ఆంధ్రా బ్యాంకు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆంధ్రా బ్యాంకు
తరహా పబ్లిక్
స్థాపన 1923, నవంబర్ 20
ప్రధానకేంద్రము Flag of India.svg హైదరాబాదు, భారతదేశం
కీలక వ్యక్తులు కే.రామకృష్ణన్, ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
పరిశ్రమ ఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
ఉద్యోగులు 13,224 (30.09.07 నాటికి)
వెబ్ సైటు http://www.andhrabank.in
Andhra bank.svg

భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకును 1923, నవంబరు 20న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుదు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య మొట్టమొదట మచిలీపట్నం లో స్థాపించాడు. 1980లో ఈ బ్యాంకు జాతీయం చేయబదింది. 1981లో క్రెడిట్ కార్డు లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్దు వ్యవస్థ ను ఈ బ్యాంకు పరిచయం చేసింది. 2003 నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. 2007లో బయెమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది. సెప్టెంబర్ 2007 నాటికి ఈ బ్యాంకు 1,289 (Rural-396, Semi-urban-376, Urban-338, Metro-179)బ్రాంచీలతో 99 ఎక్స్‌టెంషన్ శాఖలతో, 37 సాటిలయిట్ ఆఫీసులతో,505 ఏటిఎంలతో, 22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో విస్తరించి వుంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 13.72 మిలియన్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభం నుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయీకరణం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది. ఆంధ్రుల అభిమాన బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్.

వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]