అమెరికన్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
American Express Co
రకం Public (NYSE: AXP)
Dow Jones Industrial Average component
Founded 1850
వ్యవస్థాపకు(లు) Henry Wells
William Fargo
John Warren Butterfield
ప్రధానకార్యాలయం New York City, New York, United States
Area served Worldwide
కీలక వ్యక్తులు Kenneth Chenault
(Chairman & CEO)
పరిశ్రమ Banking
Financial services
ఉత్పత్తులు Financial
Travel services
Insurance
ఆదాయం US$29,962 billion (2011)[1]
నిర్వహణ రాబడి US$6.956 billion (2011)[1]
మొత్తం ఆదాయము US$4.935 billion (2011)[1]
ఉద్యోగులు 62,500 (2011)[1]
వెబ్‌సైటు AmericanExpress.com

అమెరికన్‌ ఎక్సెప్రెస్‌ కంపెనీ NYSE: AXP అనేది కొన్ని సార్లు ఆమ్‌ఎక్స్ ‌ లేదా అమెక్స్ ‌ అని పిలవబడుతుంది, ఇది న్యూయార్క్‌ నగరంలో ప్రధాన కార్యాలయం కలిగి విభిన్నమైన ఆర్థికపరమైన సేవలను అందించే సంస్థ. 1850లో స్థాపించబడిన ఈ సంస్థ, డౌజోన్స్ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌లోని 30 విభాగాలలో ఒకటి. క్రెడిట్‌ కార్డులు, ఛార్జ్‌ కార్డులు మరియు ట్రావెలర్‌ చెక్‌ల వ్యాపారాలకు ఈ సంస్థ పేరెన్నికగన్నది. అమెరికాలో క్రెడిట్‌ కార్డు ద్వారా జరిగే లావాదేవీల్లో సుమారు 24శాతం డాలర్ పరిమాణం కలిగిన వ్యాపారం అమెక్స్ కార్డుల ద్వారానే జరుగుతుంది, ఇతర సంస్థల కంటే కార్డులను అత్యధిక సంఖ్యలో జారీచేసే సంస్థ.[2][3]

బిజినెస్‌ వీక్ ‌ మరియు ఇంటర్‌బ్రాండ్‌లు ప్రపంచంలో 22వ అతి విలువైన బ్రాండ్‌గా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్థానాన్ని ఇచ్చి, దీని యొక్క బ్రాండ్‌ విలువ US$14.97 బిలియన్‌గా అంచనా వేసాయి.[4] ఫార్చ్యున్ ,‌ ప్రపంచంలో ప్రజలు అత్యంత అభిమానించే 30 ఉత్తమ సంస్థల్లో ఒకటిగా అమెక్స్‌ను చేర్చింది.[5]

రోమన్‌ యోధుడిని సంస్థ యొక్క చిహ్నంగా 1958లో రూపొందించారు‌.[6]ఇది సంస్థ యొక్క ట్రావెలర్స్‌ చెక్కులు‌ మరియు క్రెడిట్‌ కార్డులపై కనిపిస్తుంది.

విషయ సూచిక

పూర్వ చరిత్ర[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క షిప్పింగ్‌ రసీదు, న్యూయార్క్‌, న్యూయార్క్‌ నుంచి సెయింట్‌ లూయిస్‌, ఎమ్‌ఓ( ఆగస్టు6, 1853)

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, అల్బనే, న్యూ యార్క్లో 1850లో ఎక్స్‌ప్రెస్‌ మెయిల్‌ వ్యాపారంగా ప్రారంభమైంది. హెన్రీ వెల్స్‌( వేల్స్&కంపెనీ), విలియమ్ ఫార్గో, (లివింగ్‌స్టన్‌, ఫార్గో&కంపెనీ), జాన్‌ వారెన్‌, బటర్ ఫీల్డ్ (వెల్స్‌, బటర్‌ఫీల్డు అండ్‌ కంపెనీ, 1850కు ముందు విజయవంతమైన బటర్‌ఫీల్డు వాసన్‌ అండ్‌ కంపెనీ) హెన్రీవెల్స్‌ ( వెల్స్‌ అండ్‌ కంపెనీ) ఆధ్వర్యంలో ఎక్స్‌ప్రెస్‌ కంపెనీలను కలపి ఉమ్మడి వాటాలతో అమెరికా ఎక్స్‌ప్రెస్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటుచేశారు.[7][8] అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క కార్యకలాపాలను కాలిఫోర్నియా సుదూర ప్రాంతాలకు విస్తరించడాన్ని బటర్‌ఫీల్డ్‌ మరియు ఇతర డైరెక్టర్లు వ్యతిరేకించడంతో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్థాపకులే 1852లో వెల్స్‌ ఫార్గో అండ్‌ కంపెనీని ప్రారంభించారు

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదటి ప్రధాన కార్యాలయ భవంతిని మాన్‌హట్టన్‌ ప్రాంతంలో జాయ్‌స్ట్రీట్‌ మరియు హడ్‌సన్‌ స్ట్రీట్ కలిసే ప్రాంతంలో నిర్మించారు, ఇదే తరువాత మాన్‌హట్టన్‌ విభాగ ట్రైబీకా అని పిలువబడేది. ఎక్స్‌ప్రెస్‌ షిప్‌మెంట్లకు సంబంధించి( సరుకులు, సెక్యురిటీ, ద్రవ్యం మొదలైనవి) న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇది ఏళ్ల తరబడి గుత్తాధిపత్యం సాధించింది. 1874లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ప్రధాన కార్యాలయాన్ని మాన్‌హట్టన్‌ యొక్క ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌గా మారుతున్న 65 బ్రాడ్‌వేకు మార్చి, అక్కడ రెండు భవంతుల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది.[9]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ భవనాలు[మార్చు]

1854లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూయార్క్‌ నగరంలోని వెస్సీ స్ట్రీట్‌లో తన భవంతుల నిర్మాణానికి స్థలం కొనుగోలు చేసింది. థామస్‌స్ట్రీట్‌, జాయ్‌స్ట్రీట్‌,(1857 నుంచి 58, జాయ్‌ వారెన్‌ రిచ్‌) మధ్యలోని 55-61 హడ్సన్‌ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ యొక్క మొదటి న్యూయార్క్‌ ప్రధాన కార్యాలయాన్ని ఇటలీ శైలికి చెందిన అద్భుతమైన పాలరాతి భవనంగా తీర్చిదిద్దారు, హడ్సన్‌ రివర్‌ రెయిల్‌ రోడ్డు సమీపంలో హడ్సన్‌ స్ట్రీట్‌, కొలిస్టర్‌స్ట్రీట్‌ మధ్యలోని ఉండే ఈ భవనంలోని క్రింది అంతస్థులో నిత్యం రద్దీగా ఉండే సరుకుల డిపో ఉండేది. 4-8 హ్యూబర్ట్ స్ట్రీట్‌ కు సమీపంగా, హడ్సన్‌ స్ట్రీట్‌ మరియు కొలిస్టర్‌ స్ట్రీట్‌(1866`67 రిచ్చీ అండ్‌ గ్రిఫిత్‌)కు మధ్య, హడ్సన్ స్ట్రీట్ భవనానికి ఐదు సముదాయాల ఉత్తరంగా ఒక భవంతిని నిర్మించారు.

సౌకర్యవంతంగా ఉండేందుకు 1874లో ప్రధాన కార్యాలయాన్ని టోకు షిప్పింగ్‌ జిల్లా నుంచి ఎదుగుతున్న ఫైనాన్సియల్‌ డిస్ట్రిక్‌కు మార్చాలని నిర్ణయించి, బ్రాడ్‌వేలోని 63 మరియు 65ల్లో రెండు ఐదు అంతస్థుల వాణిజ్య భవంతులను అద్దెకు తీసుకున్నారు, హార్‌మొనీ కుటుంబానికి చెందిన ఈ భవంతులు ఎక్ఛేంజ్‌ అలే మరియు రెక్టర్‌ స్ట్రీట్‌ ల మధ్య మరియు బ్రాడ్‌వే, ట్రినిటీ ప్రదేశాల మధ్య ఉన్నాయి.[10]

1880లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 46 ట్రినిటీ ప్లేస్ లో అలే మరియు రెక్టార్‌ స్ట్రీట్‌ మధ్య బ్రాడ్‌వే బిల్డింగ్‌కు వెనుక నూతన గిడ్డంగిని నిర్మించింది. దీన్ని రూపశిల్పి పేరు తెలియదు, కానీ దీని ప్రాంగణంలో ఉండే ఇటుకల ఆర్చ్‌లు, ఆకాశహర్మ్యాలు పెద్దగా లేని అప్పటి న్యూయార్క్‌ నగరానికి ఒక కొత్త సొబగును తెచ్చాయి. అయితే దీన్ని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కువకాలం ఉపయోగించలేదు, అయితే దీనిపై అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిహ్నమైన గద్ద యొక్క టెర్రాకోటా ముద్ర ఇప్పటికీ ఉంది.[11] తరువాత కంపెనీ 1890- 91లో ఎడ్వర్డ్‌ హెచ్‌. కెన్‌డాల్‌ ఆధ్వర్యంలో గతంలో కార్యాలయం నడిపిన హడ్సన్‌ స్ట్రీట్‌లో పది అంతస్థుల భవనాన్ని నిర్మించింది.

1903నాటికి, ఈ కంపెనీ 28 మిలియన్‌ డాలర్ల ఆస్తులు కలిగి, నగరంలో ఉన్నఆర్థిక సంస్థల్లో నేషనల్‌ సిటీ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్ తరువాత స్థానంలో ఉంది.[citation needed] దీనిని ప్రతిబింబించే విధంగా కంపెనీ బ్రాడ్‌వేలో భవంతులు మరియు స్థలాలను కొనుగోలు చేసింది.[citation needed]

1914లో వెల్స్ ఫార్గో శకం ముగిసిన తరువాత, కాస్త దుడుకుగా వ్యవహరించే జార్జి ఛాడ్‌బౌర్న్ టేలర్‌(1868 - 1923 )నూతన అధ్యక్షుడయ్యారు, ఈ స్థానం చేరుకోవడానికి ముందు సుమారు 30 సంవత్సరాలుపాటు కంపెనీలో వివిధ స్థాయిలలో పనిచేసిన ఆయన కొత్త ముఖ్య కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించాడు. దీనికి ప్రధాన కారణం,న్యూయార్క్ టైమ్స్‌వర్ణించినట్లు, పురాతన గుర్తింపు చిహ్నాల వలె లోవర్‌ బ్రాడ్‌వేలో ఉన్న పాత భవంతులు, శరవేగంగా అభివృద్ధి చెందాలన్న కంపెనీ లక్ష్యానికి అవరోధంగా మారతాయని భావించడమే. 1914 మార్చిలో రెన్‌విక్‌, ఆస్పిన్‌వెల్‌, ట్రక్కర్‌ 32 అంతస్తుల కాంక్రీటు-మరియు ఉక్కుతో నిర్మించిన కార్యాలయ భవన నిర్మాణానికి ప్రణాళిక రచించారు, కంపెనీ పనుల నిమిత్తం నాలుగు ప్రత్యేక భవనాలను రూపొందించాలని భావించారు. భవన ప్రతిపాదన 1914లో నిలిచిపోవడానికి ఐరోపా యుద్ధం కారణం కావచ్చు, కానీ రెండేళ్ల తరువాత ముందుగా అనుకున్న దాన్ని కాస్త కుదించి, మిలియన్‌ డాలర్ల వ్యయంతో తిరిగి నిర్మాణం ప్రారంభించారు.[10]

