ఆగష్టు 29
వికీపీడియా నుండి
ఆగష్టు 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 241వ రోజు (లీపు సంవత్సరము లో 242వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 124 రోజులు మిగిలినవి.
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1842 - నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్)ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు.
- 1885 - గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు.
- 1898 - గుడ్ ఇయర్ టైర్ల కంపెనీని స్థాపించారు.
- 1910 - జపాన్ కొరియా పేరును ఛోసెన్ గా మార్చీ, ఆ కొత్త వలసను పాలించటానికి ఒక గవర్నర్ జనరల్ ను నియమించింది.
- 1915 - యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
- 1916 - ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది.
- 1930 - సెయింట్ కిల్డా లో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
- 1944 - స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60,000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగష్టు ని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
- 1949 - సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
- 1957 - స్ట్రామ్ థర్మాండ్ , అమెరికన్ సెనేట్ లో 24 గంటలకు పైగా సివిల్ రైట్స్ బిల్లు పై వ్యతిరేకంగా మాట్లాడి రికార్డు సృష్టించాడు. ఆ బిల్లు పాస్ అయ్యింది.
- 1958 - యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
- 1965 - అమెరికన్ రోదసి నౌక జెమిని-5 భూమికి తిరిగి వచ్చింది
- 1966 - బీటిల్స్ (గాయకుల బృందం] తమ చివరి కచేరిని అమెరికాలోని, సాన్‌ఫ్రాన్సిస్కో లోని కేండిల్‌స్టిక్ పార్క్ దగ్గర చేసారు.
- 1982 - కృత్రిమంగా తయారుచేసిన రసాయన మూల్లకం మీట్నెరియం (అటామిక్ నెంబరు 109) ని మొట్టమొదటిసారిగా జర్మనీ లోని, డార్మ్‌స్టాడ్ దగ్గర గెసెల్‌స్చాఫ్హ్ట్ ఫర్ స్చెరిఒనెన్ఫొర్స్కంగ్
- 1984: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
- 1986 - బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమంది లో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు
- 1991 సుప్రీం సోవియెట్ (రష్యా పార్లమెంటు) కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాలను ఆపి వేసి, కమ్యూనిస్ట్ పార్టీకి చరమ గీతం పాడింది.
- 2005 - హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి , లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1,000 మంది మరణానికి కారణమయ్యింది.
జననాలు[మార్చు]
- 1863: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త.
- 1905: ధ్యాన్ చంద్ (మ.1979) - హాకీ క్రీడాకారుడు.
- 1926: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే.
- 1929: ప్రముఖ దక్షిణభారత చలనచిత్ర నేపథ్యగాయని రావు బాలసరస్వతి.
- 1958: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కాళాకారుడు.
- 1959: అక్కినేని నాగార్జున, తెలుగు సినీ నటుడు.
మరణాలు[మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం). భారతదేశపు హాకీ క్రీడను ప్రపంచ దేశాల్లొ చాటాడు. అందుకని ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించి ప్రతీ సంవత్సరం అమలు చేస్తుంది.
- తెలుగు భాషా దినోత్సవము - గిడుగు రామమూర్తి జయంతి నే తెలుగు భాషా దినోత్సవము గా జరుపుతున్నారు.
బయటి లింకులు[మార్చు]
ఆగష్టు 28 - ఆగష్టు 30 - జూలై 29 - సెప్టెంబర్ 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |