అవశేషావయవము
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చాలా జంతువులలో కొన్ని అవయవాలు నిరుపయోగంగా ఉంటాయి. ఆ జీవులతో సన్నిహిత సంబంధం ఉన్న మరికొన్ని జీవులలో ఈ అంగాలు బాగా అభివృద్ధి చెంది ఉపయోగకరంగా ఉంటాయి. క్షీణించి నిరుపయోగంగా ఉన్న అలాంటి అవయవాలను అవశేషావయవాలు (Vestigial organs) అంటారు. ఆ అవయవాలు ఒకప్పుడు ఆయా జీవుల పూర్వీకులలో ఉపయోగకరంగా ఉండేవని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
ఉదాహరణలు [మార్చు]
- మానవులు: మానవ శరీరము 'అవశేషాల ప్రదర్శనశాల' అని విల్డన్ షీమ్ శాస్త్రవేత్త అభివర్ణించాడు. ఉదా.: ఉండుకము, నేత్రావరణ పటలం, జ్ఞాన దంతాలు, పురుషులలో చూషకాలు, అనుత్రికం, చెవిడొప్పను కదిల్చే కండరాలు, స్త్రీలలో గుహ్యాంగాంకురం, క్షీణించిన రదనికలు.
- పక్షులు: కివి లాంటి ఎగరలేని పక్షులలో క్షీణించిన రెక్కలు.
- గుర్రం: కాలులో క్షీణించిన స్ప్లింట్ ఎముక.
- కొండచిలువ: క్షీణించిన చరమాంగాలు, ఖఠివలయం.