65 బ్రాడ్‌వే

రెన్‌విక్‌, ఆస్పిన్‌వెల్‌ టకర్ సంస్థకు చెంది, ప్రఖ్యాత నిర్మాణ శిల్పి జేమ్స్‌ రెన్‌విక్‌ జూనియర్ వారసుడైన జేమ్స్‌ ఎల్‌. ఆస్పిన్‌వాల్‌, రూపకల్పన చేసిన 21 అంతస్థుల(బేస్‌మెంట్‌ అదనం) నూతన సాంప్రదాయ‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీ బిల్డింగ్‌ నిర్మాణం 1916-17లో పూర్తయింది. గతంలో రెండు విభాగాలుగా ఉండే పాత భవంతిని స్థిరీకరించి ఒకే చిరునామా 65 బ్రాడ్వేగా మార్చారు. ఈ భవనం ఆ సమయంలో దిగువ బ్రాడ్‌వే "ఎక్స్‌ప్రెస్‌ రో" విభాగంలో ఒక భాగం. కాంక్రీటు-మరియు-ఉక్కుతో నిర్మించిన భవంతులు హెచ్‌ ఆకారం ఉండి, కేంద్ర కాంతి ఆవరణ చుట్టూ పొడవైన పలుచటి రెక్కలను కలిగి, 1880ల నుండి 1910 వరకు అనుసరించబడిన ఈ నమూనా కార్యాలయాలకు గరిష్టమైన వెలుతురు మరియు గాలి అందించే విధంగా ఉంది. గ్రానైట్‌తో పునాదులతో తెల్లని, టెర్రాకోట ఇటుకలతోను, పునాదులు మరియు పై భాగాల్లో కాలమైన్డ్‌ను చొప్పంచడం ద్వారా,అప్పటి ఆకాశహర్మ్యాలను రూపొందించడానికి అనుసరించే విధానమైన,బేస్‌ షాఫ్ట్‌ క్యాపిటల్‌ అనే త్రిముఖ కూర్పు ద్వారా దీని యొక్క ప్రాంగణాలను రూపొందించారు. ప్రఖ్యాత అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈగిల్‌ను దీనిపై రెండు చోట్ల అలంకరించారు.కింద ఆర్చ్‌లో అసమానంగా ఉన్న గద్దను, భవంతిపైన ఉండే ఆర్చ్‌పై సమతలంగా ఉండే గద్దను అమర్చారు. బ్రాడ్‌వే ప్రవేశద్వారాన్ని రెండంతస్థుల కొరింథియన్ కలోనేడ్‌ ను కలిగి ఉంది, పెద్ద ఆర్చ్ వంటి కిటికీలను ఏర్పాటు చేశారు. ఈ భవన ముందుభాగంలో చక్కగా నిర్మించబడిన గోడలతో, నిర్మాణాలు బ్రాడ్‌వేలో ఇప్పుడు ప్రసిద్ధిగాంచిన ఎన్నో నూతన సాంప్రదాయ కార్యాలయ భవనాల నిర్మాణ "ప్రవాహం"కి సహాయపడింది.[12]


1975లో ఈ భవనాన్ని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అమ్మివేసింది, అయినా ఇక్కడ నుంచి ట్రావెల్‌ సేవలు కొనసాగించింది. ప్రముఖ కంపెనీలు ఈ భవంతిలో తమ ప్రధాన కార్యాలయాలు నిర్వహించారు, వీటిలో ప్రముఖమైనవి, జె అండ్‌ డబ్య్లు సెలిగ్‌మన్‌ అండ్‌ కంపెనీ(1940 నుంచి 74 ),అమెరికన్‌ బ్యూరో ఆఫ్‌ షిప్పింగ్‌, ఒక నౌకాయాన సంస్థ (1977 నుంచి 86)కొనసాగాయి, ప్రస్థుతం జె.జె.కెన్ని, స్టాండర్డు అండ్‌ పూర్స్‌ కొనసాగుతున్నాయి, వారు భవంతి యొక్క పేరును దాని వలెనె మార్చారు.[10][12]

జాతీయస్ధాయిలో విస్తరణ[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇతర ఎక్స్‌ప్రెస్‌ కంపెనీలైన రైల్‌రోడ్‌, స్టీమ్‌షిప్‌ కంపెనీలకు అనుబంధ సంస్థలను(వెల్స్‌ ఫార్గోతో సహా...అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏర్పడటానికి విలీనమైన రెండు పాత కంపెనీలను తిరిగి చేర్చడం ద్వారా)ఏర్పాటు చేయడంద్వారా జాతీయస్థాయిలో తన పరిధిని విస్తరించుకుంది.[9]

ఆర్ధిక సేవలు[మార్చు]

1882లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ తపాలా కార్యాలయంతో పోటీ పడటానికి, మనీ ఆర్డర్‌ వ్యాపారం[9] ప్రారంభించి తన కార్యకలాపాల విస్తరణ ప్రారంభించింది.


1888 నుంచి 1890 మధ్య కాలంలో ఐరోపా‌లో పర్యటించిన జ.సి.ఫార్గో, నిరుత్సాహంతో మరియు చిరాకుతో తిరిగివచ్చాడు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అధ్యక్షుడి హోదాలో సంప్రదాయ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్స్ను తనతో తీసుకువెళ్లినప్పటికీ, అక్కడి ప్రధాన నగరాల్లో తప్ప, వాటికి నగదు రూపంలో మార్చుకునే వీలు లేకుండా పోయింది. దీంతో ఫార్గో, మార్సెల్లో ఫ్లెమింగ్‌ బ్యారీ వద్దకు వెళ్లి, సంప్రదాయ ఋణపత్రాలకన్నా మెరుగైన పరిష్కారం సూచించమని కోరాడు. దీంతో బ్యారీ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రావెల్‌ చెక్కులను 1891లో 10,20,50,100 డాలర్ల విలువతో ప్రవేశపెట్టాడు.[13]

ట్రావెల్‌ చెక్కులు ప్రవేశ పెట్టడంతో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. 1914లో, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఐరోపాలో చిక్కుకుపోయిన అమెరికన్‌ ప్రయాణీకులకు ఇతర ఆర్థిక సంస్థలు సాయం చేసేందుకు నిరాకరించడంతో ఐరోపాలో ఉన్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్యాలయాలతోపాటు కొన్ని కంపెనీలు మాత్రమే వారి ఋణపత్రాలను ఆమోదించాయి.

రైల్‌రోడ్డు వ్యాపారంలో నష్టం[మార్చు]

అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్డ్‌ పాలన సమయంలో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ గుత్తాధిపత్యంపై ఇంటర్‌స్టేట్‌ కామర్స్‌ కమిషన్‌ దర్యాప్తుకు ఆదేశించాడు. రైల్‌రోడ్డు ఎక్స్‌ప్రెస్‌ వ్యాపారానికి సంబంధించి పూర్తి నియంత్రణ ఉండాలని ICC అభిలషించింది. అయితే దీనికి వెంటనే పరిష్కారం లభించలేదు.[9] ఈ సమస్యకు ఇతర సమస్యలతో పాటు యాదృచ్చికంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పరిష్కారం లభించింది.


1917 శీతాకాలంలో అమెరికాలో తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడగా, డిసెంబర్ ‌26న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ రైలు రోడ్డు కంపెనీలు, అమెరికా ప్రభుత్వం తరఫున అమెరికా బలగాలు, ఇతర సరఫరాలు మరియు బొగ్గును చేరవేయాలని ఆదేశించారు. రైల్వే లైన్లపై పడ్డ యుద్ధ ప్రభావాన్ని స్థిరీకరించేందుకు ట్రెజరీ సెక్రటరీ విలియమ్‌ గిబ్స్‌ మెక్‌ఆడోకు బాధ్యతలు అప్పగించారు. ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు మరియు రైల్‌రోడ్డు సంస్థలకున్న ఒప్పందాలు రద్దు చేయబడ్డాయి మరియు దేశం యొక్క అవసరాల దృష్ట్యా అన్నీ కలిసి ఒకే కంపెనీలా పనిచేయాలని మెక్‌ఆడ్రో ప్రతిపాదించాడు. దీంతో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క ఎక్స్‌ప్రెస్‌ వ్యాపారం ముగిసింది, దీంతో వీరిని ICC నిఘా నుంచి తొలగించారు. దీని ఫలితంగా అమెరికాలో జులై 1918లో కొత్త అమెరికన్‌ రైల్వే ఎక్స్‌ప్రెస్‌ ఏజెన్సీ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కొత్త కంపెనీ అప్పటి వరకు ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్‌ కంపెనీల యొక్క ఆస్తులు మరియు పరికరాలను తన ఆధీనంలోకి తీసుకుంది(రైల్‌రోడ్‌ లైన్ల ద్వారా ఎక్స్‌ప్రెస్‌ వ్యాపారం చేయడానికి కలిగి ఉన్న హక్కులతోపాటు పదివేల ఆఫీసులు, మరియు 30వేల మంది ఉద్యోగులు కలిగి ఉన్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి గరిష్టంగా 40శాతం వాటా దఖలు పడింది).71,280 miles (114,710 km)

ఇటీవలి చరిత్ర[మార్చు]

1993 నుంచి 2001 వరకు CEOగా పని చేసిన హార్వే గులుబ్‌ తరువాత ప్రస్తుతం కెన్నెత్‌ చీనాల్ట్‌ 2001 నుంచి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు నాయకత్వం వహిస్తున్నారు. దానికి ముందు, అంటే 1977 నుంచి 1993 వరకు జేమ్స్‌ డి. రాబిన్‌సన్ III CEOగా పనిచేశారు.

ఛార్జికార్డు సేవలు[మార్చు]

న్యూయార్క్‌ నగరంలోని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ టవర్‌( ఎడమవైపు పొడవైంది)

1946కు ముందే సాధ్యమైనంత త్వరగా ట్రావెల్‌ ఛార్జి కార్డును ప్రవేశపెట్టాలని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ కార్యనిర్వాహక అధికారులు చర్చించుకున్నారు, కానీ డైనర్ క్లబ్ తమ యొక్క కార్డును మార్చి, 1950 లో ప్రవేశపెట్టిన తరువాత మాత్రమే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ దీనిపై నిశితంగా దృష్టి సారించింది. 1957 చివరి నాటికి ఎట్టి పరిస్థితుల్లో కార్డు బిజినెస్‌ ప్రారంభించాలని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ CEO రాల్ఫ్ రీడ్ నిర్ణయించి, దీనిని విడుదల చేయడానికి అక్టోబర్‌ 1,1958 తేదిని నిర్ణయించారు, అయితే ప్రజల ఆసక్తి గణనీయంగా ఉండటంతో విడుదల తేదికి ముందే 2,50,000 కార్డులను లాంఛనంగా విడుదల చేశారు. దీనికి సంవత్సర ఫీజుగా 6 డాలర్లుగా నిర్ణయించారు, డైనర్స్ క్లబ్‌ కార్డు కన్నా ఒక డాలరు ఎక్కువున్న ఇది, అధిక విలువైన ఉత్పత్తిగా చూడబడింది. మొదట్లో విడుదల చేసిన కార్డులు అకౌంట్‌ నెంబరు, కార్డుదారుల పేరు లేకుండా పేపరుతో తయారు చేశారు. 1959 నాటికి ISO/IEC, 7810 అని చెక్కిఉన్న కార్డులతో పరిశ్రమలో మొదటిసారిగా ప్లాస్టిక్‌ కార్డులను అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టింది.

తన యొక్క వ్యాపారంలోనే ఉన్న విభిన్న మార్కెట్‌ విభాగాలను స్పష్టంగా నిర్వచిస్తూ 1966లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ గోల్డు కార్డును, 1984లో ప్లాటినం కార్డును ప్రవేశపెట్టింది, ఇది పరిశ్రమల్లో స్థూలంగా అనుసరించాల్సిన అంశంగా వ్యాప్తి చెందింది. ప్లాటినం కార్డును అత్యంత-ప్రత్యేకంగా పరిగణించి ఏడాదికి 250 డాలర్ల ఫీజు వసూలు చేసేవారు.(అదిప్పుడు 450 డాలర్లుగా ఉంది.) గతంలో కనీసం రెండు సంవత్సరాలు అమెరికన్ ఎక్స్ప్రెస్ ఖాతాదారులుగా ఉన్నవారికి, వారి వ్యయ ప్రాధాన్యం, మరియు చక్కగా తిరిగి చెల్లించే చరిత్రలపై ఆధారపడి ఆహ్వానం మేరకు అందించేవారు:ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడం ద్వారా లభిస్తోంది.

1987లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశ పెట్టిన ఆప్టిమా కార్డు వారి తొలి క్రెడిట్‌కార్డ్‌ ఉత్పత్తి. గతంలో, అన్ని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులు నెల చివరల్లో చెల్లించాల్సి ఉండగా, ఈ కార్డు ఖాతాదారులు కొంత నిల్వను ఉంచుకోవచ్చు(ఇప్పుడు ఛార్జి కార్డులు కూడా లభిస్తున్న క్రెడిట్‌ ఆధారంగా, క్వాలిఫైయింగ్‌ ఛార్జీలు చెల్లించడం ద్వారా చెల్లింపులను పొడిగించుకునే అవకాశం కల్పిస్తోంది). అయితే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆప్టిమా కార్డులకు సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం 2009 జులై 13నుంచి నిలిపేసింది, ఇప్పటికీ ఆప్టిమా కార్డులు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డాయి, అయితే అవి ఇప్పటికే ఉన్న సభ్యులకు సూచనగా మాత్రమే అని పేర్కొంటుంది. ఆప్టిమా ఖాతాలను మార్చడం లేదా మూసివేయడం జరగలేదని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రవేశపెట్టిన బ్లూ అనేది ఆప్టిమా తరహా క్రెడిట్‌ కార్డుల స్థానాన్ని భర్తీ చేసింది. బ్లూలో, ఆప్టిమా తరహాలో కాకుండా మెంబర్‌షిప్‌ రివార్డ్స్‌ ప్రోగ్రామ్‌ వంటి వివిధ రకాల ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చు.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనుబంధ సంస్థ అయిన ఫస్టు డేటా కార్పోరేషన్‌ను 1992లో IPO కు పెట్టింది. 1996 అక్టోబర్‌లో ఫస్ట్‌డేటా కంపెనీలోఉన్న తన మెజారిటీ హోల్డింగ్స్‌ను పంపిణి చేయడం ద్వారా ఆ కంపెనీలో తన వాటాను 5 శాతం కన్నా తక్కువకు పరిమితం చేసుకుంది.


