ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం

వికీపీడియా నుండి

ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం (Andhra Pradesh Official Language Commission)[1] అధికార భాషా చట్టం 1966 ప్రకారం ఏర్పాటయిన సంస్థ. ఈ చట్టం 14.05.1966 లో అమలులోకి వచ్చింది. 1974 లో ఈ సంఘం ఏర్పాటైంది. ఇది పరిపాలనారంగంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసింది. పరిభాష రూపకల్పన, ప్రభుత్వ శాఖలలో అమలుకు కృషిచేసింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం స్వతంత్రప్రతిపత్తికోల్పోయి, 2010 లో సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

మాతృభాషను కాపాడుకోవటానికి ఉత్తర ప్రదేశ్ 1951లో, ఒరిస్సా 1954 లో, తమిళనాడు 1956లో, అస్సాం 1960 లో, గుజరాత్ 1961, కర్ణాటక 1963 లో, మహారాష్ట్ర 1965 లో, ఆంధ్రప్రదేశ్ 1966 లో తమ భాషని అధికార భాషగా చట్టాలను చేశాయి. ఆంధ్రప్రదేశ్ లో మొదటగా 23 శాఖలలో మండలం మరియు దానికన్నా తక్కువ స్థాయిలోని కార్యాలయాలలో, కొన్ని శాసనేతరమైన అంశాలకు మాత్రమే తెలుగు ప్రవేశ పెట్టబడింది. 1967,1968 లో మరి కొన్ని శాఖలలో తెలుగు వాడకాన్ని విస్తరించింది.1971-73 లో పశుసంవర్థక, వ్యవసాయం, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్తులు, దేవాదాయ శాఖ, విద్యా శాఖలలో తెలుగును ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 1974లో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పాటయింది. దీనిలో అధ్యక్షుడు, నలుగురు సభ్యులు వుంటారు. సచివాలయంలోని ఒక ఉపకార్యదర్శి ఈ సంఘానికి కార్యదర్శి గా వుంటారు. ఇది ప్రభుత్వ అవసరాలకు తెలుగు వాడటానికి సంబంధించిన ప్రగతిని సమీక్షించి, తెలుగు భాషా వినియోగానికి సిఫారసులు చేస్తుంది. 1974 నుండి 1979 వరకు రాష్ట్ర స్థాయిలో తెలుగు అమలు విషయమై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 మే 28, నందమూరి తారకరామారావు జన్మదినాన్ని అధికార భాషా దినోత్సవముగా ప్రకటించారు. 2004లో స్వభాను ఉగాది న అధికార భాషా సంవత్సరము గా ప్రకటించారు.

[మార్చు] సంస్థ ఆకృతి

1974లో ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం ఏర్పాటయింది. దీనిలో అధ్యక్షుడు, నలుగురు సభ్యులు వుంటారు. సచివాలయంలోని ఒక ఉపకార్యదర్శి ఈ సంఘానికి కార్యదర్శి గా వుంటారు. ఇది ప్రభుత్వ అవసరాలకు తెలుగు వాడటానికి సంబంధించిన ప్రగతిని సమీక్షించి, తెలుగు భాషా వినియోగానికి సిఫారసులు చేస్తుంది. జిల్లా స్థాయిలో సమీక్షా సంఘాలకు కలెక్టరు అధ్యక్షులుగా 8 మంది అధికారిక సభ్యులు 15 నుండి 20 మంది అనధికారిక సభ్యులు వుంటారు. అధికార భాషా సంఘం జిల్లాలలో పర్యటించి, అధికారులతో సమావేశాలు నిర్వహించి, తెలుగు వుపయోగించడంలో సాధక భాధకాలను తెలుసుకొని తగు సూచనలు ఇస్తుంది. ఈ సంఘం కార్యాలయం చిరునామా దక్షిణ హెచ్ నూతన భవనము, జి బ్లాక్ ఎదురుగా, సచివాలయం, హైదరాబాదు-500022. 2010 లో సంస్థ ని సాంస్కృతిక శాఖలో విలీనం అయ్యింది.

[మార్చు] సంస్థ కార్యక్రమాలు

2003 లో తిరుపతిలోని మహతీ సభాంగణంలో అధికార భాష దినోత్సవం జరిగింది. భాషా సదస్సు, పండిత సదస్సు, వక్తృత్వ సదస్సు, సత్కార మహోత్సవం నిర్వహించడం జరిగింది. 15% శాతం అల్పసంఖ్యాక వర్గాలుగా వున్న సాహెబులకొరకు 13 జిల్లాలలో ఉర్దూని రెండవ అధికార భాషగా ప్రకటించారు. అవి కర్నూలు, హైద్రాబాదు, కడప, నిజామాబాదు, అనంతపురం, రంగారెడ్డి, మెదక్, గుంటూరు, చిత్తూరు, మహబూబ్ నగర్, అదిలాబాదు, వరంగల్ మరియు నెల్లూరు.

[మార్చు] లక్ష్యాలు

2004 నాటివి

  • దాదాపు 40 శాతం జనాభా అనగా రెండు కోట్ల నలభై లక్షల తెలుగు వారున్న తమిళనాడులో తెలుగుని రెండవ అధికార భాషగా గుర్తించుట
  • జాతీయ అధికార భాషగా తెలుగుని గుర్తించడానికి సిఫారస్ చేయడం
  • 2003-2004 నుండి తెలుగుని పాఠశాల విద్యలో త్రిభాషా సూత్రానికి అనుగుణంగా అమలు చేయడం
  • తెలుగు భాషలో కృషి చేసిన రచయితలు పండితులకు సన్మానం
  • ప్రభుత్వ శాఖలలో తెలుగు వాడటానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం

[మార్చు] అధ్యక్షులు

మొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలక్రిష్ణయ్య పనిచేశాడు. ఇటీవలికాలంలో ఎబికె ప్రసాద్2005 నుండి 2009 వరకు అధ్యక్షులుగా పనిచేశాడు. చూడండి పూర్తి అధ్యక్షుల జాబితా

[మార్చు] భాషాభివృద్ధి

  • భారత రాజ్యాంగం తెలుగు అనువాదం మరియు ప్రచురణ
భారత రాజ్యాంగం
కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం

[మార్చు] బయటి లింకులు


[మార్చు] మూలాలు

  1. అధికార భాషా సంఘం
  2. కంప్యూటర్లలో తెలుగు వాడకం వివిధ సాఫ్ట్ వేర్ల పరిచయం పేజీలో Training manual (Telugu) అన్న వరుసలో పిడిఎఫ్ ఫైలు చూడండి
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె