ఆకివీడు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?ఆకివీడు మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఆకివీడు |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 15 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
74,766 (2001) • 37601 • 37165 • 78.94 • 83.31 • 74.53 |
ఆకివీడు (ఆంగ్లం Akiveedu), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, మరియు ఆకివీడు మండలానికి కేంద్రాలయం. ఇటీవల బాగా అభివృధ్ధి సాధించి దగ్గర పట్టణమైన భీమవరంతో పోటీపడే స్థాయికి ఎదిగింది.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
ఆకివీడు గ్రామంలో అందరూ వరి పంట ఎక్కువుగా పండిచేవారు. అందువలన ఒకానొక సమయంలో రాష్ట్రములోనే అత్యధికంగా బియ్యం మిల్లులు ఉండేవి. పరిసర ప్రాంతాలు అన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. 1990లో చేపల,రొయ్యల పెంపకం జోరు అందుకుంది. ఆ తరువాత బియ్యం మిల్లులు తగ్గుముఖం పట్టాయి. కాని ఆర్ధికంగా అభివృధ్ధి చెందింది.
రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు ,కొల్లేరు సరస్సు, ఆకివీడు గ్రామం ద్వారా చేరవచ్చు.
ఆకివీడు అక్షాంశ రేఖాంశాలు: 16°36'North,81°23'East. [1]
విద్యా సదుపాయాలు [మార్చు]
- P.L.S.Z.P.P. హైస్కూలు
- C.M.హైస్కూలు
- M.P.P.U.P స్కూలు
- బాలికల హైస్కూలు
- సైన్త్ అలొసియస్ హైస్కూలు
- జిల్లా గ్రంధాలయ సంస్థ లైబ్రరీ: ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి డిజిటల్ లైబ్రరీ. 'DIGITAL LIBRARY' ఇందులో నాలుగు కంప్యూటర్లు ఉన్నాయి.
ఉన్న ప్రాంతము, ప్రయాణ సౌకర్యాలు [మార్చు]
ఆకివీడు సముద్ర తీరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
- రోడ్డు మార్గము
ఈ గ్రామం రాష్ట్ర రహదారి మీద ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ముఖ్య పట్టణాల నుండి, మరియు హైదరాబాదు నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉన్నది. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి రెండు గంటలోపు చేరుకోవచ్చు. ప్రతి 30 నిమిషములకు 1 బస్సు కలదు. ఆకివీడుకు రాష్ట్ర రాజధాని హైదరాబాదునుండి 437 కి.మీ., విశాఖపట్నం నుండి 288 కి.మీ., విజయవాడ నుండి 85 కి.మీ., భీమవరం నుండి 18 కి.మీ. ఇది రోడ్డు, రైలు మార్గములతో చక్కగా కలపబడినది.
- రైలు మార్గము
ఈ గ్రామం విజయవాడ - కాకినాడ లను కలిపే రైలు మార్గము మధ్యలో కలదు. చెన్నై (మద్రాసు), బెంగుళూరు ల నుండి కూడా ప్రయాణ సదుపాయం కలదు.
- విమాన మార్గము
ఇక్కడకి దగ్గ్గ్గరలోని విమానాశ్రయము విజయవాడ. విజయవాడ లేదా విశాఖపట్నం కు వచ్చి అక్కడ నుండి రోడ్డుమార్గములో రావచ్చు.
ఊరిలో జరిగే ఉత్సవములు/జాతరలు [మార్చు]
ఆకివీడు పురవాస ప్రజలకు భక్తి,శ్రధ్ధలు ఎక్కువ. ప్రతీ ఏటా ఉత్సవాలను సంప్రదాయరీతిలో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనవి
- వీరభధ్రస్వామి సంబరం
ప్రతీ ఏటా మహాశివరాత్రి నాడు శంకరుడిని పూజిస్తూ శివాంశ సంభూతుడైన వీరభధ్రస్వామిని కొలుస్తూ సాలిపేటలో వెలసిన వీరభధ్రస్వామి గుడి దగ్గర సంబరాన్ని భక్తి శ్రద్దలతో సంప్రదాయరీతిలో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది శివభక్తులు శివశూలాలను దవడ మీద గుచ్చుకుని ఎడ్లబండ్ల మీద ఊరంతా తిరుగుతారు. ఈ సంబరాన్ని చూడటానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. శివరాత్రినాడు రాత్రి జరిగే "నిప్పుల సంబరం" ప్రత్యేక ఆకర్షణ. ఈ "నిప్పుల సంబరం"లో పాల్గొనాలనుకునే శివభక్తులు ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. అలా ఉన్న భక్తులు మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిప్పులు మీద నడవగలరని ఒక విశ్వాసం. ఈ సంబరంలో ఏదో విధంగా పాల్గొన్న వారికి ఆ సంవత్సరం అంతా బాగా నడుస్తుందని విశ్వాసం.
- సుబ్రహ్మణ్యస్వామి షష్టి
సుబ్రహ్మణ్యస్వామి షష్టిని చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పూర్వకాలంలో చాలా వైభవంగా జరిగేది. ఊరులోని జనమంతా ఆ జాతరలోనే సమయం గడిపేవారు.
- దేశాలమ్మ సంబరం.
చుట్తుప్రక్కల చూడదగ్గ ప్రదేశాలు [మార్చు]
- కొల్లేరు సరస్సు - రాష్ట్రములో రెండొవ అతి పెద్ద నీటి సరస్సు
- ప్రార్ధనా స్థలాలు
- కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం.
- కొల్లేరు పెద్దింట్లమ్మవారి మందిరం
- సెంట్రల్ బాప్టిస్ట్ చర్చి
- పెద్ద మసీదు, చిన్న మసీదు, అన్వారి మసీదు
- ఊరిలో ముఖ్యమైన స్థలాలు
- గాంధీ పార్క్
- సర్ అర్ధర్ కాటన్ మెమోరియల్ పార్కు
- జెడ్-టర్నింగ్
- డైలీ మార్కెట్టు
- బస్ స్టాండ్ ఏరియా
- సమథనగర్ కనక దుర్గ కమి
బయటి లింకులు [మార్చు]
వనరులు [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| అయిభీమవరం · అజ్జమూరు · ఆకివీడు · చెరుకుమిల్లి · చినకాపవరం · అప్పారావుపేట · ధర్మాపురం · దుంపగడప · గుమ్ములూరు · కోళ్ళపఱ్ఱు · కొల్లేరు (నిర్జన గ్రామము) · కుప్పనపూడి · మాదివాడ · పెదకాపవరం · సిద్దాపురం · తరటావ |