1994లో, ఆప్టిమా ట్రూ గ్రేస్‌ కార్డును ప్రవేశపెట్టింది. కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నా లేకున్నా చెల్లింపులకు సంబంధించి నిర్ధిష్ట కాలవ్యవధి ఉండే ప్రత్యేకతను ఈ కార్డు కలిగి ఉంది (కొనుగోళ్ళపై ఒక డాలరు మించి వడ్డీని వసూలు చేసే సంప్రదాయ క్రెడిట్‌ కార్డులను వ్యతిరేకం.) కొన్ని సంవత్సరాల తరువాత ఈ కార్డులను నిలిపివేశారు; దీనిలో ఉండే సౌకర్యాలతోనే అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ "ఇంట్రెస్ట్‌ ప్రొటెక్షన్‌" కార్డును తీసుకువచ్చింది.

"బోస్టన్‌ ఫీ పార్టీ"[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1980ల ప్రారంభం నుండి 1990 మొదటి వరకు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డుల మినహా ఏ ఇతర క్రెడిట్‌ కార్డులను అంగీకరించని వ్యాపారులు, రెస్టారెంట్లకు సంబంధించిన వర్తక రుసుము("డిస్కౌంట్‌ రేటు"గా కూడా పిలువబడుతుంది)ని తగ్గించుకుంటూ వచ్చింది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ చేతిలో "బందీలుగా" ఉన్న రెస్టారెంట్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో తెలియక విసా మరియు మాస్టర్‌కార్డు వంటి ప్రత్యర్థులు సతమతమయ్యారు.

1991నాటికి బోస్టన్‌ లోని అనేక ఫలహారశాలలు అంగీకరించడం మరియు ప్రోత్సహించడం వల్ల విసా, మాస్టర్‌ కార్డుల వినియోగం విరివిగా పెరిగింది, దీనికి కారణం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌తో పోల్చితే వీటి రుసుములు తక్కువగా ఉండటం( అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి వాడకానికి 4 శాతం ఉండగా, విసా, మాస్టర్‌ కార్డుదారులకు కేవలం 1.2 శాతం మాత్రమే) వారికి కలసివచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌ మరియు చార్జికార్డులను తిరస్కరించడం మొదలుపెట్టారు. న్యూయార్క్‌, లాస్‌ఏంజిల్స్‌, చికాగో వంటి నగరాలతో సహా యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా 250 ఫలహారశాలలకు వేగంగా పాకింది, ఈ తిరుగుబాటునే బోస్టన్‌ ఫీ పార్టీగా వ్యవహరిస్తారు, ఎందుకంటే బోస్టన్‌ టీ పార్టీ తరహాలోనే ఇది కూడా వ్యాపించింది. తరువాత కాలంలో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన డిస్కౌంట్ రేట్లను క్రమంగా తగ్గించుకోవాలని నిర్ణయించి, తద్వారా సమర్ధవంతమైన పోటీని ఇచ్చి కొత్త వ్యాపారులను అంటే సూపర్‌ మార్కెట్లు, ఔషధ దుకాణాలను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ వ్యాపారాలను సమర్ధవతంగా ప్రోత్సహించి అమలులో ఉన్న వారి చెల్లింపు విధానాల జాబితాలలో అమెరికన్ ఎక్సెప్రెస్‌ కార్డులను చేర్చడానికి ప్రత్యేక అంగీకార కార్యక్రమంలోని అనేక అంశాలు కూడా తొలగించబడ్డాయి.


ప్రస్తుతం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క సరాసరి US వర్తక రేటు 2.5శాతంగా ఉంది[citation needed], అయితే డిస్కవర్‌, మాస్టర్‌ కార్డు మరియు విసాల కార్డుల సరాసరి వర్తక రేటు 2 శాతంగా ఉంది[citation needed]( విసా, మాస్టర్‌ కార్డు సిగ్నేచర్‌డెబిట్‌ కార్డుల రేటు 1.7 శాతం)[citation needed]. కొన్ని వర్తక విభాగాలు, త్వరిత సేవల ఫలహార శాలలు అయిన మెక్‌డోనాల్డ్ వంటి రెస్టారెంట్లకు, వ్యాపార అవసరాలు, లాభాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రాయితీలు ఇస్తోంది.

కేబుల్‌టీవీ[మార్చు]

వార్నర్‌ కమ్యూనికేషన్స్‌తో కలసి 1979లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంయుక్త భాగస్వామ్యంలో వార్నర్‌-అమెక్స్‌ శాటిలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ స్ధాపించి, దీని ద్వారా MTV, నికలోడియాన్‌, మూవీ ఛానల్‌లను ప్రారంభించింది. 1984 వరకు భాగస్వామ్యం కొనసాగింది. తరువాత కాలంలో ఈ ఆస్తులను వయోకాంకు అమ్మివేశారు.

బ్యాంకు హోల్డింగ్‌ కంపెనీగా మార్పు[మార్చు]

2008 ఆర్ధిక సంక్షోభ సమయంలో, అంటే నవంబర్‌ 10, 2008న ఫెడరల్‌ రిజర్వ్ సిస్టం[[]] నుంచి బ్యాంకు హోల్డింగ్‌ కంపెనీగా మార్చుకునేందుకు అనుమతి పొంది, తద్వారా ట్రబుల్డ్ అస్సెట్ రిలీఫ్‌ ప్రోగ్రాం కింద ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి అర్హత సాధించింది.[14] అప్పటికి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క మొత్తం ఆస్తులు 127 బిలియన్‌ డాలర్లు.[14] జూన్‌ 2009లో, 3.39 బిలియన్‌ డాలర్ల TARP నిధులు, 74.4 మిలియన్ల డివిడెండ్‌ చెల్లించింది, TARP ద్వారా జులై 2009లో 340 మిలియన్‌ డాలర్ల ట్రెజరీ వారెంట్ల తిరిగి కొనుగోలు చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకున్నారు.[15][16]

వ్యాపార నమూనా[మార్చు]

సాధారణ క్రెడిట్‌ కార్డు వ్యాపార నమూనా[మార్చు]

సాధారణంగా వినియోగదారుడు క్రెడిట్‌కార్డు లేదా ఛార్జ్‌ కార్డును ఉపయోగించి కొనుగోళ్ళు చేసినప్పుడు, అందులో చిన్న మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లిస్తారు( దీన్నే మర్చెంట్‌ డిస్కౌంట్‌ అంటారు), వ్యాపారస్థుని వద్ద మిగిలినభాగం ఉంటుంది. సాధారణంగా ఈ మొత్తాన్ని మూడు పక్షాలు తమలో తాము పంచుకుంటాయి:

  1. డబ్బు పొందే బ్యాంకు : వ్యాపారస్థుని కొరకు క్రెడిట్‌ కార్డు లావాదేవీలను జరపడటం, దానితో పాటు క్రెడిట్ కార్డు కు చెల్లించబడిన నికర విలువను వ్యాపారి ఖాతాలోకి క్రెడిట్‌ చేస్తుంది.
  2. జారీ చేసే బ్యాంకు : ఈ బ్యాంకు వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తుంది. క్రెడిట్‌ కార్డు కొనుగోలుకు తిరిగి చెల్లించాల్సిన మొత్తానికి వినియోగదారుడు ఈ బ్యాంకు కు బాధ్యత వహిస్తాడు. ఇలా కార్డులు జారీ చేసే బ్యాంకు పొందే వర్తక డిస్కౌంట్ ను ఇంటర్‌ఛేన్జింగ్ ఫీజు అని అంటారు.
  3. నెట్‌వర్క్‌ :డబ్బు పొందే బ్యాంకులు, కార్డులు జారీ చేసే బ్యాంకుల మధ్య వారధిగా వ్యవహరించడం. ఈ బ్యాంకులు తమలో తాము కంటే, నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి కార్డు కొనుగోళ్ళకు ఉపకరిస్తాయి. ఒక బ్యాంకుతో మరొక బ్యాంకుకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకుండానే, పెరూలోని కమ్యూనిటీ బ్యాంకు జారీ చేసిన క్రెడిట్‌ కార్డును శ్రీలంకలో ఉపయోగించుకోవచ్చు. విసా,మాస్టర్‌ కార్డులు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నాయి.

యునైటెడ్‌ స్టేట్స్‌లో సగటు మర్చెంట్‌ డిస్కౌంట్‌ 1.9 శాతం. ఇందులో కార్డులు కలిగి ఉన్న వారికి 0.1 శాతం, జారీ చేసే వారికి 1.7 శాతం, నెట్‌వర్క్‌కు 0.09 శాతం వెళుతుంది.[17]


ప్రైమ్‌, సూపర్‌ ప్రైమ్‌ కార్డు జారీదారులు వారి ఇంటర్ చేంజ్ ఆదాయంలో అధిక భాగాన్ని తరచూ వాడినందుకు పాయింట్లు, నగదు తిరిగి ఇవ్వడం వంటి విశ్వసనీయ కార్యక్రమాలకు నిధులను అందించడానికి వినియోగిస్తారు, అందువలన వారు కార్డులను ఇవ్వడం ద్వారా పొందే ఆదాయంతో పోల్చినపుడు కార్డు వ్యయం నుండి పొందే లాభం స్వల్పంగా ఉంటుంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఏ విధంగా భిన్నమైనది?[మార్చు]

మొత్తం వర్తక డిస్కౌంట్‌ను తానే నిలుపుకోవడానికి, అమెరికన్‌ ఎక్‌ప్రెస్‌ పై మూడు తరహా సేవలను అందిస్తోంది. ఇటీవల కాలంలో అమెక్స్‌, తన ప్రాబల్యం లేని దేశాలు మరియు, తన యొక్క ఉనికి నామమాత్రంగా ఉన్న చోట్ల అమెక్స్‌ తరఫున ఇతర బ్యాంకులు కార్డులు పొందడం లేదా జారీ చేసే ప్రక్రియకు అనుమతిస్తోంది.

చారిత్రకంగా, విసా, మాస్టర్‌ కార్డు కన్నా అమెక్స్‌ ఎక్కువ వర్తక డిస్కౌంట్‌ ఇస్తోంది. ప్రీమియం పరిమాణంలో చాలా తేడాలు ఉంటాయి:పోటీదారులైన విసా, మాస్టర్‌కార్డ్‌తో[17][18] పోలిస్తే అమెక్స్‌ 66 బేసిస్‌ పాయింట్లు ఎక్కువ డిస్కౌంట్‌ ఇస్తోంది(2.56శాతం వర్సెస్‌ 1.9శాతం) ఆస్ట్రేలియా అమెక్స్,‌ విసా, మాస్టర్‌ కార్డులకన్నా దాదాపు రెట్టింపు వసూలు చేస్తోంది, ఆస్ట్రేలియన్ ‌ ఇంటర్‌ చేంజ్‌ నిబంధనలే దీనికి కారణం.

అమెక్స్‌ ఈ డిస్కౌంట్‌ ద్వారా వచ్చిన ఈ ఆదాయాన్ని పోటీ కార్యక్రమాలకన్నా ఎక్కువ చెల్లింపులు చేసిన వారికి రివార్డులు ఇవ్వడానికి ఉపయోగిస్తోంది. ఈ ప్రత్యేక రివార్డుల కార్యక్రమాలు, ప్రీమియం బ్రాండ్‌ మరియు వినియోగదారులకు సేవలు అందించడం ద్వారా అమెక్స్‌, ఎక్కువ మంది సంపన్న ఖాతాదారులను ఆకర్షించగలుగుతోంది. ఎక్కువ మర్చెంట్‌ డిస్కౌంట్‌ రేట్లను వసూలు చేయడాన్ని అమెక్స్‌ తనకున్న ధనవంతులైన వినియోగదారుల బలంతో సమర్థించుకుంటుంది, ఒకవేళ వ్యాపారస్థుడు అమెక్స్‌ కార్డులను ఆమోదించకపోతే, ధనవంతుడైన వినియోగదారుడిని కోల్పోతాడన్న భావనను కల్పిస్తుంది. ఈ వ్యాపార నమూనా ఇద్దరి మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసింది.[2]

"వేగ-కేంద్ర వ్యూహం"గా అమెక్స్ పేర్కొనే దాని వల్ల కార్డు వినియోగం, ఫీజులపై విషయంలో ఇతరుల లాభం 10 నుంచి 40 శాతం ఉండగా, అమెక్స్‌ 70 శాతం లాభానికి బాధ్యత వహిస్తోంది. సంవత్సర ఫీజుల విషయంలో అమెక్స్‌ ఇతర పోటీదారులకన్నా ఎక్కువే ఆర్జిస్తోంది.[2]

