అల్లుడొచ్చాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడొచ్చాడు
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ప్రత్యగాత్మ
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు

అల్లుడొచ్చాడు పి.ఎ.పి. పతాకంపై ప్రత్యగాత్మ దర్శకునిగా నిర్మించిన 1976 నాటి తెలుగు సాంఘిక చిత్రం.

కథ[మార్చు]

కమ్మటి పాటలకు పెట్టింది పేరు చంద్రశేఖరం. అతను గాయకుడిగా పెట్టుకున్న పేరు రవి. రవి పాటలంటే ప్రాణం శ్రీదేవికి. కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్న విశాఖరావు పెళ్ళి చెయ్యాలనుకుంటాడు. పెళ్ళి సంబంధాలు, హడావిడి లేకుండా విశాఖరావు ఒక ఫోన్ చేసేసరికి అల్లుడొచ్చాడు.

అతని పేరు చంద్రశేఖరమని, తన స్నేహితుడి కుమారుడని, చదువుకున్నవాడని, బుద్ధిమంతుడని విశాఖరావు అభిప్రాయం.

అతని ముద్దుపేరు రవి. రేడియోలో అధ్బుతంగా పాటలు పాడే గాయకుడని కాబోయే పెళ్ళి కుమార్తె శ్రీదేవి అభిప్రాయం.

అంతా దైవ సంకల్పం. ఎక్కదివాడినో ఇక్కడికొచ్చి పడ్డాను. అమ్మాయి బాగుంది. అయితే పాటలు పాడమని ప్రాణాలు తీస్తుంది. తనకు పాటలు పాడడం రాదు. ఎలాగో పాట గండం తప్పించుకుని ఎప్పతి కప్పుడు నాటకమాడేస్తే సరిపోతుందని రవి అభిప్రాయం.

వీడు మహా కేటుగాడు. తన పేరు పెట్టేసుకొని విశాఖరావు ఇంట్లో తిష్ట వేసాడు. వీడు దగుల్బాజీ... ఇది చంద్రశేఖరరావు అభిప్రాయం.

కొంతకాలం తర్వాత ఇద్దరూ ఏకమైపోయి విశాఖరావు ఇంట్లో నాటకమాడటం ప్రారంభించారు. రవి దేవిని ప్రేమించి, అందుకు అవసరమైన కొన్ని పాటలు పాడాడు. శేఖర్ సరోజ అనే అమ్మాయిని ప్రేమించి అమెను దక్కించుకొనేందుకు రవితో చేతులు కలిపాడు. కొంతకాలానికి సరోజ తండ్రిని చంపి వజ్రాలు కాజేసిన వ్యక్తి పేరు శేఖర్ అని తెలుస్తుంది. అక్కడ కథ మలుపు తిరుగుతుంది.

తారాగణం[మార్చు]

ప్రత్యగాత్మ

సాంకేతిక వర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

చిత్రీకరణ[మార్చు]

సినిమాలోని పాటల చిత్రీకరణ మహాబలిపురంలో జరిగింది.[1]

పాటలు[మార్చు]

  • కొడితే పులినే కొట్టాలిరా

మూలాలు[మార్చు]

  1. అన్నే, మోహన్ గాంధీ. "అన్నే మోహన్ గాంధీ-మొదటి సినిమా" (PDF). కౌముది. Retrieved 29 ఆగస్టు 2015.