అళియ రామ రాయలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| విజయ నగర రాజులు |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆరవీటి రామ రాయలు (జ.1469[1]- మ.1565) (Rama Raya) శ్రీ కృష్ణదేవ రాయలు అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, చాలా కాలం 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించినాడు. విజయనగర రాజ వంశములలో నాలుగవది, చివరిదీ ఐన అరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు (కన్నడములో అళియ అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.
విషయ సూచిక |
[మార్చు] పరిపాలన
రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉన్నది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేస్తాడు. ఇది తెలిసి రామరాయలు గండికోట కు పారిపోయి అచట విజయనగరరాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందుతాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరతాడు. ప్రతిగా తిమ్మానాయుడు "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని కబురంపుతాడు. గండికోట కు మూడు క్రోసుల దూరమున గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య భీకర యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోతుంది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపుతారు. ఈ యుద్ధపరిణామముగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అవుతాడు[2].
[మార్చు] సుల్తానులతో సంబంధాలు
ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు
- బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్షా
- అహ్మద్‌నగర్ సుల్తాను బురహాన్ నిజాం షా
- గోల్కొండ సుల్తాను జంషీద్ కులీ కుతుబ్ షా
- బీదరు సుల్తాను అలీ బరీదు
వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు. వీరు తమ తగవులు తీర్చుటకు తరచూ రామరాయల మధ్యవర్తిత్వము కోరుతుండేవారు. ఇదే అదనుగా రామరాయలు రాజ్యాన్ని కృష్ణ నదికి ఉత్తరముగా వ్యాపింపచేశాడు. తిరువాన్కూరు, చంద్రగిరి పాలకులను అణచివేశాడు.
- 1543లో అహ్మద్‌నగర్, గోల్కొండ సుల్తానులకు సహకరించి బీజాపూరు సుల్తాను నుండి రాయచూరు అంతర్వేదిని సాధించాడు..
- 1549లో అహ్మద్‌నగర్ సుల్తాన్ కు సహకరించి బిజాపూర్, బీదర్ సుల్తానుల నుండి కళ్యాణి కోటను సాధించి పెట్టాడు.
- 1557లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
- గోల్కొండ నవాబు అయిన జంషీద్ కులీ కుతుబ్ షా చివరి తమ్ముడు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చినాడు.
- 1551 లో రామరాయలూ, అహ్మద్‌నగర్ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి రాయచూరు, ముద్గల్లు, కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
- 1553లో ఏడు లక్షల ధనమును స్వీకరించి బీజాపూరు సుల్తానును అహ్మద్‌నగర్ సుల్తాను అయిన హుసేన్ నిజాం షా నుండి కాపాడినాడు.
- రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధములో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.
[మార్చు] తళ్ళికోట యుద్ధము
- ప్రధాన వ్యాసము: తళ్ళికోట యుద్ధము
సుల్తాల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. 1564 డిసెంబర్ 25 న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద యుద్దమునకు సిద్దమయినారు. 1565 జనవరి 23 న జరిగిన తళ్ళికోట యుద్దములో రామ రాయలు శత్రువుల చేతిలో మరణించినాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షిణించినది. కేవలం యుద్ద శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు.
[మార్చు] అరవీడు వంశము
యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోతాడు. అచటి నుండి రాజ్యమ్ము చక్కదిద్దు ప్రయత్నాలు చేస్తాడు. చాల సంవత్సరములు రాజ్యము చేసి, రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణముగా రామరాయలు, అతని వారసులు చారిత్రలకులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు. విజయనగర ప్రాభవము మసకబారింది. మధుర, మైసూరు, కేలాడి నాయకులు స్వతంత్రులయ్యారు. పలుచోట్ల ముస్లిమ్ సేనాధిపతులు చిన్న చిన్న ప్రాంతాలకు అధిపతులై బహమనీలకు, పిదప ముఘలులకు విధేయులుగా వ్యవహరించారు.
[మార్చు] యుద్ధానంతర చరిత్ర
సుల్తానుల మధ్య తిరిగి భగ్గుమన్న విభేదాలు విజయనగరము దాటి వారి ప్రాభవము వ్యాపింపచేయుటకు నిరోధకమైనవి. వెనువెంటనే ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ రాజ్యములను తన సామ్రాజ్యములో కలుపుకొనుటకు చేసిన ప్రయత్నాలవలన సుల్తానుల సమయము, వనరులు, సేనలు ఆత్మసంరక్షణకు వినియోగింపబడ్డాయి. విజయనగర విధ్వంసము గాంచిన సమర్థ రామదాసు తన శిష్యుడు శివాజీని హిందూ ధర్మ రక్షణకై పురిగొల్పుతాడు. ముసునూరి నాయకుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య దీక్షా తత్పరత మరాఠాలకు ప్రేరణ కల్పించాయి. మరాఠాల దాడులతో ముఘల్ సామ్రాజ్యము కూడ బలహీన పడింది. 1707లో ఔరంగజేబు మరణము తరువాత అరాచకము ప్రబలింది. తళ్ళికోట యుద్దము తరువాత 150 సంవత్సరములకు మరాఠాల బావుటా ఢిల్లీ వరకు ఎగిరింది.
[మార్చు] మూలాలు
- ↑ Vijayanagara Voices: Exploring South Indian History and Hindu Literature By William J. Jackson పేజీ.210
- ↑ కోమలి వద్ద యుద్ధం: http://books.google.co.in/books?id=FqLfdZ0gcoEC&pg=PA184&dq=gandikota&lr=#PPA184,M1
| ఇంతకు ముందు ఉన్నవారు: సదాశివ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1542 — 1565 |
తరువాత వచ్చినవారు: తిరుమల దేవ రాయలు |