అమెక్స్‌ వ్యాపార నమూనా‌లో ఒక వత్తిడి అంగీకారం, పరిమాణం vs.ఉపాంత‌ అంగీకారం.‌ అమెక్స్‌ అధిక మొత్తంలో మర్చంట్‌ డిస్కౌంట్‌ను వసూలు చేస్తున్న కారణంగా, విసా మరియు మాస్టర్‌ కార్డు తరహాలో దీనిని అంగీకరించరు. అమెక్స్‌ వ్యాపార నమూనా ఎక్కువ డిస్కౌంట్‌ ఫీజు మీద ఆధారపడటంతో, దాన్ని తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. సరిపడినంత మంది వ్యాపారులకు ఆకట్టుకునేందుకు ఫీజులను తగ్గించుకోవడం, అదేవిధంగా తన యొక్క వ్యాపార నమూనాను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన రివార్డులు ఇవ్వడం మధ్య సంస్థ సమతౌల్యతను సాధించాల్సి ఉంది. తక్కువ ప్రీమియం వసూలు చేసే US వంటి దేశాలలో, ఇది పాక్షికంగా ఆమోదయోగ్యమైనదే, అయితే పోటీదారులు ఇచ్చే రివార్డుల కంటే ఇది ఇచ్చే కార్డు రివార్డులు అంత గొప్పగా చెప్పుకోదగ్గవికావు. అయితే ఎక్కువ ప్రీమియం ఇచ్చే దేశాల్లో, ఇది తరచు పోటీదారుల కార్డులకన్నా ఎక్కువ రివార్డులు ఇస్తోంది.[19]

చాలా బ్యాంకులు కార్డులు లేదా ఇతర మార్గాల ద్వారా ఇచ్చే ఋణాలను, డిపాజిట్ల ద్వారా సమకూర్చుకుంటాయి. అయితే డిపాజిట్లు లేకుండా, అమెక్స్‌ చరిత్రాత్మక విధానంలో తన యొక్క నిల్వ ఉండే ట్రావెల్‌ చెక్స్‌ ద్వారా( ఒకరకంగా ఇది వడ్డీ పడని డిపాజిట్‌లాంటిది), హోల్‌సేల్‌ ఫండింగ్ మార్కెట్లు మరియు సెక్యురిటైజేషన్‌ ద్వారా సమకూర్చుకుంది. ATM‌ల రాకతో ట్రావెలర్‌ చెక్‌ల ప్రజాదరణ తగ్గడంతో,[20] అమెక్స్‌ ఆన్‌లైన్‌ అధిక ఆదాయ సేవింగ్స్‌ అకౌంట్ల ద్వారా సంప్రదాయ డిపాజిట్లను సేకరించడం ప్రారంభించింది.[21] 2007-2010 ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో హోల్‌సేల్‌ మార్కెట్‌ ఫండిగ్‌ మరియు సెక్యురిటైజేషన్‌ నిలిచిపోయాయి, దీంతో అమెక్స్ డిపాజిట్లను పెంచడం వేగవంతం చేయాల్సి వచ్చింది, మరియు అదేవిధంగా అప్పులు ఇవ్వడంలో పెరుగుదల తగ్గింది.

ఇది కేవలం ధనికులైన ఖాతాదారులపైనే దృష్టి సారించడం వల్ల, చారిత్రాత్మకంగా ఇతర కార్డు జారీదారులతో పోలిస్తే అమెక్స్‌ క్రెడిట్‌ కార్డుల నష్టాలు తక్కువే. అయితే 2008 మూడో త్రైమాసికం నుంచి 2009 మొదటి త్రైమాసికం వరకు ఈ అంతరం దాదాపుగా చెరిగిపోయింది, అన్ని రకాల క్రెడిట్‌ కార్డులు జారీ చేసే వారు తీవ్రస్థాయిలో ఋణనష్టాలు చవిచూసారు.[2]

కార్డు ఉత్పత్తులు[మార్చు]

వినియోగదారుల కార్డులు[మార్చు]

గ్రీన్‌, గోల్డు, ప్లాటినం ఛార్జి కార్డుల్లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మంచి గుర్తింపు సాధించింది, మరియు వివిధ దేశాల్లో ఇదే తరహా వర్ణ స్థాయిలతో క్రెడిట్‌ కార్డులను ఇస్తోంది.

1999లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ సెంచూరియన్‌ కార్డును పరిచయం చేసింది, దీన్ని తరచుగా బ్లాక్‌ కార్డ్‌ అని కూడా అంటారు, మరింత ధనవంతులు, శ్రేష్టమైన వినియోగదారుల అవసరాలను ఇది తీరుస్తుంది. కార్డు జారీ చేసే సమయంలోనే 1000డాలర్ల వార్షిక పీజును వసూలు చేసారు( అదిప్పుడు 2500 డాలర్లకు చేరింది, దీనికితోడు మొదటిసారి ప్రారంభ రుసుము ఐదువేల డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది.) సెంచూరియన్‌ అనేక ప్రత్యేకమైన ప్రయోజనాలను కల్పిస్తోంది. ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేసే శక్తివంతమైన ధనిక వినియోగదారులకు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్డుల ద్వారా ప్రత్యేక రాయితీలు కల్పిస్తోందనే పుకార్లు వినవచ్చేవి. నోటి-మాట ద్వారా ఈ పుకార్లను సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశ్యంతోనే అమెక్స్‌ సెంచూరియన్‌ కార్డులను ప్రవేశపెట్టింది.[22]

As of 2005అమెరికాలో సెంచూరియన్‌ కార్డు సంవత్సర రుసుము 2500 డాలర్లుగా ఉంది, ఇతర అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులు అసలు రుసుము లేకపోవడం నుండి( బ్లూ, ఇతర వినియోగదారుల, వ్యాపార కార్డుల్లో కూడా)450 డాలర్ల వార్షిక రుసుము( ప్లాటినమ్‌ కార్డు)మధ్య ఉన్నాయి. గ్రీన్‌ కార్డు యొక్క వార్షిక రుసుము 55డాలర్లు( రివార్డ్‌ మెంబర్‌షిప్‌ లేకుండా), గోల్డ్‌ కార్డుకు 125 డాలర్లు వసూలు చేస్తున్నారు.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనేక సహా బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ఒకటి రెండు విభాగాలలో ప్రవేశపెట్టింది.

  • ఎయిర్‌లైన్స్‌ మరియు హోటల్స్:డెల్టా ఎయిర్‌లైన్స్‌, వర్జిన్ అట్లాంటా,బ్రిటిష్ ఎయిర్‌ వేస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, క్వాంటాస్‌, జెట్‌బ్లూ ఎయిర్‌వేస్, స్టార్‌ఉడ్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్స్ట్‌ వరల్డ్‌ వైడ్‌, హిల్‌టన్‌ హోటల్స్‌, మరియు ఇతరులు.
  • చిల్లర వర్తకులు:కాస్ట్కో, డేవిడ్‌ జోన్స్‌, హోల్ట్‌ రెన్‌ఫ్యూ, హరోడ్స్ మరియు ఇతరులు.

యువతను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన కార్డులను అమెరికా ఎక్స్‌ప్రెస్‌ బ్లూగా పిలుచుకునేది. బ్లూస్‌కు సంబంధించిన టెలివిజన్‌ ప్రచారం కోసం 1979 నాటి గ్యారీ న్యూమన్‌ యొక్క విజయవంతమైన UK సింథ్ పాప్ కార్‌ను తన యొక్క థీమ్‌సాంగ్‌గా ఉపయోగించుకుంది. యూరోపియన్‌ మార్కెట్‌లో విజయవంతమైన ఈ బ్లూస్‌ కార్డుకు ఎలాంటి వార్షిక ఫీజులు లేవు, రివార్డుల ప్రోగ్రామ్‌తోపాటు, బహుళ ఉపయోగాలు కలిగిన ఆన్‌బోర్డ్‌ చిప్‌ ఉంటుంది. దీని తరువాత క్యాష్‌ బ్యాక్‌ వెర్షన్‌, "బ్లూ క్యాష్‌"ను వెంటనే విడుదల చేసింది. యువతను ఆకట్టుకునేందుకు, వారిని లక్ష్యంగా చేసుకొని సిటీ రివార్డ్‌ కార్డులను ప్రవేశపెట్టింది, వీటి ద్వారా న్యూయార్క్‌, చికాగో లాస్‌ఎంజిల్స్‌లోని జానాకర్షక ప్రదేశాలలో తినడం, తాగడం, ఆటలాడటం ద్వారా ఇన్‌సైడ్‌ రివార్డ్‌ పాయింట్లను పొందవచ్చు. 2008 మధ్య అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ దశలవారీగా ఇన్‌సైడ్‌ కార్డులను తెరమరుగు చేసింది, జులై 2008 నుంచి కొత్త దరఖాస్తులను తీసుకోవడం ఆపేసింది.


2005లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాస్టర్‌ కార్డ్‌ యొక్క పే పాస్‌ను పోలి ఉండే ఎక్స్‌ప్రెస్‌ పేను ప్రవేశపెట్టింది, వైర్‌లైస్‌ RFID విధానం చెల్లింపు విధానం ఉన్న ఈ కార్డు ద్వారా స్పెషల్‌ రీడర్‌ ముందు కార్డును ఊపితే సరిపోతుంది, పెట్టి తీయవలసిన అవసరం లేదు. బ్లూ కార్డులో ఉన్న స్మార్ట్‌ చిప్‌ను ఈ సాంకేతికతతో మార్పు చేశారు. 7-ఎలెవెన్‌, CVS/ఫార్మసి, మెక్‌డొనాల్డ్స్‌, రీగల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్రూప్‌ మరియు రిట్జ్‌ కెమెరా సెంటర్ వంటి అనేక మంది U.S.వర్తకులు మరియు రెస్టారెంట్ల భాగస్థులు‌ ఇప్పుడు దాదాపుగా తమ యొక్క అన్ని కేంద్రాల్లో ఎక్స్‌ప్రెస్‌ పేను అందిస్తున్నారు.

2005లో, స్పష్టమైన, ఎటువంటి ఫీజులు లేని తొలి క్రెడిట్‌కార్డుగా ప్రచారం చేసిన క్లియర్ ను ప్రవేశపెట్టింది. 2005లోనే, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ "సేవింగ్స్‌ యాక్సిలేటర్‌ ప్లాన్‌" ఆధారిత ఒన్‌ అనే క్రెడిట్‌ కార్డును మార్కెట్లోకి తెచ్చింది, దీని ద్వారా అర్హత పొందిన అమ్మకాలకు సంబంధించి 1శాతం డబ్బును FDIC-భీమా పొందిన‌ హై ఈల్డ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌లోకి జమచేస్తుంది. 2005లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద నాట్‌, ద నెస్ట్‌ వంటి ఇతర కార్డులను సైతం ప్రవేశపెట్టింది, వివాహ ప్రణాళిక వెబ్‌సైట్‌ ద నాట్‌. కామ్‌ యొక్క సహకారంతో ఈ సహ-బ్రాండెడ్‌ కార్డులను అభివృద్ధి చేసింది.

2006లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క UK విభాగం ప్రొడక్ట్‌ రెడ్ యొక్క సంకీర్ణంలో చేరి, రెడ్‌ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా సభ్యులు జరిపే కొనుగోళ్లకు అనుగుణంగా, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మంచి కార్యక్రమాలైన ఎయిడ్స్‌ వ్యతిరేకంగా పోరాటం, క్షయ, మలేరియాతోపాటు ఎయిడ్స్‌, మలేరియా మరియు HIV/AIDSతో బాధపడుతున్న ఆఫ్రికా మహిళలు, చిన్నారులకు సాయం అందించడానికి, మరియు ఇతర వ్యాధులకు అంతర్జాతీయ నిధికి కంపెనీ సహాయాన్ని అందిస్తుంది.

2009లో, అమెరికన్‌ ఎక్‌ప్రెస్‌ ZYNC ఛార్జి కార్డును ప్రవేశపెట్టింది. తెల్లటి రంగులో ఉండే ఈ కార్డును 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వారి కోసం ప్రవేశపెట్టారు. ఈ కార్డు ఇప్పుడు తన యొక్క బీటా పరీక్షను ప్రారంభించింది మరియు ఎవరైనా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

చిన్న వ్యాపార సేవలు ( అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓపెన్‌ గా కూడా పిలువబడతాయి)[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ చిన్న తరహా వ్యాపారాల యొక్క ఖర్చుల నిమిత్తం వివిధ రకాల చార్జ్ కార్డులను అందిస్తోంది మరియు అదే విధంగా కార్పొరేట్‌ కార్డులను అందిస్తున్న అతి పెద్ద కంపెనీ కూడా ఇదే.

2007 చివరలో కంపెనీ, తన కార్డుల వరసలో కొత్త కార్డును చేరుస్తూ, చిన్న వ్యాపారాల యజమానుల కోసం కొత్త ప్లమ్‌ కార్డును ప్రకటించింది. ఈ కార్డు 1.5శాతం పే డిస్కౌంట్‌ లేదా సుమారు రెండు నెలలపాటు కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులను వాయిదా వేసే అవకాశం కల్పిస్తుంది. 5000వేల డాలర్ల వరకు ఖర్చు పెట్టిన కార్డుదారులకు 1.5శాతం రాయితీ లభిస్తుంది. తొలి 10,000 కార్డులను డిసెంబర్‌16, 2007లో తన సభ్యులకు అందించింది.[23]

2008లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ క్రెడిట్‌కార్డులకు సంబంధించిన అన్ని బిజినెస్‌లైన్లను మూసేయాలని నిర్ణయం తీసుకుంది. వాణిజ్య బ్యాంకుగా మారడం కోసం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వద్ద చేసుకున్న విజ్ఞప్తికి అనుగుణంగా ఈ నిర్ణయానికి వచ్చింది.

