అష్టావక్రుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అష్టావక్ర మహర్షి
Ashtavakra.jpg
19వ శతాబ్దపు తొలినాళ్లలో పాట్నాలో చిత్రించబడిన అష్టావక్రుని చిత్రం.
గురువు ఆరుణి
సాహిత్య రచనలు అష్టావక్ర గీత
ప్రముఖ శిష్యుడు (లు) జనకుడు, యజ్ఞావ్యల్కుడు

పూర్వకాలమున ఏకపాదుడను బ్రాహ్మణుడు ఉండెడివాడు.అతడు నిరంతర తపోనిరతుడు.ఆయన భార్య సుజాత .ఆమె ఉత్తమురాలు.భర్తకెన్నో ఉపచారుములు చేసెడిది. ఏకపాదుడు వేదవేత్త కావడం వల్ల ఆయన వద్దకు ఎందరో బ్రహ్మచారులు వచ్చి అధ్యయనము చేయసాగారు. శిష్యకోటితో సుజాత ఏకపాదులు హాయిగా కాలక్షేపము చేయుచున్నారు.సుజాత భర్త అనుగ్రహం చేత గర్భవతి అయినది.ఆమె గర్భమందుండగనే వేదములు వల్లెవేయసాగాడా బాలుడు.

తండ్రి శాపం[మార్చు]

ఒకనాడు తండ్రి వల్లె వేయుచుండగా గర్భమందున్న ఆ బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పినదని పలికినాడు.అంతే కాదు నిద్రాహారము లేకుండ శిష్యులచే అధ్యయనం చేయించడం మంచిదికాదని తండ్రిని తప్పుపట్టి నాడు.వక్రభాష్యం చేసినాడు.తనకు పుట్టబోవు కుమారుడు దివ్యమణి మోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు.కాని పుట్టకుండానే తనను తప్పుపట్టినాడని ,వక్రముగ పల్కినాడని ఎనిమిది వంకరలతో పుట్టమని శపించాడు.ఆ బాలుడు తల్లి కడుపున పెరుగుతున్నాడు.

తండ్రికి శిక్ష[మార్చు]

సుజాత ఒకనాడు ఏకపాదుని పిలిచి నాథా నెయ్యి, ధాన్యము,నూనె తెండని చెప్పినది.అంత ఏకపాదుడు వాటి నిమిత్తమై జనక చక్రవర్తి వద్దకు వెళ్లాడు.ఆసమయాన అచ్చట ఒక పందెము జరుగుచుండెను.వరుణుని కుమారుడగు వందితో వాదము చేసి గెలిచినవారికి సర్వమును ఇచ్చెదను.ఓడినావారు జలమజ్జితులై వుండవలెను.విన్నాడు ఏకపాదుడు.వందితో వాదమునకు తలపడి ఓడిపోయి నియమం ప్రకారం జలమజ్జితుడై వుండిపోయాడు.

అష్టావక్రుడు జన్మించుట[మార్చు]

సుజాత కుమారుని ప్రసవించింది.పుట్టిన ఆ బిడ్డ ఎనిమిది వంకరలతో ఉన్నాడు.ఆ కారణమున అతనికి అష్టావక్రుడని నామకరణ చేశారు.అదే సమయాన సుజాత తల్లి ఒక పుత్రుని కన్నది. ఆమె ఉద్ధాలకుని భార్య .ఉద్ధాలకుడు తన కుమారునకు వ్వేతకేతు అని నామకరణం చేశాడు.అష్టావక్రుడు,శ్వేత కేతు బాల్యయు నుండి ఉద్ధాలకు మహర్షి వద్ద అధ్యయనం చేయసాగారు. అష్టావక్రుడు ఉద్ధాలకుని తండ్రిగా శ్వేతకేతుని సోదరునిగా భావిస్తూ విద్యాధ్యయనం సాగిస్తున్నాడు.

అష్టావక్రుని వాదన[మార్చు]

కొంత కాలమునకు అసలు విషయం తెలిసికొని జల మజ్జితుడగు తండ్రిని తీసికొని రావలెనని తల్లి ఆశీర్వాదము తీసికొని శ్వేతకేతుని వెంటబెట్టుకుని తిన్నిగా జనకమహారాజు ఆస్ధానమునకు బయలుదేరి వెళ్ళాడు.తిన్నగా జనకుని ఆస్ధాన ద్వారము కడచేరి లోనికి పోబోగా ద్వారపాలకులు నివారించారు.వృద్ధులకే గాని బాలురకు ప్రవేశార్హత లేదని పలికారు. అంత అష్టావక్రుడు అనేక శాస్త్ర విసయములు తెలిపి దారినిమ్మని పలికాడు.మారు మాట్లాడక ద్వారపాలకుడు అష్టావక్రునకు దారి ఇచ్చారు..అష్టావక్రుడు తిన్నగా జనకమహారాజు వద్దకు వెళ్ళి వందితో వాదింతునని పలికాడు.బాలుడవు నీవేమి వందితో వాదించడమేమి కుదరదన్నాడు.అంత అష్టావక్రుడు జనకునితో వాదించి తన శక్తి సామర్థ్యాలు తెలియజేశాడు.జనకుడు వాదనకు అంగీకరించాడు.వంది అష్టావక్రుల మధ్య వాద ప్రతివాదములు ప్రారంభమయాయి.అనేక విషయాలపై వాదన సాగుతుంది.చివరకు వందని బాలకుడగు అష్టావక్రుడే ఓడించాడు. గెలుపొందిన ఆ బాలకుని అభినందించి జనక మహారాజు మహాజ్ఞానీ అజ్ఞాపింపుమని అర్ధించగా అష్టావక్రుడు తన తండ్రిని విడిపించి వందిని జలమజ్జితుని చేయుమని ఆదేశించాడు

