వరంతో బాధపడుతున్న మేరియమ్మ వాటిని రాజు ద్వారా వాడడంవల్ల దాంతో ఆమె మరణిస్తుంది.

హత్యానేరంపై జైలుపాలయిన రాజును రక్షించటానికి రాణి ప్రయత్నించటం, దాన్ని విఫలం చెయ్యాలని రాణి బాబాయి రామనాథం అడ్డుకోవటం, చివరికి కోర్టులో రామనాథం తన తప్పులను ఒప్పుకోవటంతో అతను అరెస్ట్‌కాబడి, రాజు నిర్దోషిగా బయటకు వస్తాడు. రాణి, రాజుల వివాహంతో చిత్రం సుఖాంతమౌతుంది.[1]

పాటలు[మార్చు]

  1. అనుకోనా ఇది నిజమనుకోనా కలయనుకోనా - పి.బి. శ్రీనివాస్ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
  2. చందమామ రమ్మంది చూడు, చల్లగాలి రమ్మంది చూడు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. పట్నంలో శాలిబండ పేరైన గోల్‌కొండ చూపించు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఎ. వేణుగోపాల్
  4. పూవులలో తీవెలలో పొంగెనులే అందాలే - పి.సుశీల బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
  5. పోలేవు నీవు రాలేను నేను నీదారిలోనే నే దాగినాను - పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
  6. బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
  7. మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా - ఘంటసాల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమాయకుడు&oldid=3898831" నుండి వెలికితీశారు