ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ఆర్టీసీ (ఆర్.టీ.సీ.) | |
|---|---|
![]() |
|
| తరహా | ప్రభుత్వ రంగం |
| స్థాపన | ఏప్రిల్ 16, 1853, 1951లో జాతీయం చేయబడినది |
| ప్రధానకేంద్రము | హైదరాబాద్, భారత్ |
| Area served | ఆంధ్ర ప్రదేశ్ |
| కీలక వ్యక్తులు | యమ్. సత్యనారాయణ రావు, చైర్మన్, ఆర్టీసీ వై.యస్. రాజశేఖరరెడ్డి |
| పరిశ్రమ | బస్ సేవలు |
| ఉత్పత్తులు | బస్ రవాణా, సరకుల రవాణా, సేవలు |
| రెవిన్యూ | ▲ INR 1545 Crores (~30.5BUSD) |
| నినాదము | "జాతీయ జీవన రేఖ", "lifeline of the nation" |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.యస్.ఆర్.టి.సి), ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999లో నమోదైనది.[1] 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 19,000 బస్సులతో ప్రతి రోజు 1.2 కోట్లమందిని, 1 లక్షా 17 వేలమంది సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది.
రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను మరియు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు మరియు పాండిచ్చేరిలకు కూడా బస్సులు నడుపుతున్నది.
విషయ సూచిక |
[మార్చు] రాష్ట్రంలో ఆర్.టి.సి. ప్రాముఖ్యత
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రజా జీవితంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఉనికి ప్రతి చోటా ప్రముఖంగా కనిపిస్తుంది. రాష్ట్రంలోని గ్రామాలలో షుమారు 26,000 [2]గ్రామాలకు ఆర్.టి.సి. బస్సుల ద్వారా 24,336 గ్రామాలకు బస్సు సదుపాయం ఉన్నదన్న [3] విషయాన్ని బట్టి ఆర్.టి.సి. ప్రజా జీవితంలో ఎంతగా భాగమయ్యిందో అంచనా వేయవచ్చును. "పల్లె పల్లెకూ బస్సు" వంటి అనేక పథకాల ద్వారా ఈ నెట్‌వర్క్ మరింత విస్తృతమయ్యింది. ప్రపంచంలో అతి పెద్ద రవాణా సంస్థగా దీనికి గుర్తింపు లభించింది.
ఆర్.టి.సి. ఒక ప్రభుత్వ యాజమాన్యంలో నడచే వ్యాపార సంస్థ అయినా గాని ప్రజలు దీనిని ప్రభుత్వం ముఖచిత్రంగా భావిస్తారు. కనుకనే ఆర్.టి.సి. ఛార్జీలు పెరిగితే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఏవయినా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగితే అందులో భాగంగా ఆర్.టి.సి. ఆస్తులకు నష్టం జరగడం చాలా సార్లు సంభవించింది. ఆర్.టి.సి. ఇంతటి ప్రాముఖ్యాన్ని పొందడానికి కొన్ని కారణాలు:
- సామాన్యులకు అందుబాటులో ఉన్న ఛార్జీలు
- మూల మూల గ్రామాలకూ ప్రయాణ సదుపాయాలు
- ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక బస్సులు - జాతరలు, పెళ్ళిళ్ళు, రాజకీయ పార్టీ సమావేశాలు వంటివాటికి
- పెరుగుతున్న ప్రయాణావసరాలకు అనుగుణంగా ఆర్.టీ.సీ. అనేక మార్పులను ప్రవేశపెట్టింది.
- స్థానికీకరణ మరియు అనేక వ్యాపార సంస్థలకు అసాధ్యమైన నెట్‌వర్క్. పల్లెటూరులోని జనులకు ఆర్.టి.సి. ఉద్యోగులు పరాయివారిలా అనిపించరు.
[మార్చు] చరిత్ర
[మార్చు] ఎర్ర బస్సు పుట్టుక
తెలంగాణాను నైజాం ప్రభువులు పాలించే రోజులలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నైజాంలో అప్పటికే "నిజాం స్టేట్ రైల్వేస్" అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో భాగంగానే 1932 జూన్‍లో "రోడ్ ట్రాన్స్‌పోర్టు" ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది. నవంబర్ 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు హైదరాబాద్ రాష్ట్ర రవాణాసంస్థగా ఉండేది.