తండ్రిని విడిపించుట[మార్చు]

ఇక్కడ ఒక రహస్యమున్నది.వంది వాదమున ఓడిన వారిని ఎవరిని జలమజ్జితులను చేసి బాధించలేదు.వారందరిని తన తండ్రి వరుణుడు చేయు యజ్ఞమునకు పంపినాడు.ఈ విషయము అష్టావక్రునకు తెలిసి అతనిని కీర్తించినాడు.అష్టావక్రుని యశస్సు నలుదిశల వ్యాపించినది. ఏకపాదుని,అష్టావక్రుని జనక చక్రవర్తి సత్కరించాడు.అదైత వేదాంత రహస్యములను తెలిసికొన్నాడు.

అష్టావక్రుని శాపవిముక్తి[మార్చు]

తండ్రి అష్టావక్రుని పితృభక్తికి ఎంతగానో సంతసించాడు.పాండిత్య ప్రకర్షకు గర్వపడ్డాడు.నది యందు సాన్నం చేయింయి తన కుమారుని వంకరులు పోవునట్లు చేశాడు.అంత అష్టావక్రుడు సుందరుడైనాడు.ఇంటికి వచ్చి తల్లితండ్రులకు సేవ చేయుచూ కాలక్షేపం చేయసాగాడు. వివాహ వయస్సు రాగనే తండ్రి కుమారునకు పెండ్లి చేయ తలపెట్టారు.తన నిర్ణయమును కుమారునకు తెలియజేశాడు.కుమారుడు అంగీకారము తెలిసి వదాన్య మహర్షి కుమార్తెయగు సుప్రభ ను వివాహము చేసికొన్నాడు.భార్యను వెంటబెట్టుకొని ఆశ్రమమునకు వచ్చి తపస్సు నందుండిపోయాడు. సుప్రభ అష్టావక్రుల గృహస్థాశ్రయం అద్వితీయముగా,ఆదర్శప్రాయంగా సాగుతుంది.పుత్రులను పొందాడు.

గోపికల పూర్వ వృత్తాంతం[మార్చు]

ఒకనాడు అష్టావక్రుడు జలమధ్యమున ఉండగా అచ్చటికి రంబాధి అప్సరలు వచ్చి నృత్యగీతములను అష్టావక్రునకు వినిపించారు.అష్టావక్రుడు సంతోషించి ఏమి కావాలని వారిని అడుగగా వారందరూ విష్ణుమూర్తితోడి పొందుకోరారు. విని అష్టావక్రుడు కృష్ణావతార కాలాన మీరు గోపికలై జనించి అతనిని సంగమించగలరని పల్కాడు. అనంతరము అష్టావక్రుడు పుష్కర తీర్ధమున తపస్సు చేయసాగాడు.మనస్సు పరమాత్మయందు లయం చేసి శ్రీకృష్ణుని దర్శించి ఆయన పాదములపై పడి మరణించాడు. మరణానంతరం అతడు గోలోమునకు పోయి మోక్షము పొందాడు.

అష్టవక్రుని పూర్వజన్మ[మార్చు]

పూర్వ జన్మమున అష్టావక్రుడు దేవలుడనువాడు .దేవలుడు మాలావతి అను పేరు గల కన్యను వివాహము చేసికొని సంతానమును బడసి విరాగియై తపస్సు చేయసాగేను.అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగేను.ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయుటకు రంభను పంపగా చలింపలేదు .అందుకు రంభ కోపించి మరు జన్మమున నీవు అష్టావక్రుడవై జన్మించుమని శపించినది. అనంతరం రంభ పశ్చాత్తప్తయై శాపవిమోచనము కూడ తెలియజేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయినది. ఆ దేవలుడే ఈ అష్టావక్రుడు. అష్టావక్రుడు జనకమహారాజుతో చేసిన వేదాంత చర్చయే అష్టావక్ర సంహిత.

అష్టావక్రుడు..........వివరము[మార్చు]

ఏకపాదునికి సుజాతయందు పుట్టిన కొడుకు. ఇతఁడు గర్భమున ఉండుకాలమున అనవరతము శిష్యులచే వేదాధ్యయనము చేయించుచు ఉండు తన తండ్రితో శిష్యులు నిద్రలేమింజేసి జడమతులై చదువు తప్పఁజదువుచున్నారు అనిన, తండ్రి కోపగించి 'నీవు అధ్యయనంబునకు వక్రముగా పలికితివి కావున అష్టవక్రుండవై జన్మింపుము' అని కొడుకునకు శాపము ఇచ్చెను. ఇతఁడు అతితేజస్వియును లోకపూజితుఁడును అయి ఉండెను. ఈతని కురూపము చూచి ఒకప్పుడు రంబాధ్యప్సరసలు నవ్వినందున, వారు దొంగలచే పట్టుపడునట్లు శపింపఁబడిరి. అది కారణముగ కృష్ణనిర్యాణానంతరము గోపికారూపులై ఉండిన అతని భార్యలు అగు నప్సరసలు అర్జునిని వెంట వచ్చునవసరమున దొంగలచే పట్టుబడిరి. మూలం: పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]