వాణిజ్య కార్డులు మరియు సేవలు[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మధ్య తరహ,‌ అదే విధంగా పెద్ద వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు అదేవిధంగా రోజువారీ కార్యనిర్వహణ వ్యయాలకు సంబంధించిన అవసరాలను తీర్చే విధంగా సమగ్రమైన కార్డులను రూపొందించింది. దీనికి సంబంధించిన కీలకమైన ప్రొడక్ట్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్పొరేట్‌ కార్డ్‌ ను 40దేశాల్లో అందిస్తోంది, మరియు నిర్దిష్ట అవసరాలకు సంబంధించి, నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేసే విధంగా వివిధ రకాల కార్డులను ఇది ప్రవేశపెట్టింది. ఈ ఉత్పత్తుల ఉదాహరణలలో కార్పొరేట్‌ మీటింగ్‌ కార్డు, కార్పొరేట్‌ పర్చేజ్‌ కార్డు, మరియు బిజినెస్‌ ట్రావెల్‌ అకౌంట్‌ వంటివి ఉన్నాయి. కమర్షియల్‌ కార్డులనేవి, బిజినెస్‌ కార్డుల కంటే భిన్నమైనవి, వీటి చెల్లింపులకు సంబంధించి కంపెనీ జవాబుదారీగా ఉంటుంది.(బిజినెస్‌ కార్డులను కంపెనీ యజమానికి ఇచ్చే అప్పుకు కొనసాగింపుగా జారీ చేస్తారు). దీనికి అదనంగా, వాణిజ్య కార్డులు సమగ్రమైన సమాచారంతోపాటు నివేదికలను అందిస్తాయి, తద్వారా ఖాతాదారులకు ఉద్యోగి ఖర్చుపై దృష్టి నిలిపి నియంత్రించడానికి వీలవుతుంది.

కార్పొరేట్‌ ఖాతాదారులకు సహాయపడే విధంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అనేక ఆన్‌లైన్‌ సేవలను American Express @ Work® website ద్వారా అందుబాటులోకి తెచ్చింది. American Express @ Work® website నుంచి ఖాతాదారులు కార్యక్రమ నిర్వహణ సామర్ధ్యాలు, అన్‌లైన్‌ ప్రకటనలు‌, నివేదికలు మరియు సమాచార సమీకృత ఉత్పత్తులు తెలుసుకోవచ్చు. Information @ Work®, అనే ఈ రిపోర్టింగ్‌ టూల్‌ ద్వారా మధ్యస్థ కంపెనీలకు తమ ఉద్యోగులు పెట్టే ఖర్చు వివరాలు వేగంగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది, కస్టమైజ్‌డ్‌ రిపోర్టింగ్‌లో భారీ స్ధాయిలో ఉద్యోగుల ఖర్చు వివరాలను విశ్లేషణాత్మకంగా తెలుసుకోవచ్చు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖాతాదారులకు ఖర్చుల వివరాలు మరియు సర్దుబాటు పరికరాలతో కూడిన డేటా ఫైల్స్‌ తెలుసుకునే అవకాశం కల్పించింది.


2008లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ GE సంస్థకు చెందిన కార్పొరేట్‌ పేమెంట్‌ సర్వీస్‌వ్యాపారాన్ని కొనుగోలు చేసింది, పెద్ద ప్రపంచ స్థాయి ఖాతాదారుల పర్చేజింగ్‌ కార్డు సొల్యూషన్లను అందించడంపైనే ఇది ప్రధానంగా దృష్టి సారించింది. ఒక బిలియన్‌ డాలర్‌+ లావాదేవీల్లో భాగంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కొత్త కార్డు V పేమెంట్‌ను తన ఉత్పత్తుల శ్రేణిలో చేర్చింది. వి పేమెంట్‌ అనేది ప్రత్యేకమైనది, మరింత దృఢంగా నియంత్రించబడుతుంది, నియంత్రణను మరింత పెంచడం కోసం ఏకీకృత వినియోగ కార్డ్‌ నంబర్‌ను ఉపయోగిస్తారు.

యాజమాన్యం లేని కార్డులు[మార్చు]

డిసెంబర్‌ 2000లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, అప్పటి ఫసిఫిక్‌ సెంట్యూరీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్ లో భాగమైన బ్యాంకు ఆఫ్‌ హవాయి యొక్క క్రెడిట్‌కార్డ్‌ పోర్ట్‌ఫోలియోను తీసుకునేందుకు అంగీకరించింది. ఆ తరువాత జనవరి, 2006లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన బ్యాంకు అఫ్ హవాయి కార్డ్‌ ఫోర్ట్‌ఫోలియోను బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (MBNA)కు విక్రయించింది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా విసా, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులను బ్యాంక్‌ ఆఫ్‌ హవాయి పేరుతో జారీ చేస్తుంది.

2004 వరకు, విసా మరియు మాస్టర్‌ కార్డులను జారీ చేసే సంస్థలు, అమెరికాలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులను జారీ చేయకూడదనే నిషేధం ఉండేది. దీనిఅర్థం ఏమిటంటే వాస్తవానికి ఏ అమెరికన్‌ బ్యాంకు కూడా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులను జారీ చేయలేదు. U .S. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం ద్వారా ఈ రూల్స్‌ తొలగించబడ్డాయి, ఇప్పుడు ఇవి అమలులో లేవు. 2004 జనవరిలో, అమెరికన్ ఎక్స్ప్రెస్ U.S. బ్యాంకు అయిన MBNA‌ అమెరికా ద్వారా తన కార్డులను జారీ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రాథమికంగా ఇది ఒక ప్రయోగం అంటూ మాస్టర్‌కార్డు కార్యనిర్వాహకులు కొట్టిపారేసిన ఈ కార్డులు అక్టోబర్‌ 2004లో విడుదలయ్యాయి. విసా కార్డు సృష్టికర్త, మరియు గరిష్టంగా విసా కార్డులను జారీ చేసే మరియు వీసా కార్డు ప్రారంభ అభివృద్ధి కర్త అయిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాతో MBNA విలీనం కావడంతో ఈ సంబంధాలు ప్రమాదంలో పడతాయని పలువురు భావించారు. ఏది ఏమైనప్పటికీ, డిసెంబర్‌21, 2005లో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఒప్పందానికి అనుగుణంగా బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఖాతాదారుల ఋణాలను సొంతం చేసుకుంటుంది అదేవిధంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ లావాదేవీలను జరుపుతుంది. అదేవిధంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, విసా, మాస్టర్‌కార్డ్‌తోపాటు పలు యు.ఎస్‌ బ్యాంకులపై తెచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఉపసంహరించుకుంది. తుదకు, బ్యాంకు ఆఫ్‌ అమెరికా మరియు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లు, MBNA మరియు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ల మధ్య ఉన్న కార్డుల జారీ భాగస్వామ్యాన్ని, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మరియు MBNA విలీనం తరువాత కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ రెండింటి భాగస్వామ్యంలో ఎలాంటి వార్షిక ఫీజులు లేని బ్యాంక్ అఫ్ అమెరికా రివార్డ్స్ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డును జూన్‌ 30, 2006లో విడుదల చేశారు.

అప్పటి నుంచి సిటీ బ్యాంక్‌, GE మనీ మరియు USAAలు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డులను జారీ చేయడం ప్రారంభించాయి. సిటీబ్యాంకు ప్రస్తుతం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ AAడ్వాన్టేజ్ ‌ సహ బ్రాండెడ్‌ కార్డ్ తోపాటు పలు రకాల అమెరికన్‌ ఎక్సెప్రెస్‌ కార్డులను విడుదల చేస్తోంది. 2006 ప్రారంభంలో,[24] అమెక్స్‌, GE మనీ ఉమ్మడి సహకారంతో డిల్లర్డ్'స్ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డును జారీ చేసింది, అయితే మార్చి 2008లో[25] GE కార్డు యూనిట్‌ను 1.1 బిలియన్‌ డాలర్ల నగదుకు అమెక్స్‌కు అమ్మేసింది. ప్రస్తుతం HSBC బ్యాంకు USA, HSBC బ్రాండెడ్‌, నీమన్‌ మార్కస్‌ సహ బ్రాండెండ్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ రివార్డు క్రెడిట్‌ కార్డులను ప్రయోగాత్మకంగా జారీ చేసింది, వీటిని పూర్తి స్థాయిలో 2007 చివరల్లోగానీ, 2008 మొదట్లో గానీ విడుదల చేసే అవకాశం ఉంది. UBS, US‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ క్లయింట్ల కోసం రిసోర్స్‌ కార్డ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇది, విసా సిగ్నేచర్‌ క్రెడిట్‌కార్డుతోపాటు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛార్జి కార్డులను జారీ చేయడంతోపాటు ఖాతాదారుల అకౌంట్లతో అనుసంధానం చేసింది, అదేవిధంగా రెండిరటికి ఒకే విధమైన రివార్డ్‌ ప్రొగ్రామ్‌ను అమలు చేస్తోంది.

కార్డేతర ఉత్పత్తులు[మార్చు]

ట్రావెలర్స్ చెక్కులు[మార్చు]

ప్రపంచంలో ట్రావెలర్‌ చెక్స్‌ అందిస్తున్న అతి పెద్ద సంస్థ అమెక్స్.

2005లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రావెలర్స్‌ చెక్‌ కార్డును విడుదల చేసింది, నిల్వ-విలువ కార్డు అయిన దీన్ని ట్రావెలర్‌ చెక్కులాగా, అదేవిధంగా క్రెడిట్‌ కార్డులాగా దుకాణాలలో ఉపయోగించుకోవచ్చు. "మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల" వల్ల ఈ కార్డును అక్టోబర్‌31, 2007 నుంచి నిలిపివేశారు. కార్డుదారులకు మిగిలిన మొత్తాలకు సంబంధించి వాపసు చెక్కులను జారీ చేశారు.

షీర్సన్‌/అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌[మార్చు]

దస్త్రం:Shearson AmEx Logo.png
షేర్‌సన్‌/ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ లోగో1982

ఫైనాన్సియల్ ‌సర్వీసులలో సూపర్‌ కంపెనీగా ఎదగాలన్న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కల 1980ల్లో నెరవేరింది 1981 మధ్యలో అది స్టాన్‌ఫోర్డ్‌1 వెయిల్స్ ను కొనుగోలు చేసింది, అమెరికాలో సెక్యురిటీ సంస్థలో రెండో అతి పెద్ద సెక్యూరిటీల సంస్థ అయిన వీల్స్‌ షేర్‌సన్స్‌ లీయోబ్‌ రోడ్స్‌తో కలిసి షేర్‌సన్‌/ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఏర్పాటు చేసిది. షేర్‌సన్‌ లీయోబ్‌ రోడ్స్‌ 1970ల్లో, వీల్స్ హైడెన్‌, స్టోన్‌ అండ్‌ కంపెనీ వంటి వాటిని విలీనంతో ఏర్పడింది, 1974లో షీర్సన్, హామిల్‌ అండ్‌కంపెనీ విలీనం కావడంతో షేర్‌సన్‌ హైడెన్‌ స్టోర్‌గా ఇది మారింది. ఆ తరువాత షేర్‌సన్‌ హైడెన్‌ సంస్థ లీయోబ్‌, రోడ్స్‌, హార్న్‌బ్లోవర్‌ కంపెనీతో విలీనమైంది( గతంలో లియోబన, రోడ్స్‌కంపెనీగా ఉండే ఇది 1979లో షేర్‌సన్‌ లియోబ్‌ రోడ్స్‌గా అవతరించింది. విలీనం సమయానికి సుమారు 250 మిలియన్ల మూలధనాన్ని కలిగి, సెక్యురిటీస్‌ బ్రోకరేజ్‌ పరిశ్రమకి సంబంధించి షీర్‌సన్‌ లియోబ్‌ రోడ్స్‌ సంస్థ, మెరిల్ లించ్‌ సంస్థ తరువాత స్థానంలో ఉంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ దీన్ని స్వాధీనం చేసుకున్న తరువాత దీని పేరు షేర్‌సన్‌/అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారింది.

