ఆచంట శరత్ కమల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆచంట శరత్ కమల్

ఆచంట శరత్ కమల్ (జననం: జులై 12, 1982) ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందినవాడు. చెన్నై లయోలా కళాశాలలో చదివాడు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఉద్యోగి.[1]

2022 ఆగస్టు నాటికి ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళలో కమల్ ది 39వ స్థానం.

విజయములు, పురస్కారాలు[మార్చు]

  • 2004 లో కౌలాలంపూర్లో జరిగిన 16వ కామన్ వెల్త్ క్రీడలలో బంగారు పతకము సాధించాడు.
  • 2004 లో భారత ప్రభుత్వము అర్జున పురస్కారముతో సన్మానించింది.
  • 2006 లో కొలంబోలో జరిగిన దక్షిణ ఆసియా క్రీడలలో నాలుగు పతకములు గెలిచాడు.
  • 2006 లో మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడలలో రెండు బంగారు పతకములు సాధించాడు
  • 2007 లో ఉత్తర కొరియా లోని ప్యోంగ్ యాంగ్ అంతర్జాతీయ టూర్నమెంట్ గెలిచాడు.
  • 2008 లో నాలుగవ సారి జాతీయ ఛాంపియన్ గా ఎన్నుకొనబడ్డాడు.
  • 2010 లో గౌహతిలో జరిగిన 71వ జాతీయ ఛాంపియన్ గా గెలిచాడు.
  • 2019 లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

మూలాలు[మార్చు]

  1. శరత్ కమల్: http://www.achantasharathkamal.com/index.html Archived 2010-04-01 at the Wayback Machine