అరబిందో

వికీపీడియా నుండి
శ్రీ అరబిందో

అరబిందో (ఆగస్టు 15, 1872డిసెంబరు 5, 1950) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు.

విషయ సూచిక

[మార్చు] బాల్యము

అరబిందో ఆగస్టు 15, 1872కోల్‌కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతా దేవి. తండ్రి కె.డి.ఘోష్. వైద్యుడు. ఈయన బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్య విద్య నభ్యసించాడు.

[మార్చు] రాజకీయాల్లోంచి ఆధ్యాత్మికత వైపుకు

అరబిందో రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు క్రమక్రమంగా ప్రవేశించడం జరిగింది. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారం లో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.

[మార్చు] తాత్విక మరియు ఆధ్యాత్మిక రచనలు

పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు