ఆచంట వేమవరం
ఆచంట వేమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామము. ఆచంట మరియు పాలకొల్లు ప్రధాన రహదారిమీద ఉన్న ఈ గ్రామంలో 90 శాతం ప్రజల ముఖ్య వృత్తి చేనేత అన్ని రకాల చేనేతలు నేయగల నేతకారులు గలరు. వరి ప్రధాన వ్యవసాయము, కొంత వరకూ చెరకు పండించువారు కలరు. ఈ ఊరి లోపలి నుండి వల్లూరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, పెనుమంచిలి గ్రామాలకు మార్గములు కలవు.ఈ ఊరి మీదుగా ఒక జనవాఖ్యం ప్రసిద్దమై ఉన్నది. పుల్లయ్యను యజమాని పుల్లయ్యా రేప్పొద్దున్నేవేమారం వెళ్ళిరారా అన్నాడట పొద్దుట లేచిన పుల్లయ్య వేమవరం వేళ్ళి వచ్చేసాడు ఎక్కడకెళ్ళావురా పుల్లయ్యా అని అడిగితే మీరే కదండీ పొద్దున్నే వేమారం వెళ్ళిరమ్మన్నారు అన్నాడట. పనేంటో తెలుకోకుండా చేయకుండా వెళ్ళి వచ్చేసేవాళ్ళను గూర్చి 'పుల్లయ్య వేమవం వెళ్ళినట్టుగా ఉంది'లేదా 'పుల్లయ్య యవ్వారం'అనేదివాడుకై ఉంది. ఈ ఊరిలో శివాలయము ప్రక్కన కోనేరు కలిగి అందముగా ఉండును.
|
|
|
|---|---|
| ఆచంట · ఆచంట వేమవరం · భీమలాపురం · కొడమంచిలి · కందరవల్లి · కరుగోరుమిల్లి · కోడేరు · పెదమల్లం · పెనుమంచిలి · వల్లూరు · కంఛుస్థంభం పాలెం |