అమృతాభిషేకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమృతాభిషేకము
కృతికర్త: దాశరథి కృష్ణమాచార్య
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండ కావ్యం
ప్రచురణ:
విడుదల: 1959

అమృతాభిషేకము పుస్తకం కవి దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఖండకావ్యం.

రచన నేపథ్యం[మార్చు]

అమృతాభిషేకము ఖండకావ్యాన్ని 1959లో ప్రచురించారు. ఈ గ్రంథాన్ని ప్రముఖ రాజకీయ నాయకులు, సాహిత్యవేత్త బెజవాడ గోపాలరెడ్డికి దాశరథి అంకితమిచ్చారు.

గ్రంథకర్త గురించి[మార్చు]

ప్రధానవ్యాసం: దాశరథి కృష్ణమాచార్య
దాశరథి కృష్ణమాచార్యులు కవి, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, సినీ గేయకర్త. యువకునిగా ఉన్నప్పుడే దాశరథి ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం విధించిన జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము ప్రభుత్వం. ఆయనతోపాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నాడు. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకడు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసాడు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు గెల్చుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]