ఆక్సిజన్

వికీపీడియా నుండి
8 నత్రజనిఆక్సిజన్ఫ్లోరిన్
-

O

S
O-TableImage.png
సాధారణ లక్షణాలు
పేరు, సంకేతము, పరమాణు సంఖ్య ఆక్సిజన్, O, 8
రసాయన సిరీస్ అలోహాలులు, చాల్కోజెన్‌లు
గ్రూపు, పీరియడ్, బ్లాక్ 16 (IV A)2, P
స్వరూపం colorless (gas)
very pale blue (liquid)
O,8.jpg
ప్రామాణిక పరమాణు భారం 15.9994(3) g·mol−1
ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4
Electrons per shell 2, 6
భౌతిక లక్షణాలు
స్థితి gas
సాంద్రత (0 °C, 101.325 kPa)
1.429 g/L
ద్రవీభవన స్థానం 54.36 K
(-218.79 °C, -361.82 °F)
Boiling point 90.20 K
(-182.95 °C, -297.31 °F)
Critical point 154.59 K, 5.043 MPa
Heat of fusion (O2) 0.444 kJ·mol−1
Heat of vaporization (O2) 6.82 kJ·mol−1
Heat capacity (25 °C) (O2)
29.378 J·mol−1·K−1
Vapor pressure
P/Pa 1 10 100 1 k 10 k 100 k
at T/K       61 73 90
Atomic properties
Crystal structure cubic
Oxidation states 2, −1
(neutral oxide)
Electronegativity 3.44 (Pauling scale)
Ionization energies
(more)
1st: 1313.9 kJ·mol−1
2nd: 3388.3 kJ·mol−1
3rd: 5300.5 kJ·mol−1
Atomic radius 60 pm
Atomic radius (calc.) 48 pm
Covalent radius 73 pm
Van der Waals radius 152 pm
ఇతరత్రా
Magnetic ordering paramagnetic
Thermal conductivity (300 K) 26.58 m W·m−1·K−1
Speed of sound (gas, 27 °C) 330 m/s
CAS registry number 7782-44-7
ముఖ్యమైన ఐసోటోప్‌లు
Main article: ఆక్సిజన్ ఐసోటోప్‌లు
iso NA half-life DM DE (MeV) DP
16O 99.76% O, 8 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
17O 0.038% O, 9 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
18O 0.21% O, 10 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
మూలాలు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

ఆక్సిజన్ (ఆంగ్లం:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటె ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా ఆమ్లజని అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. భూమి మీద వృక్ష జంతు సంపదకి ఆక్సిజన్ అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ఆక్సినన్ ను గ్రహిస్తాయి.ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.

విషయ సూచిక

సంకేతం,ఫార్ములా [మార్చు]

ఆక్సిజన్ యొక్క సంకేతం "O", మరియు అణు ఫార్ములా "O2".

చరిత్ర [మార్చు]

స్వీడన్ దేశస్తుడైన షీలే మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని జోసెఫ్ ప్రీస్ట్‌లీ, షీలే అనే శాస్త్రవేత్తలు 1 ఆగష్టు 1774 తేదిన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్దతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షున్నంగా పరిశీలించి 'ఆక్సిజణ్ అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.

ప్రయోగశాలలో ఆక్సినజ్ తయారీ [మార్చు]

ఆక్సిజన్ ను పొటాషియం పర్మాంగనేట్ (KMnO4), పొటాషియం క్లోరేట్ (KClO3),హైడ్రోజన్ పెరాక్సైడ్(H2O2),పొటాషియం నైట్రేట్ (KNO3) మరియు మెర్క్యురిక్ ఆక్సైడ్ (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.

  1. 2KClO3 → 2KCl + 3O2
  2. 2KNO3 → 2KNO2 + O2
  3. 2HgO → 2Hg + O2
  4. 2NaNO3 → 2NaNO2 + O2

పొటాషియం పర్మాంగనేట్ నుండి తయారీ [మార్చు]

ఒక పరీక్షనాళిక లో కొంత పొటాషియం పర్మాంగనేట్ ను తీసుకొని ఒంటి రంధ్రం గల రబ్బరు బిరడా ను అమర్చి స్టాండుకు బిగించాలి. ఒక గాజు గొట్టాన్ని బిరడా గుండా అమర్చి గొట్టం రెండవ చివరను నీటిలో ఉన్న పరీక్ష నాళిక లేదావాయు జాడీ మూతి వద్ద అమర్చాలి. పరీక్ష నాలికను నెమ్మదిగా చేడిచేయాలి. బుడగల రూపంలో ఆక్సిజన్ వాయువు నీటిని అథోః ముఖ స్థానభ్రంశం నొందించి వాయు జాడి లోనికి వెళ్తుంది.

సమీకరణం: 2KMnO4 → K2MnO4+MnO2 +O2

ఆక్సిజన్ వాయువు పరీక్ష [మార్చు]

ఆక్సిజన్ ఉన్న జాడీలో మండుచున్న పుల్లను పెడితే అది ప్రకాశవంతంగా మండును.

భౌతిక ధర్మాలు [మార్చు]

  • ఈ వాయువుకు రంగు,రుచి,వాసన ఉండవు.
  • దహన శీలి కాదు.దహన దోహదకారి.
  • ఇది గాలి కంటె కొంచెం బరువైనది.
  • ఇది నీటిలో కరుగును.
  • ఇది లిట్మస్ కు తతస్థంగా ఉండును.

ఉపయోగాలు [మార్చు]

  • జీవరాశుల మనుగడకు అత్యంత అవసరమైన మూలకము.
  • ఆక్సి ఎసిటిలీన్, మరియు ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
  • పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
  • సముద్ర అంతర్భాగం లో పరిశోధనలు చేయువారికి అవసరము.
  • అంతరిక్షం లో పరిశోధనలు చేయు వైజ్ఞానికులకు ద్రవరూప ఆక్సిజన్ అవసరం.
  • ప్రమాదాలు జరిగినపుడు రోగి శ్వాస తీసుకోలేని పరిస్థితులళొ ఆక్సిజన్ అవసరం.
  • అప్పుడే పుట్టిన శిశువులకు శ్వాస తీసుకోవడంలో యిబ్బంది వచ్చినపుడు ఆక్సిజన్ గల ఇంక్యుబెటర్ల లో ఉంచుతారు.

రసాయన ధర్మాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఆక్సిజన్&oldid=809377" నుండి వెలికితీశారు