ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2011-12

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ సామాజిక, ఆర్థిక సర్వే 2011-12 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2010-11 సంవత్సరానికి సామాజిక, ఆర్థిక సర్వే [1] నివేదిక ఫిబ్రవరి 18,2012 న శాసనసభలో ప్రవేశ పెట్టబడింది.

ఆర్థిక స్థితి[మార్చు]

1980 వరకు ఆర్థికాభివృద్ధి పెరుగుదల 3 శాతం అటుఇటూగా ఉంది. పదకొండవ పంచవర్షప్రణాళికా కాలంలోని మొదటి నాలుగు సంవత్సరాల స్థూల రాష్ట్ర దేశీయ వుత్పత్తి పెరుగుదల 7.93శాతంగా నమౌదైంది. ఇది భారతదేశంలో 8.16%గా ఉంది.

స్థూల ఆర్థిక గణాంకాలు[మార్చు]

  • 2010-11 లో స్థూల రాష్ట్ర దేశీయ వుత్పత్తి 3,71,007 కోట్ల రూపాయలు (ముందుచూపు అంచనా2004-05 ఆధారిత స్థిర విలువప్రకారం). 2009-10 లో స్థూల రాష్ట్ర దేశీయ వుత్పత్తి 3,40,712 కోట్ల రూపాయలు ( త్వరిత అంచనా2004-05 ఆధారిత స్థిర విలువప్రకారం). ఇది 8.58 శాతం పెరుగుదలని చూపుతుంది. వర్గాల వారీగా చూస్తే వ్యవసాయం 8.39, పరిశ్రమలు 7.79, సేవలు 9.61 గా ఉంది.
  • ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 60, 224 (2010-11) వుండగా రు.51,025 ( 2009-10). ప్రస్తుత ధరల ప్రకారం 18.03 శాతం పెరుగుదల, స్థిర ధరల (2004-05) ప్రకారం 7.97 శాతం పెరుగుదల నమోదైంది.

ప్రభుత్వ విత్తం[మార్చు]

వ్యవసాయం[మార్చు]

  • 80.29 లక్షల హెక్టార్లలో 203.14 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించింది. 2011-12 లో సాగు విస్తీర్ణం 70.60 లక్షల హెక్టార్లకు, 173.05 లక్షల టన్నులకు ఆహారధాన్యాల దిగుబడి తగ్గుతుందని అంచనా.

పారిశ్రామిక అభివృద్ధి[మార్చు]

  • ఐటి రంగంలో ఎగుమతులు రాష్ట్ర ఎగుమతులలో 49శాతం గావుంది. 2.75 లక్షల వుద్యోగస్తులున్నారు. 2010 జూలై 1 నుండి కొత్త ఐసిటి విధానం అమలులోకి వచ్చింది. 57 ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనుమతించగా 43 కొరకై భూ సేకరణ జరగగా 17 క్రియాశీలమయ్యాయి. 4385.92 కోట్ల పెట్టుబడితో 30,817 నేరుగా వుద్యోగాలు, 11,514 ఆధారపడిన వుద్యోగాలు సృష్టించబడ్డాయి.

వనరులు[మార్చు]

  1. "AP Socio Economic survey 2010-11 పరిశీలన తేది Feb 19, 2012". Archived from the original on 2012-03-05. Retrieved 2019-03-22.