ఆగష్టు 2

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆగష్టు 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 214వ రోజు (లీపు సంవత్సరము లో 215వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 151 రోజులు మిగిలినవి.


<< ఆగష్టు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2014


సంఘటనలు[మార్చు]

  • 0216 బి.సి.- రెండో పునిక్ యుద్ధం: ‘కేన్నే దగ్గర జరిగిన యుద్ధం’ అంటారు – రోమన్ సైన్యం ఓడిపోయింది.
  • 0338 బి.సి.- మసడోనియన్ సైన్యం, ఫిలిప్ II నేతృత్వంలో ఖరొనియా యుద్ధంలో, ఎథెన్స్ దళాలను, తేబెస్ దళాలను కలిపి ఓడించాడు. ఈ యుద్దం వలన, మసడోనియన్ రాజ్యపు పెత్తనం (అదికారం) సురక్షితమైంది.
  • 1375 : మొదటి రోలర్ స్కేటింగ్ రింక్ లండన్ లో మొదలు పెట్టారు. (రెండు కాళ్ళకు, చక్రాలున్న జోళ్ళు, కట్టుకుని, తిరగటాన్ని రోలర్ స్కేటింగ్ అంటారు). ప్రత్యేకంగా తయారయైన వలయంలో ఈ రోలర్ స్కేటింగ్ ని నేర్చుకోవటం, పోటీలు వగైరా జరుగుతాయి.
  • 1769 – ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికి బారసాల జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికి లాస్ ఏంజిల్స్ అని పేరు పెట్టారు. గాస్పర్ ’డి’ పోర్టోల, ఒక స్పానిష్ సైనిక కెప్టెన్, మరియు ఫ్రాన్సిస్కాన్ పూజారి అయిన జువాన్ క్రెస్పి, లు ఇద్దరినీ, శాన్ డీగో ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలా స్పానిష్ భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిల కి ఇటలీ లో ఒక ఒక చిన్న గుడి ఉంది.
  • 1776 : హెన్రీ హడ్సన్ పసిఫిక్ మహాసముద్రం లోని హడ్సన్ బే ని కనుగొన్నాడు. హడ్సన్ పేరుతో, ఆ ప్రాంతాన్ని హడ్సన్ బే గా పేరు పెట్టారు..
  • 1776: కాంటినెంటల్ కాంగ్రెస్ కి హాజరు కావటానికి వచ్చిన ప్రతినిధులు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్ర్య ప్రకటన పై సంతకాలు చేయటం మొదలు పెట్టారు.
  • 1790 : మొదటి సారిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో జనాభా లెక్కలు మొదలు పెట్టారు.
  • 1823 – ‘ది న్యూయార్క్ మిర్రర్ మరియు లేడీస్ లిటరరీ గెజెట్] స్థాపించబడింది. తరువాత కాలంలో ఈ వార పత్రిక, న్యూయార్క్ మిర్రర్ దినపత్రిక గా మారింది
  • 1870 : ప్రపంచంలో మొదటి భూగర్భ ట్యూబ్ రైల్వే, టవర్ సబ్‍వే, లండన్ లో ప్రారంభించారు..
  • 1887 - బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం, అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కి ముళ్ళ తీగ (ముళ్ళకంచె పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకి రక్షణకి కంచెగా, హద్దులుగా వాడుతున్నాము.
  • 1892 : జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్) , చిత్రాల రారాజు. హాలీవుడ్ లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి; మ. 9 సెప్టెంబర్ 1978
  • 1903 : ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం అయ్యింది.
  • 1914 : షెర్లాక్ హోమ్స్ సాహస గాధ "హిజ్ లాస్ట్ బౌ" నవల విడుదలైంది.
  • 1916 : మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన Taranto లో ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొ లో ములిగి పోయింది.
  • 1931 : సైన్యానికి సంబంధించిన ఏ పనినైనా, తిరస్కరించమని, ఐన్‌స్టీన్, విజ్ఞానవేత్తలను కోరాడు.
  • 1937 : మారిజునా , దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము).
  • 1939: మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబు ని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మరియు లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటి అమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు.
  • 1943 – ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో , ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109 ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీ కి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీ గా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109 లో హాలీవుడ్ శైలిలో చెప్పారు.
  • 1943 : ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది.
  • 1945 : రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు.
  • 1967 : రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం)లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం.
  • 1984 : ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం, తప్పు అని, పోలీసులను మందలించింది.
  • 1985: "లాక్‌హీడ్ ఎల్-1011 ట్రైస్టార్" కి చెందిన "డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 191", "డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం" వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు.
  • 1990 : ఈ రోజు ఉదయాన్నే, ఇరాక్ , లక్షమంది సైనికులతో, 700 యుద్దటాంకుల దన్ను రాగా, 700 కువైట్ మీద దురాక్రమణ చేసింది.
  • 1990 : ఇరాక్ కువైట్ ను ఆక్రమించగానే, ఎమీర్ సౌది అరేబియా పారిపోయాడు. యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్య సమితి) భద్రతా మండలి ఏకగ్రీవంగా ఇరాకీ అక్రమణను ఖండించింది. అంతే కాదు, ఇరాక్ మీద పూర్తి దిగ్బంధం విధించింది.
  • 2009 : 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది.
  • 2009 AIDS కలిగిస్తుంది వైరస్ యొక్క ఒక కొత్త రకం
  • 2009 : ఎయిడ్స్డ్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్, కామెరూన్ దేశంలో నివశిస్తున్న ఒక మహిళ లో కనుగొన్నారు.

జననాలు[మార్చు]

  • 1696 : ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లు తో యుద్ధం చేసాడు. (మ. 13 డిసెంబరు 1754).
  • 1754 : ఫ్రాన్స్ కి చెందిన పియరి చార్లెస్ లీ ఎన్పేంట్, ప్రసిద్ధి పొందిన సివిల్ ఇంజనీరు, ఆర్కిటెక్ట్ వాషింగ్టన్ డి.సి. లోని వీధులను ప్రణాలిక ప్రకారం అత్యంత మనోహరంగా రూపు దిద్దిన వాడు. వాషింగ్టన్ డి.సి. రూపకర్త, రూపశిల్పి. (9 ఆగష్టు 1754 అని ఇంగ్లీష్ వికీపీడియా).
  • 1824 { ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది.

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

  • తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
  • [[]] - [[]]

బయటి లింకులు[మార్చు]


ఆగష్టు 1 - ఆగష్టు 3 - జూలై 2 - సెప్టెంబర్ 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"http://te.wikipedia.org/w/index.php?title=ఆగష్టు_2&oldid=1326910" నుండి వెలికితీశారు