అమెజాన్ నది

వికీపీడియా నుండి
అమెజాన్ నదీ ముఖద్వారం.

మూస:Geobox

అమెజాన్ నది (ఆంగ్లం : Amazon River), దక్షిణ అమెరికాలోని పెద్ద నది. ఇది ప్రపంచంలోనే (పరిమాణంలో) అతి పెద్దనది (నైలు నది పొడవైనది). అమెజాన్ నదీప్రవాహం, ప్రపంచంలోని టాప్-10 నదుల నీటి ప్రవాహాలకన్నా ఎక్కువ. ప్రపంచంలోని అన్ని నదుల మొత్తం ప్రవాహంలో దాదాపు 5వ వంతు అమెజాన్ నదీ ప్రవాహమే. దీని విశాలమైన నదీ ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి "నదీ సముద్రం" (రివర్ సీ) అని వ్యవహరిస్తారు. ఈ నదీ పరివాహక ప్రాంతాలలో వంతెనలైతే అసలు కానరావు. దీనిపై వంతెనలే లేవు. ఈ నది వెడల్పు ఎక్కువ వున్న కారణంగా, వంతెనలు నిర్మించలేక పోతున్నారు.[1] ఈ నదీ పరివాహక ప్రాంతంలోగల ఋతుపవన అడవులలో, కొన్ని చోట్ల నగరాలు కానవస్తాయి, కొన్ని రోడ్లు కానవస్తాయి.

పొడవులో ఈ నది ప్రపంచంలో రెండవది. మొదటిది నైలు నది.

ఈ నది పెరు, కొలంబియా, బ్రెజిల్, బొలీవియా, వెనుజులా, ఈక్వెడార్ మరియు గయానా దేశాల గుండా ప్రవహిస్తూవుంది.

బ్రెజిల్ లో అమెజాన్ నదీ జలాలు.

విషయ సూచిక

అమెజాన్ నదీ వ్యవస్థలో పెద్ద నదులు [మార్చు]

  1. 6,992 కి.మీ. (3,969 mi) - అమెజాన్, దక్షిణ అమెరికా
  2. 3,379 కి.మీ. (2,100 mi) - :పురుస్, పెరూ / బ్రెజిల్, (2,948 కి.మీ.) (3,210 km)[ఆధారం కోరబడినది]
  3. 3,239 km (2,013 mi) - మదీరా, బొలీవియా / బ్రెజిల్
  4. 2,820 km (1,752 mi) - యపూరా, కొలంబియా / బ్రెజిల్
  5. 2,750 km (1,709 mi) - టొకాంటిన్స్, బ్రెజిల్, (2,416 km) (2,640 km)[ఆధారం కోరబడినది]
  6. 2,575 km (1,600 mi) - అరగైయా, బ్రెజిల్ (tributary of Tocantins)
  7. 2,410 km (1,498 mi) - జురువా, పెరు / బ్రెజిల్
  8. 2,250 km (1,398 mi) - నైగర్, దక్షిణ అమెరికా
  9. 2,100 km (1,305 mi) - జింగు, బ్రెజిల్
  10. 1,900 km (1,181 mi) - en:Tapajós, బ్రెజిల్
  11. 1,749 km (1,087 mi) - en:Guaporé, బ్రెజిల్ / బొలీవియా (tributary of Madeira)
  12. 1,600 km (1,030 mi) - ఉకయాలి నది, పెరు
  13. 1,575 km (979 mi) - ఇక్యా (పుటుమాయో), దక్షిణ అమెరికా
  14. 1,415 km (879 mi) - మరనోన్, పెరు / ఈక్వెడార్
  15. 1,300 km (808 mi) - ఇరిరి, బ్రెజిల్ (tributary of Xingu)
  16. 1,240 km (771 mi) - జురుయేనా, బ్రెజిల్ (tributary of Tapajós)
  17. 1,200 km (746 mi) - తపజోస్, బ్రెజిల్
  18. 1,130 km (702 mi) - మాడ్రె డె డియోస్, పెరు / బొలీవియా (tributary of Madeira)
  19. 1,100 km (684 mi) - హువల్లాగా, పెరు (మరనోన్ నదికి ఉపనది.)

ఇవీ చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. "Amazon (river)" (2007 ed.). Microsoft Encarta Online Encyclopedia. Retrieved 2007-08-12. 

బయటి లింకులు [మార్చు]