[మార్చు] ప్రెవేటు రవాణా జాతీయం
దేశస్వాతంత్ర్యం, ఆ తర్వాత తెలంగాణా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రెవేటు రవాణాను జాతీయం చేస్తూ 1958 జనవరి 11న "ఆంధ్ర ప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ" ఏర్పాటైంది. ఆంధ్ర ప్రాంతంలో దశల వారీగా ప్రైవేటు రవాణాను జాతీయం చేశారు. 1950లో కేంద్రప్రభుత్వం ఆర్.టి.సి. చట్టం చేసింది. దాని ప్రకారం ఆర్టీసీలో రాష్ట్రం, కేంద్రం 2:1 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి 1988 వరకు ఈ నిష్పత్తి కొనసాగింది. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రం కూడా ఆర్టీసీకి నిధులు కేటాయింపు నిలిపి వేశాయి. అంత వరకు రాష్ట్రప్రభుత్వం 140 కోట్లు, కేంద్రం 70 కోట్లు కలపి మొత్తం 210 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పెట్టుబడి పెట్టాయి. 1989నుంచి ఈ పెట్టుబడుల కోసం ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది.
[మార్చు] విస్తరణ
ప్రస్తుతం 95 శాతం బస్సు రూట్లు, లక్షా 17వేల సిబ్బంది, 19700 బస్సులు, 212 డిపోలు మరియు 202 కోట్ల రూపాయల మూల ధనంతో ఆర్టీసీ విస్తరించింది. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ 8వేల కోట్ల రూపాయలపైమాటే.
[మార్చు] సంస్థ లక్ష్యాలు
ఆర్.టి.సి. సంస్థ క్రింది బాధ్యతలను నిర్వహించాలని వారి అధికారిక వెబ్‌సైటులో ఇవ్వబడింది[3].
- ముఖ్య బాధ్యతలు
- ప్రయాణీకులకు పరిశుభ్రమైన, అనుకూలమైన, సమయానుగుణమైన ప్రయాణ సదుపాయాలను, సరసమైన ఛార్జీలతో అందించడం
- ఆర్ధికంగానూ, మానవతా యుతంగానూ ఉద్యోగులకు సంతృప్తి కలిగే విధానాలు
- ఆర్ధిక స్వయంసమృద్ధితో నిర్వహణ, ప్రగతి
- సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని సాధించడం
- విధానాలు
- వ్యాపారాన్ని నిజాయితీగా, ప్రావీణ్యంగా, సత్ఫలితాలనిచ్చేలా నిర్వహించడం
- తమ వ్యాపారానికి పట్టుకొమ్మలైన వినియోగదారులను (ప్రయాణీకులను) గౌరవిస్తూ వారికి సంతృప్తి కలిగేలా నాణ్యమైన సేవలను అందించడం
- సాంకేతికంగాను, ఆర్ధికంగాను నూతన విధానాలను పరిశీలించి అనుసరించడం
- ప్రణాళికాబద్ధంగా, తగు శిక్షణతోను, సహకారంతోను ఉద్యోగుల ఉత్పాదకతను, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం
- సంస్థ ఉద్యోగుల, వారి కుటుంబాల శ్రేయస్సుకై కృషి చేస్తూ సంస్థకు వారి తోడ్పాటును పెంపొందించుకోవడం
- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తూ, స్వయం సమృద్ధిని సాధించడం
- పర్యావరణానికి, సమాజానికి అవసరమైన విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ. కాలుష్య నివారణ
- వ్యాపారంలో ప్రభుత్వ విధానాలను సంపూర్ణంగా అనుసరించడం
- బస్సు రావాణా వ్యవస్థ నిర్వహణలో ఉన్నతమైన స్థాయిని సాధించి సమాజంలో సముచితమైన గౌరవమైన స్థానాన్ని పొందడం
[మార్చు] ప్రధాన గణాంకాలు
1958లో ప్రారంభమైన ఆర్.టి.సి. సంస్థ వనరులు 2008 మే నెల నాటికి ఇలా ఉన్నాయి[3]
- వనరులు
- వాహనాలు : 20,273
- ఉద్యోగులు : 1,13,567
- ప్రభుత్వం పెట్టుబడి : 201 కోట్లు
- మొత్తం డిపోలు : 202
- విభాగాలు : 23 రీజియన్లు, 7 జోనులు
- మండలం బస్సు స్టేషన్లతో కలిపి మొత్తం స్టేషన్లు : 523+242 = 765
- బస్సు షెల్టర్లు (జన్మ భూమి షెల్టర్లతో కలిపి): 1880
- సగటు రోజు ఆదాయం 1175 లక్షల రూపాయలు
- సగటు రోజు ప్రయాణ మార్గం - 73 లక్షల కిలోమీటర్లు
- సగటు రోజు ప్రయాణీకులు (ఏప్రిల్ 2008 నెలకు) : 140 లక్షలు
- మొత్తం రూట్లు : 7604
- కలుపుతున్న గ్రామాలు : 24,336
- ఇంకా చేరని గ్రామాలు : 2,938
- కంప్యూటరీకరించిన డిపోలు : 202
- నిర్వహణా గణాంకాలు (2008 మే నాటికి)
- ఫ్లీటు వినియోగం : 99.51 %
- Crew Utilization : 166 కి.మీ.
