అమ్మదొంగా

వికీపీడియా నుండి
(అమ్మదొంగ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అమ్మదొంగ
దర్శకత్వంసాగర్
రచనవినయ్
(మాటలు)
స్క్రీన్ ప్లేరమణి
కథగొర్తి సత్యమూర్తి
నిర్మాత
  • సిహెచ్. సుధాకర్ బాబు
  • భారతీదేవి మౌళి
తారాగణం[1]
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి[1]
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి[1]
నిర్మాణ
సంస్థ
మౌళి క్రియేషన్స్
విడుదల తేదీ
1995 జనవరి 12 (1995-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

అమ్మదొంగా 1995 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా.[2] మౌళి క్రియేషన్స్ బ్యానరులో సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణ, సౌందర్య, ఆమని నటించారు. రాజ్-కోటి జంట విడిపోయిన తరువాత కోటి ఒంటరిగా సంగీతం అందించిన తొలి సినిమా ఇది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.[3]

సంక్షిప్త సినిమా కథ[మార్చు]

చక్రధర్ (కృష్ణ), తన చెల్లెలితోపాటు మరో ఇద్దర్ని హత్య చేసిన నేరంమీద జైలుకెళ్ళడంతో కథ మొదలవుతుంది. శిక్ష పూర్తయి, విడుదలై వస్తుండగా సౌందర్య కలిసి అతనితోపాటు కోటిపల్లి వెళుతుంది. అక్కడ రచ్చబండ దగ్గర తనను అన్యాయంగా జైలుకు పంపిన నలుగురు విలన్లనీ ఇప్పుడు హత్య చేసి తప్పించుకుంటానని చెబుతాడు కృష్ణ. అక్కడి ఇన్స్పెక్టర్ చరణ్ రాజ్ కృష్ణ మిత్రుడే కానీ కర్తవ్య బధ్ధుడు. ఒక విలన్ కూతురు కృష్ణ మరదలు, ఆమని. ఇక రెండు హత్యలు చేస్తాడు కృష్ణ. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి కథానాయిక సౌందర్య ఆశ్ఛర్యపరుస్తుంది. ఇక రెండో భాగంలో కృష్ణ గతం వివరించడంతో సౌందర్య నిజం తెలుసుకుంటుంది. తన అన్నను చంపింది కృష్ణ కాదని, గతంలోనూ ఆమనికి పోటీగా ఇంద్రజ ఉందని చరణ్ రాజ్ నుండి కృష్ణని కాపాడడంలో ఇద్దరు కథానాయికలూ పోటీ పడతారు. కృష్ణ తన శపథం నిలబెట్టుకుంటాడు. పగ, ప్రతీకారం కథలో ముగ్గురమ్మాయిల మధ్య కృష్ణ దాగుడు మూతలు, చచ్చిపోయిన ముగ్గురు విలన్లూ దయ్యాలై చేసే హాస్యమూ సినిమాని రక్తి కట్టించాయి.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

సినిమా పాటలు[మార్చు]

ఈ సినిమాకు కోటి సంగీతం అందించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Amma Donga film info". moviebuff.com. Retrieved 14 July 2020.
  2. MovieGQ. "Amma Donga 1995 film". Retrieved 14 July 2020.
  3. "Sankranti Superheroes of Tollywood". telugu360.com. 9 January 2016. Retrieved 6 July 2020.
  4. "Amma Donga Songs". gaana.com. Retrieved 14 July 2020.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మదొంగా