1984లో షేర్‌సన్‌/అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 90 ఏళ్ల అనుభవం ఉన్న పురాతన ఇన్వెస్టర్‌ డైవర్సిఫైడ్‌ సర్వీసులను కొనుగోలు చేయడం ద్వారా, ఆర్ధిక సలహాదారులు మరియు పెట్టుబడి ఉత్పత్తుల సమూహాన్ని చేర్చుకుంది. అదేవిధంగా 1984లో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ పెట్టుబడి బ్యాంకింగ్‌ మరియు వ్యాపార సంస్థ లీమన్‌ బ్రదర్స్ కున్‌లీయోబ్‌ను కొనుగోలు చేసి, షేర్‌సన్‌ సంస్థలతో కలిపి, తద్వారా షేర్‌సన్‌ లీమెన్‌/అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ను రూపొందించింది. 1988లో, ఈ.ఎఫ్‌.హట్టన్‌అండ్‌ కంపెనీని కొనుగోలు చేసి దానిని 1990 వరకు షీర్సన్ లీమన్ హట్టన్ గా కొనసాగించి, ఆ తరువాత షీర్సన్ లీమన్ బ్రదర్స్ అని పేరు మార్చింది. 1993లో హార్వే గోలుబ్ అధికారం చేపట్టిన తరువాత షీర్సన్‌ రిటైల్‌ బ్రోకరేజీ మరియు ఆస్తి నిర్వహణ వ్యాపారాన్ని ప్రిమేరికాకు అమ్మేందుకు మధ్యవర్తిత్వం జరిపాడు మరియు ఆ తరువాత సంవత్సరం మిగిలిన పట్టుబడి బ్యాంకింగ్‌ మరియు సంస్థాగత వ్యాపారాలు లీమన్‌ బ్రదర్స్ హోల్డింగ్‌ Inc. యొక్క ఉపకార్యకలాపాలుగా మిగిలిపోయాయి.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1980 మరియు 1990ల ప్రారంభంలో బ్రోకరేజి మరియు పెట్టుబడి బ్యాంకింగ్ పరిశ్రమలో షేర్‌సన్‌ లీమెన్‌ బ్రదర్‌ , ఆతరువాత షేర్‌సన్‌ లీమన్‌ హట్టన్‌ ద్వారా ఏ విధంగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుందో ఈ క్రింది ఉదహరింపు తెలుపుతుంది(ఈ జాబితా సమగ్రంగా లేదు):[26]

Smith Barney Shearson
(1993, sold to Primerica. Later Smith Barney, today known as Morgan Stanley Smith Barney)







Lehman Brothers
(1994, spun-off; 2008, bankrupt - see Bankruptcy of Lehman Brothers)


Shearson Lehman Hutton
(merged 1988)
Shearson Lehman Brothers
(merged 1984)
Shearson/American Express[27]
(merged 1981)

American Express
(est. 1850)


Shearson Loeb Rhoades
(acquired 1981)
Shearson Hayden Stone
(merged 1973)
Hayden Stone, Inc. (formerly CBWL-Hayden Stone, merged 1970)

Cogan, Berlind, Weill & Levitt
(formerly Carter, Berlind, Potoma & Weill, est. 1960)



Hayden, Stone & Co.




Shearson, Hammill & Co.
(est. 1902)



Loeb, Rhoades, Hornblower & Co.
(merged 1978)
Loeb, Rhoades & Co.
(merged 1937)

Carl M. Loeb & Co.
(est. 1931)



Rhoades & Company
(est. 1905)



Hornblower, Weeks, Noyes & Trask
(merged 1953-1977)

Hornblower & Weeks
(est. 1888)



Hemphill, Noyes & Co.
(est. 1919, acq. 1963)



Spencer Trask & Co.
(est. 1866 as Trask & Brown)



Paul H. Davis & Co.
(est. 1920, acq. 1953)






Robinson Humphrey Co. (acq. 1982)



Foster & Marshall (acq. 1982)



Balcor Co. (acq. 1982)



Chiles, Heider & Co. (acq. 1983)



Davis, Skaggs & Co. (acq. 1983)



Columbia Group (acq. 1984)



Financo (founded 1971, acq. 1985)



L. Messel & Co. (acq. 1986)



Lehman Brothers Kuhn Loeb
(merged 1977)

Lehman Brothers
(est. 1850)



Kuhn, Loeb & Co.
(est. 1867)



Abraham & Co.
(est. 1938, acq. 1975)





E. F. Hutton & Co.
(est. 1904)




ఆర్ధిక సలహాదారులు[మార్చు]

సెప్టెంబర్‌30, 2005న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫైనాన్షియల్‌ అడ్వజర్స్ యూనిట్‌ను పబ్లిక్‌ ట్రేడిరగ్‌ కంపెనీ, అమిరీప్రైజ్‌, ఫైనాన్షియల్‌, Inc...గా మార్చింది. దీని కారణంగా, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క ఆదాయం 2005లో 5 బిలియన్‌ డాలర్లు తగ్గింది, అయితే 2005లో వ్యాపారం ‌ 10.5 శాతం పెరిగింది. సెప్టెంబర్‌ 30, 2005లో RSM మక్ గ్లాడ్‌రేఅమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ టాక్స్‌ మరియు బిజినెస్‌ సర్వీస్‌(TBS)ను స్వాధీనం చేసుకుంది.

సెప్టెంబర్‌18, 2007లో స్టాండర్ట్‌ ఛార్టర్‌ బ్యాంక్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ను అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి సుమారు 1.1 బిలియన్‌ డాలర్లకు, స్నేహపూర్వకంగా వదలుకొనే ఒక ప్రక్రియలో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం నియంత్రణాపరమైన అనుమతులు పొందాల్సి ఉంది. లీమెన్‌ బ్రదర్స్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఈ డీల్‌కు సంబంధించి సలహాలను అందించింది.

ప్రయాణం[మార్చు]

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1915లో ట్రావెల్‌ డివిజన్‌ను ఏర్పాటు చేసి, దీనికి గతంలో ఉన్న అనేక అంశాలను జోడించడం ద్వారా ప్రయాణాన్ని సుఖవంతం చేసింది, ఆ తరువాత మొదటి ట్రావెల్‌ ఏజెన్సీను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వ్యాపార వినియోగదారులతో పాటు, వ్యాపార ప్రయాణాలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తోంది.

ప్రచురణ[మార్చు]

అమెక్స్‌ ట్రావెల్స్+లీజర్‌, ఫుడ్‌&వైన్, ఎగ్జిక్యూటివ్‌ ట్రావెల్‌ మరియు డిపార్చర్స్ పత్రికలను ప్రచురిస్తోంది.

ప్రకటనలు[మార్చు]

1975లో, ఓగిల్వి మరియు మాథుర్‌కు చెందిన డేవిడ్‌ ఓగిల్వి అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రావెలర్స్‌ చెక్స్‌లకు ఆస్కార్‌ అవార్డు గ్రహీత కార్ల్‌ మాల్డన్‌తో రూపొందించిన డోంట్‌ లీవ్‌ హోమ్‌ వితవుట్‌ దెమ్ ‌ అన్న పేరిట సాగించిన ప్రచారం ఎంతో విజయవంతమైంది. కార్ల్‌ మాల్డన్‌ 25 సంవత్సరాల పాటు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రావెల్‌ చెక్కులకు ప్రచారకర్తగా ఉన్నాడు. UK ప్రచారంలో టెలివిజన్‌ ప్రముఖుడు అలెన్‌ వికర్‌ వ్యాఖ్యాతగా ఉన్నాడు.

ట్రావెల్‌ చెక్కుల ప్రోత్సాహానికి సంబంధించి కార్ల్‌ మాల్డన్‌ తప్పుకున్న తరువాత కూడా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ మెల్‌ బ్లాంక్, బెల్లరిన సింథియా గ్రెగరీ వంటి ప్రముఖుల సాయంతో ప్రచారం నిర్వహించింది. సాధారణంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ప్రకటనలో ప్రముఖులు వీక్షకులను ఈ విధంగా అడుగుతారు:"నీకు నేను తెలుసా?" అయితే అతడు లేదా ఆమెను గుర్తు పట్టడానికి ప్రముఖులు కొన్ని ఆధారాలను ఇస్తారు, ప్రచారంలో పాల్గనే నటుడి యొక్క పేరును అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డు మీద మినహా మరెక్కడా ప్రస్తావించరు; దీని తరువాత, ఎలా దరఖాస్తు చేయాలో వ్యాఖ్యాత పీటర్‌ థామస్‌ వీక్షకులకు వివరిస్తాడు. ప్రతి ప్రకటన కూడా ప్రముఖుడు వీక్షకులకు మరొకసారి ఈవిధంగా గుర్తు చేయడంతో ముగుస్తుంది:"ఇది లేకుండా ఇల్లు వదలకండి." 2005లో ప్రీపెయిడ్‌ అమెరికన్‌ ఎక్సెప్రెస్‌‌ ట్రావెలర్స్ చెక్స్ కార్డుకు సంబంధించి, "ఇది లేకుండా ఇల్లు వదలకండి" అనే నినాదం మార్పు చేయబడింది.

ఈ నినాదాలను చాలాసార్లు వివిధ రకాలుగా అనుకరించారు:

  • పిబిఎస్‌ చిల్డ్రన్‌స్ TV యొక్క సెసేం స్ట్రీట్ ‌ "నేను మీకు తెలుసా? /ఇది లేకుండా ఇల్లు వదలకండి" ప్రచారాన్ని అనుకరిచింది, మూడు స్కిట్‌ల, బాగా ఎదిగిన ఒక స్నేహితుని చేయి పట్టుకొని మప్పెట్ పాత్రలు ఒక రోడ్డు దాటుతుంటాయి. ఒక స్కిట్‌ ఫరగెట్‌ఫుల్‌ జోన్‌( దీన్ని రిచర్డ్‌ హంట్‌ పోషించారు)తో ఓలివియా( అలీనియా రీడ్‌ హాల్‌) యొక్క ఎదిగిన స్నేహితునిగా, ఇంకోదానిలో బెర్ట్‌ మరియు ఎర్రీ( ఫ్రాంక్‌ ఒజ్ మరియు జిమ్‌ హాన్‌సన్‌లు)తో గోర్డాన్‌( రోసోయి ఓమన్‌) బాగా ఎదిగిన స్నేహితునిలా అదే విధంగా మూడో దానిలో బిగ్‌ బర్డ్‌( కరోల్‌ స్పిన్నీ)తోపాటు బాబ్‌( బాబ్‌ మెకగ్రాత్‌)అతని ఎదిగిన స్నేహితుగాను నటించారు. ఈ మూడు స్కిట్ల పేర్లు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లా ఉండే కార్డులో ఒక మనిషి తన ఎడమ చేతిలో పట్టుకొని ఉంటాడు, అందులో వీరి పేర్లు కనిపిస్తాయి, ఆ సమయంలో ఒక నేపధ్య గాత్రం ఈ విధంగా చెబుతుంటుంది, "ఎ గ్రోన్‌-అప్‌ ఫ్రెండ్స్‌ హ్యాండ్‌. డోంట్‌ క్రాస్‌ ద స్ట్రీట్‌ వితవుట్‌ ఇట్‌."
  • ఇంకొక అనుకరణను CBS‌ గేమ్‌ షో ప్రెస్‌ యువర్‌ లక్ ‌లో, యానిమేటెడ్‌ "వామీ కారెక్టర్‌"కు "డు యు నో మీ ట్యాగ్ లైన్ ను కలిగిన అమెక్స్‌ కార్డుకు అనుకరణను చూపుతుంది, ఆ కార్డుకు దిగువన "వామీ" అని టైప్‌ చేయబడి ఉంటుంది.
  • 1984లో ఎన్నికల ప్రచార ఉపన్యాసం‌లో అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌, "పెద్ద మొత్తంలో వ్యయం చేసేవారికి మార్గం దొరికితే, వారు ఆ మొత్తాన్ని మీ పన్ను చెల్లింపు దారుల ఎక్స్ప్రెస్ కార్డు ద్వారా చెల్లిస్తారు, వారు అది లేకుండా బయటకు వెళ్లరు" అని వ్యాఖ్యానించారు.
  • 1997 నాటి చిత్రం హెర్క్యులస్‌ లో "జీరో టు హీరో" పాటలో చూపించే క్రెడిట్‌ కార్డు "గ్రేసియన్‌ ఎక్స్‌ప్రెస్‌"
  • 1989నాటి చిత్రం, మేజర్‌ లీగ్‌ లోనూ ఈ ప్రచారానికి సంబంధించిన అనుకరణ ఉంది. టెక్సిడో దుస్తులు ధరించిన క్లీవ్‌లాండ్‌ ఇండియన్స్‌, ఆ చిత్రాన్ని చూసే వీక్షకులకు ఎందుకు ప్రతి ఆటగాడు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డును పెద్దగా ఆలోచించకుండా తీసుకెళతారో ఒక్కవాక్యంలో, ఆటగాళ్ళు జాక్‌ టేలర్(టామ్‌ బెరెంజర్‌), ఎడ్డీ హారిస్‌(చెల్సీ రోస్‌), రిక్‌ "వైల్డ్‌ థింగ్‌" వాఘన్‌( చార్లీ షీన్‌), పెడ్రో సెరానో( డెన్నిస్‌ హేబర్ట్‌), మరియు రోజర్‌ డోర్న్‌( కార్బిన్‌ బెర్నసన్‌), మరియు మేనేజర్‌ లూ బ్రౌన్‌( జేమ్స్‌ గామన్‌)లు ఏకకాలంలో చెబుతారు. ఆ దృశ్యం విల్లీ "మేస్" హేన్స్‌( టెక్స్‌డోకు చెందిన వెస్లీ స్నిప్స్‌), మిగిలిన టీమ్‌ ముందు హోమ్‌ ప్లేట్‌ లోకి వంగుతూ, చేతితో తన కార్డును ఎత్తి చూపుతూ, వీక్షకులకు ఈ విధంగా చెబుతాడు: "ద అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డ్. ఏ ఇంటినైనా దొంగతనం చేస్తే, ఈ కార్డును మాత్రం వదలవద్దు.
దస్త్రం:Seinfeld superman.jpg
ద అడ్వంచర్స్‌ అఫ్ సీన్ఫెల్డ్ & సూపర్‌మాన్

