అష్టలక్ష్ములు
వికీపీడియా నుండి
హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
ఈ అష్టలక్ష్ములు
- ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
- ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
- ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
- గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
- సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
- విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
- విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
- ధనలక్ష్మి : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.
ప్రార్ధన [మార్చు]
రంగాపురం దేవాలయంలో గజలక్ష్మి మూర్తి
ఒక ప్రార్ధన:
అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం
"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది మరొక ప్రసిద్ధ ప్రార్ధన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్ధనా గీతాలున్నాయి.
ఇవికూడా చూడండి [మార్చు]
మందిరాలు [మార్చు]
- బెంగళూరులో యశ్వంతపూర్ వద్ద, "హరేకృష్ణ" మందిరానికి ఎదురుగా గురువాయూరప్ప కృష్ణమందిరం ఉంది. అక్కడ అష్టలక్ష్ములను ప్రతిష్టించారు.
- హైదరాబాద్ లో కొత్తపేట దగ్గర వాసవీ కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయం కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నెలకొల్పారు.