- ఉద్యోగుల ఉత్పాదకత (Employees Productivity) : 59 కి.మీ.
- సమయ పాలన (Punctuality) - ఏప్రిల్ 2007 : 94.37 %
- ఇంధనం ఎఫిషియన్సీ: లీటరుకు 5.27 కి.మీ.
- ఇంజిన్ ఆయిల్ ఎఫిషియన్సీ : లీటరుకు 4579 కి.మీ.
- టైరు ఉపయోగ కాలం : 1.68 లక్షల కి.మీ.
- ప్రతి 10,000 కి.మీ.కు బ్రేక్-డౌన్ రేటు : 0.10
- ప్రతి లక్ష కిలోమీటర్లకు ప్రమాదాలు (ఏప్రిల్ 2008): 0.12
- వినియోగంలో ఉన్న ప్రతి బస్సుకు స్టాఫ్ : 6.15
- ప్రతి కిలోమీటరుకు ఆదాయం (2007-08) : 1762 పైసలు
- ప్రతి కిలోమీటరుకు ఖర్చు (2007-08) : 1706 పైసలు
- 2007-2008 లాభం : 131 కోట్లు రూపాయలు
[మార్చు] వ్యవస్థ స్వరూపం
[మార్చు] వనరులు
[మార్చు] కార్మికులు
[మార్చు] బస్సులు
[మార్చు] బస్సు స్టేషనులు
[మార్చు] వ్యాపార భాగస్వాములు
[మార్చు] ఇతర వనరులు
[మార్చు] సేవలు
[మార్చు] ప్రయాణ సదుపాయాలు
[మార్చు] ఆధునిక బస్సులు
[మార్చు] కంప్యూటరీకరణ
[మార్చు] డయల్ 155220
దేశంలో ఏ ప్రాంతంలోని రోడ్డు రవాణాకు సంబంధించి అయినా ,దేశంలో ఏ ప్రాంతంలోని బస్సైనా, అది ఏ రాష్ట్ర రవాణాసంస్థకు చెందినదైనా సరే ఆ బస్సు ఎప్పుడు బయలుదేరింది.. ప్రస్తుతం ఎక్కడ ఉంది.. ఎంతసేపట్లో ఫలానా బస్సుస్టాప్/స్టేషన్‌కు చేరుకొంటుంది.. టిక్కెట్ రుసుం ఎంత? ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి వంటి వివరాలన్నీ ఇకపై కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో తెలుసుకునే సౌకర్యం త్వరలో రాబోతోంది. తదుపరి దశల్లో ఇదే నంబరు ద్వారా దేశంలోని మెట్రోరైళ్ల రాకపోకల సమాచారం కూడా తెలుసుకునేలా అనుసంధానించనున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ 'నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు హెల్ప్‌లైన్'కు సంబంధించి దేశమంతటా కాల్‌సెంటర్లను ఏర్పాటుచేస్తోంది. ఇందుకోసం ఒక యూనిఫైడ్ యాక్సెస్ నంబరు 155220ను కేంద్ర టెలీకమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ కేటాయించింది. ఇందుకోసం కేవలం లోకల్‌కాల్ ఛార్జీ మాత్రమే వసూలుచేస్తారు.(ఈనాడు9.11.2009)
[మార్చు] స్టేషన్ సదుపాయాలు
[మార్చు] భద్రత
[మార్చు] సమస్యలు
[మార్చు] ప్రభుత్వం జోక్యం
[మార్చు] పబ్లిక్ ప్రవర్తన
[మార్చు] కార్మికుల అసంతృప్తి, సమ్మెలు
[మార్చు] ప్రైవేటు రంగం పోటీ
[మార్చు] పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు
[మార్చు] ఇతర విశేషాలు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] మూలాలు
- ↑ http://www.apsrtc.gov.in/About%20Us/Awards/Awards.htm
- ↑ ప్రభుత్వ సెన్సస్ సైటు ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లో 28,123 గ్రామాలున్నాయి. వీటిలో 26,613 గ్రామాలు జనావాసాలు. 1,510 గ్రామాలు నిర్జన గ్రామాలు
- ↑ 3.0 3.1 3.2 ఆర్.టి.సి. సంస్థ అధికారిక వెబ్‌సైటు