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ప్రకటనలలో ప్రముఖులను ఉపయోగించడం కొనసాగిస్తోంది. ఉదాహరణకు 1990ల చివరల్లో వచ్చిన ప్రకటనలో హాస్యనటుడు జెర్రీ సినిఫెడ్‌ ప్రచారం, అదేవిధంగా 2004లో ద ఎడ్వంచర్స్‌ ఆఫ్‌ సీన్ఫెల్డ్‌ అండ్‌ సూపర్‌మ్యాన్‌ పేరిట రెండు వెబిసోడ్స్‌ కలిగిన ధారావాహిక. అదేవిధంగా 2004 చివరల్లో, అమెరికన్ ఎక్స్ప్రెస్ "నా జీవితం‌. నా కార్డ్‌" పేరిట చేపట్టిన బ్రాండ్‌ ప్రచారం‌( ఇది కూడా ఓగ్విలీ మరియు మాథుర్‌ చే రూపొందించబడింది)లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డు సభ్యుల్లో ప్రముఖులైన వారు తమ జీవితాల గురించి మాట్లాడుతుంటారు. ఈ ప్రకటనలలో కేట్ విన్స్లెట్‌, రాబర్ట్‌ డి నీరో, కెన్‌ బాటన్‌నాబే మరియు టినా ఫే, డ్యూక్‌ యూనిరర్సిటీ బాస్కెట్ బాల్‌ కోచ్‌ మైక్‌ క్రెజిఎవ్స్కి, ఫ్యాషన్‌ రూపకర్త కలెట్టీ డిన్నిగన్‌, హాస్య నటి మరియు టాక్‌ షో నిర్వాహకురాలు ఎలెన్‌ డిజనరేస్‌, గోల్ఫర్‌ టైగర్‌వుడ్స్‌, ప్రొఫెషనల్‌ స్నోబోర్డర్ షాన్‌ వైట్‌, టెన్నిస్‌ క్రీడాకారులు వీనస్‌ విలియమ్స్‌ మరియు ఆండీ రాడిక్‌, చెల్సియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ మేనేజర్‌ జోస్‌ మార్నిహో, మరియు చిత్ర దర్శకులు [[మార్టిన్ స్కోర్సెస్|మార్టిన్‌ స్కోర్‌సీ]], వెస్ ఆండర్సన్‌, ఎమ్‌. నైట్‌ శ్యామలన్‌ మరియు తాజాగా ఇటీవల కాలంలో బ్రియాన్సీ నౌలెస్ ఉన్నారు. 2007లో, "యానిమల్స్" పేరుతో రూపొందించిన రెండునిమిషాల పాటు ఉండే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రకటనలో ఎలెన్‌ డీజనరీస్‌కు అత్యుత్తమ వాణిజ్య ప్రకటనకు ఎమ్మీ అవార్డు లభించింది.

అధిక భాగం అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డుల ప్రకటనలపై అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డు యొక్క నమూనా, ముందు భాగంలో C F ఫ్రోస్ట్‌ అనే పేరుని ఉంటుంది. ఇది కల్పిత పేరు కాదు, చార్లెస్‌ F. ఫ్రోస్ట్ అనే వ్యక్తి ఒగిల్వి అండ్‌ మాథుర్‌ కంపెనీ యొక్క అడ్వర్టైజింగ్‌ ఎగ్జిక్యూటివ్‌.[28]

దీనికి అదనంగా, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, కాజ్‌ మార్కెటింగ్ ద్వార లాభపడ్డ ప్రారంభ వినియోగదారులలో ఒకటిగా ఉంది.[citation needed] 1983 నాటి ప్రోత్సాహక ప్రచారంలో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుకు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ పునరుద్ధరణకు ఒక పెన్నీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు 1.7 మిలియన్‌ డాలర్లు లభించాయి. ఈ ప్రోత్సాహక కార్యక్రమం ద్వారా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క వినియోగదారుల వాడకం 28శాతానికి పెరిగినట్లు, ఆ తరువాత ఇతర ప్రధాన కార్పొరేట్‌ కంపెనీల యొక్క మార్కెటింగ్‌ విభాగాలు గుర్తించాయి. ప్రారంభ ప్రోత్సాహాన్ని కొనసాగిస్తూ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌ ఆ తరువాత నాలుగేళ్ల పాటు చార్జ్ అగైన్స్ట్ హంగర్ కార్యక్రమాన్ని నిర్వహించింది, దీని ద్వారా పేదరికం మరియు ఆకలి‌ నివారణకు సుమారు 22మిలియన్‌ డాలర్లు సమకూరాయి. 2006లో, బానో యొక్క ప్రొడక్ట్ రెడ్‌, భాగంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌‌ రెడ్‌ కార్డ్ క్యాంపైన్‌ను సూపర్‌ మోడల్‌ గిసిలీ బుడ్‌చెన్‌ ద్వారా ప్రారంభించింది. ఈ కార్డు ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో మాత్రమే లభ్యమవుతోంది, దీని ద్వారా చేసే ప్రతి కొనుగోళ్లకు సంబంధించి AIDSకు వ్యతిరేకంగా జరిపే ఉద్యమానికి నిధులు అందుతాయి. మే 2007లో, "మెంబర్స్ ప్రాజెక్ట్" అన్న కార్యక్రమాన్ని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌‌ ప్రారంభించింది.[1] దీని ద్వారా కార్డుహెల్డర్లు ప్రాజెక్టులకు సలహాలను అందించడానికి ఆహ్వానించబడ్డారు, విజయం సాధించిన సలహాకు( శుభ్రమైన మంచి నీటిని అందించడం) అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు మిలియన్‌ డాలర్లు కేటాయిస్తుంది.

కార్యస్థానం[మార్చు]

కార్యాలయాలు[మార్చు]

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై తీవ్రవాదులు దాడులు జరిపిన తరువాత అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ టవర్స్‌లోకి ప్రవేశిస్తున్న ఇద్దరు రక్షకులు.

1980, ఏప్రిల్‌లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ప్రధాన కార్యాలయాన్ని న్యూయార్క్‌లోని 51 అంతస్థుల త్రీ వరల్డ్‌ ఫైనాన్సియల్‌ సెంటర్‌లోకి మార్చింది. సెప్టెంబర్‌11, 2001 ఘటన తరువాత అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చాల్సి వచ్చింది, వరల్డ్‌ ట్రెడ్‌ సెంటర్‌కు ఎదురుగా ఇది ఉండటం మరియు భవనాలు కూలిపోయినప్పుడు స్వలంగా దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమేపీ 2002నాటికి తిరిగి పునరుద్ధరించిన భవంతిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది.

కంపెనీకి ఫోర్ట్‌ లాడరబుల్, FL‌, సాల్ట్‌లేక్‌ సిటీ, UT, గ్రీన్స్‌బరో, NC, మరియు ఫీనిక్స్, AZలో ప్రధాన కార్యాలయాలున్నాయి. ఫ్లోరిడాలోని వెస్టన్‌లో దీని సాంకేతిక కేంద్రం ఉంది. ఫీనిక్స్‌లో దీని ప్రధాన సమాచార కేంద్రం ఉంది.

1853లో టొరంటోలో AMEX బ్యాంక్‌ ఆఫ్‌ కెనడాను స్థాపించింది, ప్రస్తుతం ఇది 3000మంది ఉద్యోగులతో అంటారియాలోని( టొరంటో యొక్క ఉత్తర శివారు‌)అంటారియో లోని మర్‌కామ్‌ లో ప్రధాన కార్యాలయంతోపాటు, అంటారియాలోని హామిల్టన్‌లో కార్యాలయాన్ని కలిగి ఉంది. బ్రియాన్ ముల్రోనీ ప్రభుత్వం నవంబర్‌ 21, 1988లో ఇచ్చిన ఆర్డర్-ఇన్-కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా ఈ సంస్థ జులై1, 1990 నుంచి బ్యాంక్‌గా కార్యకలాపాలను ప్రారంభించింది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకు కార్యకలాపాలు చేపట్టడానికి తేలిగ్గా అనుమతి ఇవ్వడానికి సమాఖ్య బ్యాంక్‌ విధానాలు లేని నేపథ్యంలో ఈ నిర్ణయం వివాదాలకు స్థానమైంది.[29] దీనికి కెనడియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌(సిబిఏ)లో సభ్యతం ఉంది మరియు కెనడా చార్టెడ్‌ బ్యాంకుల యొక్క డిపాజిట్లను భీమా చేసే సమాఖ్య సంస్థ కెనడా డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌(CDIC)లో కూడా ఇది సభ్యురాలిగా నమోదైంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇంగ్లాండ్‌లోని బ్రైటన్‌లో అమెక్స్ హౌస్ అని పిలిచే ఎనిమిది అంతస్థుల యూరోపియన్‌ సర్వీసు సెంటర్‌ సహా UKలో అనేక కార్యాలయాలు ఉన్నాయి. ఇది 1970ల్లో నిర్మించిన పెద్ద శ్వేత నీల భవన సముదాయం, దీని చుట్టూ నగరవ్యాప్తంగా మరిన్ని చిన్న కార్యాలయాలు ఉన్నాయి. అమెక్స్‌ హౌస్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలు‌, అమ్మకాలు‌, మోసాలు మరియు వర్తక సేవలతో వ్యవహరిస్తుంది. ఐరోపా‌, మధ్య ప్రాచ్యం‌, ఆఫిక్రా యొక్క ప్రధాన కార్యాలయాలు కేంద్ర లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ జిల్లాలో బెల్గ్రావియలో, బకింగ్‌హామ్‌ పాలెస్‌ రోడ్డు,SW1; బెల్గ్రావ్ హౌస్‌లో ఉంది, ఇతర UK కార్యాలయాలు ససెక్స్ లోని బర్గెస్‌ హిల్స్‌ ‌లో ఉన్నాయి. నవంబర్‌ 2009లో, అమెక్స్‌ హౌస్‌ స్థలాన్ని తిరిగి అభివృద్ధి చేయడానికి బ్రైటన్ మరియు హోవ్‌ సిటీ కౌన్సిల్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రణాళిక అనుమతిని మంజూరు చేసింది. ఎడ్వర్డ్‌ స్ట్రీట్‌ క్వార్టర్‌కు సంబంధించి కౌన్సిల్‌ ప్రణాళికకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న అమెక్స్‌ హౌస్‌ను 2016లో కూలగొట్టవచ్చని ఊహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం http://www.edwardstreet.co.ukలో లభిస్తుంది

జపాన్‌, ఆసియా ఫసిఫిక్‌ మరియు ఆస్ట్రేలియన్‌ ప్రధాన కార్యాలయాలు సింగపూర్‌లోని 16 కల్ల్యేర్ క్వే మరియు సిడ్నీలోని కింగ్‌ స్ట్రీట్‌ వార్ఫ్‌ ప్రాంతంలో ఉన్నాయి, పనిచేయడానికి అనుకూలంగా అత్యాధునికంగా నిర్మించిన ఈ భవంతులు, పర్యావరణానికి అనుకూలమైన కార్యస్థానాలను కల్పించడంతో వీటికి గ్రీన్‌హౌస్‌ హోదా లభించింది.

లాటిన్‌ అమెరికా మరియు కరేబియన్‌ విభాగాల యొక్క ప్రధాన కేంద్రం మయామీలో ఉంది.

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క ఉనికి భారతదేశంలో కూడా ప్రముఖంగా ఉంది. హర్యానాలోని గుర్‌గావ్‌, న్యూ ఢిల్లీలోని మథుర రోడ్‌లో రెండు కేంద్రాలు ఉన్నాయి. భారత దేశీయ ఆర్థికవ్యవస్థకు అనుగుణంగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారంతోపాటు, నిర్వహణ కార్యాలయం‌ వినియోగదారుల సేవల కార్యకలాపాలను అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ భారతదేశంలో నిర్వహిస్తోంది.

ఉద్యోగ సంతృప్తి[మార్చు]

  • అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేయడానికి అనువైన సంస్థలకు సంబంధించి ఫార్చ్యున్ ‌ ప్రకటించిన జాబితాలో 2008కుగాను, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు 62వ స్థానం దక్కింది, అదేవిధంగా బ్యాంక్‌ కార్డుల కంపెనీల్లో తొలిస్థానంలో ఉంది.[30] అక్టోబర్ 2008లో, అమెక్స్‌ కెనడా Inc.గ్రేటర్‌ టొరంటో'స్ టాప్ ఎంప్లాయర్స్ లో ఒకటిగా మీడియాకార్ప్ తన‌ జాబితాలో చేర్చింది, దీన్ని టొరంటో స్టార్ ‌ వార్తా పత్రిక ప్రకటించింది[31].

అమెరికా కేంద్రంగా ఉన్న వర్కింగ్‌ మదర్స్‌ పత్రిక వర్కింగ్‌ మదర్స్‌ పనిచేయడానికి అనుకూలమైన టాప్‌100 అత్యుత్తమ సంస్థల జాబితాకు సంబంధించి 2006, 2007ల్లో అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్థానం దక్కింది.

ప్రాయోజితం[మార్చు]

జూన్‌,22, 2010న అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫాల్మేర్‌ వద్ద ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌(సోకర్‌)టీమ్‌ బ్రిడ్జ్‌టన్‌& హోవ్‌ అల్బియాన్‌ యొక్క కొత్త స్టేడియమ్‌కు స్పాన్సర్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యపరంగా, ఈ స్టేడియమ్‌ను ద అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కమ్యూనిటీ స్టేడియమ్‌ అని పిలుస్తారు.[32]

యాజమాన్యం మరియు కార్పొరేట్‌ నిర్వహణ[మార్చు]

కీలకమైన నిర్వాహకులలో వీరు ఉన్నారు:‌[33]

కెన్నిత్‌ చెనౌల్ట్‌, ఛైర్మన్‌ మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌

  • డేనియల్‌ టి. హెన్రీ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌

[34]

  • ఎడ్వర్డ్‌ గిలిగన్‌, వైస్‌ ఛైర్మన్‌

ఎల్‌.కెవిన్‌ కాక్స్‌: ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ అండ్‌ క్వాలిటీ

  • అశ్వినీ గుప్తా : చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌, ప్రెసిడెంట్‌ రిస్క్‌, ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌

జాన్‌ డి. హయేస్‌ : ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్లోబల్‌ అడ్వర్టైజింగ్‌ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌

జడ్‌సన్‌ సి.లినివిల్లీ: ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కన్స్యూమర్‌ సర్వీసెస్‌

  • లూయిస్‌ పెరెంట్‌: ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ జనరల్‌ కౌన్సిల్‌

థామ్సన్‌ స్కీషిక్‌: ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కార్పొరేట్‌ అండ్‌ ఎక్స్‌ట్రనల్‌ అఫైర్స్‌

  • స్టీవ్‌ స్కీరీ: గ్రూప్‌ ప్రెసిడెంట్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ అండ్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌

డగ్లస్‌ ఈ బక్‌ మినిస్టర్‌: ప్రెసిడెంట్‌ ఇంటర్నేసనల్‌ కన్స్యూమర్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ సర్వీసెస్

  • విలియమ్‌ హెచ్‌ గ్లెన్‌: ప్రెసిడెంట్‌ గ్లోబల్‌ మర్చెంట్‌ సర్వీసెస్‌

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ యొక్క ప్రస్తుత బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు:[35]

డానియల్‌ ఎఫ్‌, అకర్‌సన్‌: మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ద కార్లైన గ్రూప్‌

  • చార్లీన్‌ బార్‌షీఫ్‌కీ: అమెరికా మాజీ ట్రేడ్‌ ప్రతినిధి
  • ఉర్సులా ఎమ్‌ బర్న్స్‌: ప్రెసిడెంట్‌ ఆఫ్‌ జిరాక్స్‌ కార్పొరేషన్‌

కెన్నెత్‌ ఐ చీనల్ట్‌: ఛైర్మన్‌ మరియు అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీ సీఈవో

  • పీటర్‌ చెర్రిన్‌, ప్రెసిడెంట్‌ మరియు COO, న్యూస్ ‌కార్పొరేషన్‌
  • వెర్మాన్‌ ఈ జోర్డాన్‌, జూనియర్: సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విత్‌ లజార్డ్‌ ఫెరీర్స్‌ అండ్‌ కంపెనీ LLC
  • జాన్‌ లీచ్‌ల్లీ: కేర్‌ క్యాపిటల్‌ LLC CEO
  • రిచర్డ్ సి. లెవిన్‌: యేల్‌ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌
  • రిచర్డ్ ఏ. మెక్‌గ్రిన్‌: లూసెంట్‌ టెక్నాలజీస్‌ యొక్క మాజీ CEO మరియు RRE వెంచర్స్‌భాగస్వామి
  • ఎడ్వర్డ్‌ డి. మిల్లర్‌: ఆక్సా, దక్షిణాఫ్రికా యొక్క మాజీ ప్రెసిడెంట్‌ మరియు CEO
  • ఫ్రాంక్‌ పి. పాప్‌ఆఫ్‌: కెమికల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌

స్టీవెన్‌ ఎస్‌. రీన్‌మండ్‌: పెప్సి కంపెనీ యొక్క మాజీ ఛైర్మన్‌ మరియు సీఈవో

  • రాబర్ట్ డి. వాల్టర్‌: ఛైర్మన్‌ మరియు CEO, కార్డియల్‌ హెల్త్
  • రోనాల్డ్ ఏ.విలియమ్స్: ఆట్నా కంపెనీ ఛైర్మన్‌ మరియు CEO

వీటిని కూడా చూడండి[మార్చు]

Script error

  • వేల్స్ ఫార్గో యొక్క చరిత్ర
  • స్టాండర్డ్ & పూర్స్ భవనం
  • ఫాల్మర్ స్టేడియమ్‌ వాణిజ్యపరంగా ఇది అమెరికన్‌ ఎక్స్ ‌ప్రెస్‌ కమ్యూనిటీ స్టేడియం గా ప్రసిద్ధి చెందింది.

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "2010 Form 10-K, American Express Company". United States Securities and Exchange Commission. 
  2. 2.0 2.1 2.2 2.3 డాలర్‌ విలువ ద్వారా అమెక్స్ ప్రజంటేషన్‌ టు ఇన్వేస్టర్స్ కీఫీ, బ్రూయెట్టీ అండ్‌ ఉడ్స్2009 డైవర్సిఫైడ్‌ ఫైనాన్సియల్‌ కాన్ఫరెన్స్‌, జూన్ 2, 2009
  3. "American Express to slash 7000 jobs". Bloomberg. Sydney Morning Herald. October 31, 2008. Retrieved 9 August 2009. 
  4. Interbrand.com
  5. "World's Most Admired Companies 2009". Fortune. Retrieved 5 August 2009. 
  6. http://www.companylogos.ws/americanexpresslogo.html
  7. పీటర్‌ జడ్‌ .గ్రాస్‌మన్‌, అమెరికన్‌ ఎక్సెప్రెస్‌‌: ద అన్‌ అఫిషియల్‌ హిస్టరీ ఆఫ్‌ ద పీపుల్‌ హ బిల్ట్ ద గ్రేట్‌ ఫైనాన్షియల్‌ ఎంపైర్‌, న్యూయార్క్, క్రౌన్‌ పబ్లిషర్స్, 1987,( రీప్రింట్‌, బెర్న్‌ బుక్స్ 2006, ఐఎస్‌బిన్‌ 1-58798-282-8 , ఛాప్టర్‌ 2)
  8. నోయల్‌ ఎమ్‌. లూమిస్‌, వెల్స్ ఫార్గో, న్యూయార్క్, క్లార్క్ సన్‌ ఎన్‌. పాటర్‌, 1968
  9. 9.0 9.1 9.2 9.3 కెనిత్‌ టి. జాక్సన్. ద ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ న్యూయార్క్‌ సిటీ. ద న్యూయార్క్‌ హిస్టారికల్‌ సొసైటీ యేల్‌ యూనివర్సిటీ ప్రెస్‌, 1995, పేజీ 55 పి 55.
  10. 10.0 10.1 10.2 న్యూయార్క్‌ సిటీ ల్యాండ్‌ మార్క్స్‌ ప్రిజర్వేషన్‌ కమిషన్‌, డిసెంబర్‌ 12, 1995, డిజిగ్నేషన్‌ లిస్ట్‌ 269, ఎల్‌పి 1932
  11. వైట్‌, నార్వెల్‌ అండ్‌ విలినిస్కీ, ఈలియట్‌: ఏఐఏ గైడ్‌ టు న్యూయార్క్ సిటీ , 4వ ఎడిషన్‌, న్యూయార్క్ ఛాప్టర్‌, అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్, క్రౌన్‌ పబ్లిషర్స్/ రాన్‌డన్‌ హౌస్‌,2000 2000. ఐఎస్‌బిఎన్‌ 0-8129-31069-8; ఐఎస్‌బిఎన్‌ 0-8129-3107-6. p.23.
  12. 12.0 12.1 వైట్‌, నార్వెల్‌ అండ్‌ విలినిస్కీ, ఈలియట్‌: ఏఐఏ గైడ్‌ టు న్యూయార్క్ సిటీ , 4వ ఎడిషన్‌, న్యూయార్క్ ఛాప్టర్‌, అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్ క్రౌన్‌ పబ్లిషర్స్/ రాన్‌డన్‌ హౌస్‌ 2000. ఐఎస్‌బిఎన్‌ 0-8129-31069-8; ఐఎస్‌బిఎన్‌ 0-8129-3107-6. p.22.
  13. హోస్ట్ విత్‌ ద మోస్ట్‌, టైమ్స్ మ్యాగజైన్‌, 9, ఏప్రిల్‌ 1956 సంచిక
  14. 14.0 14.1 Lanman, Scott; Ari Levy (2008-11-10). "American Express Gets Fed Approval to Convert to Bank". Bloomberg.com. Retrieved 2008-11-10. 
  15. "AmEx Gets Out of TARP ; Pays $340M for Warrants". wallstreetpit.com. 2009-07-29. Retrieved 2009-08-21. 
  16. "AmEx gets out of TARP". CNN. 2009-07-29. Retrieved 2009-08-21. 
  17. 17.0 17.1 Eichenbaum, Peter (17 June 2009). "Visa Clashes With Wal-Mart on $48 Billion Card Fee". Bloomberg L.P. Retrieved 9 August 2009. 
  18. TraderMark (19 June 2009). "Duopoly Visa and MasterCard Vs. Retailers - Who Wins in a Free Market?". Retrieved 9 August 2009. 
  19. McLennan, Leah (23 April 2009). "The Best Cards to Earn Qantas Frequent Flyer Points". The Sydney Morning Herald. Retrieved 9 August 2009. 
  20. Wade, Betsy (27 August 2000). "Practical Traveler". The New York Times. Retrieved 9 August 2009. 
  21. Henry. "American Express Savings Account". Interest Savings Accounts. Retrieved 2009-10-27. 
  22. Snopes.com
  23. అఫిషియల్‌ ఫ్లమ్‌ కార్డ్ వెబ్‌సైట్‌
  24. డిలార్డ్ అమెక్స్ కార్డులను అందించడంలో జిఈ మరియు అమెక్స్‌లు భాగస్వామ్యమయ్యాయి.
  25. జీఈ క్రెడిట్‌కార్డుల వ్యాపారాన్ని అమెక్స్‌ కొనుగోలు చేసింది
  26. సాలోమన్‌ స్మిత్‌ బ్రానీ నుంచి గాంబీ, రాబర్ట్, వాల్ స్ట్రీట్ డబ్యు,డబ్యు. నార్టన్‌ కంపెనీ, 1999, పేజీ.73
  27. Swallowing Hutton in 1,200 Bites. New York Times, January 10, 1988
  28. StraightDope.com
  29. న్యూమన్‌, పీటర్‌సి.జూలై 6, 2007 ద బ్రాష్‌ న్యూ కిడ్‌ ఆన్‌ ద బ్లాక్‌. (అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీ ఓపెన్స్‌ అమెక్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా అమిడ్‌ కాంట్రవర్సీ)(కాలమ్‌) ,మెక్‌లీన్‌ యొక్క జులై 30, 1990
  30. పొందబడింది. 9, అక్టోబర్‌2008
  31. "Reasons for Selection, 2009 Greater Toronto's Top Employers Competition". 
  32. "Brighton reveal sponsorship deal for new stadium". British Broadcasting Corporation. 2010-06-22. Retrieved 2010-06-24. 
  33. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌, పొందబడింది.31, మే 2010
  34. బిజినెస్‌వైర్‌: అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీ డానియల్‌ టి. హెన్రీను ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు చీఫ్‌ ఫైనాన్షియల్‌ గా నియమించింది.
  35. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌2007, వార్షిక నివేదిక, పొందబడింది. అక్టోబర్‌30, 2008

బాహ్య లింకులు[మార్చు]

మూస:American Express మూస:50 largest US banks మూస:Dow Jones Industrial Average companies మూస:Credit cards

[[Category: న్యూయార్క్‌ కేంద్రంగా ఉండే సంస్థలు]]